బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–విశ్వక్షేణ దర్శనం

IMG_0442IMG_0448IMG_0445IMG_0457IMG_0458

    నా ఉద్దేశ్యంలో ఈ యుగానికి శ్రీ ముళ్ళపూడి, శ్రీ బాపు గార్లను ” నర నారాయణులు” అనొచ్చు. ఇక్కడ రాజమండ్రీ లో వారి “ వీరాభిమాని ” ఒకరున్నారు. ఆయనే శ్రీ ఎమ్.వి.అప్పారావు గారు. ఆయన ” సురేఖ” పేరుతో వివిధ తెలుగు, ఆంగ్ల పత్రికలలో 1958 నుండీ కార్టూన్లు వేస్తున్నారు.అప్పటినుండీ శ్రీ బాపూ గారు వేసిన, ప్రచురించబడిన కార్టూన్లు అన్నీ, ఒక పుస్తకంలో పెట్టి ఆరు సంపుటాలుగా తయారు చేశారు ( పైన ఉన్న ఆఖరి ఫొటో). ఎక్కడైనా, బాపూ రమణ గార్ల పేరు వస్తే చాలు, అవన్నిటినీ కట్ చేసి వాటిని ఒక పుస్తకంలో పెట్టడం ఒక హాబీ. ఇవన్నీ 2005 దాకా అజ్ఞాతంగా చేశారుట. అప్పుడు మొదటిసారి శ్రీ బాపూ రమణ గార్లని కలుసుకున్నారుట. అప్పటినుండీ, ఆ నరనారాయణులతో ఉత్తర ప్రత్యుత్తరాలూ వగైరా…

    మాకు శ్రీ అప్పారావు గారితో పరిచయం రాజమండ్రీ ” హాసం’ క్లబ్బు మీటింగులో అయింది. అప్పటినుండీ వారింటికి వెళ్ళి కలుద్దామనుకున్నా, సందర్భం కలసి రాలెదు. ఇన్నాళ్ళకి ఆ సందర్భం వచ్చింది. ప్రొద్దుటే ఫోన్ చేసి, వారింటికి పదకొండు గంటలకి, వెళ్ళిన వాళ్ళం, రెండింటిదాకా, అక్కడే కూర్చున్నాము. అబ్బ చెప్పలేనండి, ఆయన పుస్తకాల కలెక్షనూ, రికార్డుల కలెక్షనూ, బాపు, రమణల కార్టూన్లూ , కడుపు నిండిపోయిందంటే నమ్మండి.

    మొదటి ఫొటో లో చూడండి–అందులో ఉన్నది ఆయనే. పరిశీలనగా చూస్తే ఆయనకీ, శ్రీ ముళ్ళపూడి వారికీ పోలికలు కనిపిస్తాయి !!క్రితం జన్మలో అన్నదమ్ములెమో !! ఆయన ప్రక్కనే ఉన్న ” చిన్న దానిని” చూశారా? అది పూర్వకాలపు గ్రామఫోనండి బాబూ. ఇంకా అక్కడ 1953 నుండీ ” చందమామ” సంచికలన్నీ బైండ్ చేయించి ఉంచారు. అలాగే “ బాల “ కూడా !!

    అందుకనే శ్రీ అప్పారావుగారిని విశ్వక్షేణుడు అన్నాను. ఈయన దర్శనం అయింది కాబట్టి త్వరలోనే ఆ ” నర నారాయణు” ల దర్శనం లభించాలనే మా చిరకాల కోరిక తీరుతుందని ఆసిస్తూ …..

%d bloggers like this: