బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ మధ్యన రెండు మూడు సందర్భాల్లో నన్ను అడిగారు–‘మీరు దేముడిని నమ్ముతారా? మీకు జ్యోతిష్యం మీద నమ్మకముందా” అని. రెండింటికీ నా సమాధానం ఔననే.నెను చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణమనండి,అప్పుదప్పుడు జరిగిన సంఘటనలనండి, నాకు దేముడిమీద నమ్మకం వృధ్ధి చెందిందే కానీ, తగ్గలెదు.దేముడు ఉంటే చూపించండి అనే వారికి దూరంగా ఉంటాను అలాటి వారితో ఆర్గ్యూ చేసేటంత ఓర్పు లేదు.దానిని మీరు ఎస్కేపిజం అన్నా నాకొచ్చే నష్టం లెదు. నా నమ్మకం నాది. చిన్నప్పుడు పిల్లలకి ప్రార్ధన చేసికోవడం అలవాటు చేశాము. అదృష్టంకొద్దీ, వాళ్ళుకూడా మా మాట విన్నారు.

    మా మనవరాలు చి. నవ్య ఈ మధ్యనే మూడు సంవత్సరాలు నిండాయి, వాళ్ళ అమ్మనీ, నాన్ననీ చూసి తనుకూడా స్నానం చేసిన తరువాత గాయత్రీ మంత్రం ఒక సారి చెప్పేస్తుంది, ఆ తరువాత ” శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు, మా తల్లి లత్తుకకు నీరాజనం–భక్తి పెంపైన నీరాజనం… ” అంటూ వాళ్ళ అమ్మ తో గొంతు కలుపుతుంది. తరువాత బాల్కనీ లోకి వెళ్ళి “సన్ గాడ్ “ ని ప్రార్ధిస్తుంది.రాత్రిళ్ళు భోజనానికి ముందు అందరం తను చెప్పిన ” ప్రేయర్ ” చెప్తేకానీ, ముద్ద ముట్టుకోనీయదు.ఇదంతా ఎక్కడనుంచి వచ్చిందంటారు?తన తల్లి తండ్రులనుంచే కదా! వాళ్ళు చిన్నప్పటినుంచీ పెరిగిన వాతావరణం వల్లనే కదా.

    నాకు ఇంకో చిత్రమైన అనుభవం కూడా ఉంది--భద్రాద్రి రాముడు, సింహాచలం అప్పన్నా, అన్నవరం సత్యదేముడూ, కొల్హాపురి లక్ష్మీదేవీ,— ఈ దేవాలయాల్లో మూలవిరాట్టు ప్రక్కనే ఉండి పూజ చేసికున్నాను! అలాగే 1983 లో షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు( మొట్టమొదటి సారి) ప్లాట్ఫారం పైకి వెళ్ళి స్వామి మెడలో పూలహారం వేయకలిగాను. కొల్హాపురి లక్ష్మీదేవి గుడి లో అమ్మవారి పాదాలు స్పర్శించే భాగ్యం కలిగింది.అప్పుడు నాలో కలిగిన ప్రకంపనాలు వర్ణించలేను!

చిన్నప్పుడు అవతార్ మెహర్బాబా గారి పాదచరణాలు స్పర్సించే అదృష్టం కూడా కలిగింది. రాజమండ్రీ లో మెహర్బాబా వారి మీద కార్యక్రమాలు తరచూ జరుగుతూంటాయి. ఒకసారి మా సొసైటీ లో జరిగిన కార్య్క్రమం సందర్భంలో చెప్పాను, ఆయన పాదస్పర్శచేసికున్నానూ అని. అంతే అందరూ నన్నుఎమ్తో పుణ్యం చేసికున్నవారిలా చూసి, ఇంకా గౌరవించడం మొదలు పెట్టారు.

    అలాగని నాకు ఏమీ మూఢ నమ్మకాలు లేవు.ప్రొద్దుట, సాయంత్రం స్నానం చేసి ఓ పది నిమిషాలు కళ్ళుమూసుకొని నెను జీవితంలో దర్శించుకొన్న ప్రతీ దేముడినీ, అమ్మవారినీ ఒకసారి స్మరించుకుంటాను. జీవితం ప్రశాంతంగానూ, మనశ్శాంతితోనూ గడచిపోవాలని, నాకుటుంబం అందరి తరఫునా ప్రార్ధిస్తాను.ఇప్పటిదాకా అలాగే జరిగిపోతూంది. ఇటుపైన కూడా జరుగుతుందని నమ్మకం ఉంది.

దేముడిమీద భక్తి ఉందని చూపించుకోవడానికి వంటినిండా వీభూతీ, కుంకం, పెట్టెసుకుని పేద్ద గొంతుకుతో ప్రార్ధనలె చేయక్కరలెదు.నిశ్శబ్దంగా, ఏ హంగూ ఆర్భాటం లేకుండా కూడా మన పని మనం చేసికోవచ్చు.మన నడవడిక, మాటా సరిగ్గా ఉంటే చాలు. అవి ఎప్పుడు సరీగా ఉంటాయీ? మన ‘థాట్ ప్రాసెస్ పాజిటివ్“గా ఉంటే, మన నడవడిక కూడా బాగానే ఉంటుంది.

    పూజలూ, పునస్కారాలూ మా ఇంటావిడ మా అందరి తరఫునా ప్రతీ రోజూ చేస్తుంది. ఓ గంట సేపు అవన్నీ పూర్తి అయితేకానీ ఆ పూజా మందిరం దగ్గరనుండి లెవదు. ఈ వ్యవహారాలాన్నింటికీ ఇంటి ఇల్లాలు సహకారం ఉంటేనే సవ్యంగా జరుగుతాయి. ఒక్కొక్కచోట ఇల్లాలికి ఈ నమ్మకాలు ఉన్నా, భర్త సహకారం ఒక్కొక్కప్పుడు ఉండదు.నా సలహా ఏమిటంటే, ” మీకు నమ్మకం లేకుంటే మీరు చేయకండి, కానీ చేసేవారిని నిరుత్సాహ పరచకండి. ఆవిడ కుటుంబ శాంతి, సౌభాగ్యాలకోసమే చేస్తూంది”

    నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో మా స్నెహితుడొకడుండేవాడు, ( ఇప్పటికీ అతనితో స్నేహం కొనసాగుతోంది)–ఎప్పుడూ ” రేషనలిస్ట్ ” పత్రికలిచ్చి నన్ను చదవమని బలవంతం చేసేవాడు. ఆల్బర్ట్ కామూ, నిరాధ్ చౌదరీ వాళ్ళ పుస్తకాలే చదివేవాడు. ఆ రోజుల్లో ” నౌ” అని ఒక పత్రిక వచ్చేది. దానికి యావజ్జీవ చందా కట్టేశాడు.దేముడూ అదీ ఒట్టి క్రాప్ అనేవాడు. నేను చెప్పాను ” చూడు గురూ, నన్నొదిలేయ్, నువ్వు చెప్పేవుకదా అని నా నమ్మకాలు వదులుకోలేను నీ గొడవేదో నువ్వు పడు.” ఆ తరువాత కొంతకాలం నాకు ట్రాన్స్ఫర్ అయి, అతనిని కలవడం కుదరలేదు. చాలా రోజుల తరువాత కలిస్తే ఏదో మాట్లాడుతూ ” ఓ గాడ్ అన్నాడు. “అర్రే నీ నోటినుండి ఈ కొత్త పదం ఏమిటీ ” అన్నాను.అంటే తనన్నాడూ ” పెళ్ళి అయి సంసారం వచ్చేదాకా మనం ఎన్ని నఖ్రాలు చేసినా ఫర్వాలెదూ,అప్పుడు తెలుస్తుందీ దేముడంటే ఏమిటీ ” అని.ఇప్పుడు ప్రతీ ఆదివారమూ చర్చ్ కి వెళ్ళకుండా ఉండడు. అవన్నీ గుర్తు చేసికొని నవ్వుకుంటూంటాము.

    చివరగా నెను చెప్పేదేమిటంటే, నా అనుభవం మీద ” దేముడిని నమ్మడం వలన నష్టం ఏమీలేదు. ఉంటే అంతా లాభమే !!

మా కజిన్  కూతురు తన తమ్ముడి వివాహ సందర్భంలో రిసెప్షన్ సమయంలో అతిథులకి ఇవ్వడానికి  స్వంతంగా తయారు చేసిన పసుపూ, కుంకం, పువ్వు.

%d bloggers like this: