బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు -44


    మేము మా అమ్మాయికి వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నప్పుడు, మా మిత్రులు కొంతమంది పైకి చెప్పకపోయినా, లోలోపల దీనికి ఆమోద ముద్ర వేయలెదేమో ననిపించింది. ఇందులో వారినీ తప్పు పట్టలేము. కానీ తల్లితండ్రులుగా మేము మా అమ్మాయి గురించి ఆలోచించాలికానీ, మిగిలిన వారి గురించికాదుగా.

    23 సంవత్సరాలు మేము అడిగినట్లుగా చదువుకుని, తనకోసమై ఏమీ కోరుకోకుండా, తన జీవిత భాగస్వామి విషయంలోనే తన ఆలోచన మాతో పంచుకుంది. అలాగని, ఏమీ మమ్మల్ని బలవంత పెట్టలేదు, మాకిష్టమైతేనే ఆ అబ్బాయితో వివాహం చేయమంది.

మాకు తను చెప్పిన పాయింట్లు ( ఆ అబ్బాయి గురించి) నచ్చాయి. మేమూ ఆ అబ్బాయిని 5 సంవత్సరాలు చూశాము. ఎదో పట్టుదలలకి వెళ్ళి మాకు నచ్చిన సంబంధమే, సాంప్రదాయాలకి కట్టుబడి చేస్తే, అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళౌతాము. ఎవరో మధ్యవర్తి తెచ్చిన సంబంధం గురించి మనకేమి తెలుస్తుంది చెప్పండి? అమ్మాయీ, అల్లుడూ సుఖంగా కాపురం చేస్తే చూడాలని ఏ తల్లితండ్రులకి ఉండదు?

కొంతమందిని చూశాము–వారి పిల్లలు తమకిష్టమైన వారిని పెళ్ళిచేసికుంటామన్నప్పుడు పేద్ద హడావిడి చేసేసి, -” మేం చూసిన సంబంధం చేసికుంటే సరే సరి, లేకపోతే నీకూ, మాకూ ఏం సంబధం లేదు, నువ్వు మాకు కొడుకు/కూతురు కావు, నువ్వు పుట్టలేదే అనుకుంటాము “ అని వారిని బయటకు పంపేయడం, ఏడాది తిరగకుండా , వీళ్ళు ఏ అమెరికా లోనో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడమూ. ఇలాంటి హిపోక్రసీ మాకు నచ్చదు.అదేదో ముందరే ఒప్పుకుంటే అందరికీ బాగుంటుందిగా!

    మా అబ్బాయి క్లాస్ 12 పరీక్షలు పూర్తి అయిపోగానే పూణే లో వివాహం చేయడానికి అన్ని ఎరేంజ్మెంట్లూ పూర్తి చేశాను. మంగళ సూత్రాలూ, మట్టెలూ, యజ్ఞోపవీతాలూ, మధుపర్కాలూ, మా మామగారు తణుకు నుండి తీసుకువచ్చారు. మిగిలినవన్నీ పూణే, జలగాం లలో కొన్నాము.ఎత్తి పెట్టినట్లుగా పూణే వెళ్ళి వివాహం చేయడం కొంచెం శ్రమే అయింది. ముందుగా నేనూ, మా అబ్బాయీ విలువైన వస్తువులన్నీ ట్రైన్ లో తీసికెళ్ళిపోయాము. ఆ తరువాత, మా ఇంటావిడా, అత్త మామలూ వాన్ లో వచ్చారు.

    వివాహానికి మా వైపునుండీ, అబ్బాయి వైపునుండీ అందరు చుట్టాలూ వచ్చారు. వివాహం ఓ తెలుగు పురోహితుడు గారు చేయించారు. పంజాబీ పధ్ధతిలోనూ, మేము నిశ్చయించిన ముహూర్తానికి మన సాంప్రదాయం ప్రకారం వివాహం పూర్తి చేశాము.రాత్రి ముహూర్తం, తెల్లవారెసరికి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు.

సర్వేజనా సుఖినోభవంతూ. ఇప్పుడు మాకు ఓ మనుమరాలూ, మనవడూ. అంతా క్షేమం !!

నాచేత ఓ మంచి పని చేయించినందుకు ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞుడిని.

16 Responses

 1. బాగా చెప్పారు లక్ష్మీఫణి గారూ. పెళ్ళి రెండు కుటుంబాల కలయిక. మా శ్రీ వారు అంటూ ఉంటారు పిల్లలకి మంచి జీవితభాగస్వాములని ఎంచుకోవడము నేర్పాలి మనము కానీ మన ఇష్టాయిష్టాలను వాళ్ళ మీద రుద్ద కూడదు అని. మీరు ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టారు. మా పిల్లల విషయములో కూడా అవసరము అయితే మీ లాగా మెచ్యూర్డ్ గా మేము మెలగ గలగాలని ఆశిస్తున్నాను.

  Like

 2. బావుంది..మంచి పని చెసారు.
  ఇంకొ విషయం .. మీరు అంధ్ర వచ్చినప్పుడు తణుకు లొ సెటిల్ అవ్వాల్సింది కదా.. రాజమండ్రి యెంచుకున్నారు? తణుకు చాలా బాగుంటుంది కదా 🙂

  Like

 3. సంతోషం…

  Like

 4. Good Luck for the future. Tatagarini manavallu busy ga unchuthunarru anukontannu.

  I had been waiting to see your take and how “Solar Eclipse” went in your area. Please fill us in on that. Would love to hear how the wonderful sight was!

  Like

 5. Hi Mastaru,

  This month we have varalakshmi vratam, but we do not have book. If you get any link or a copy of book , please share, so that we can do our prayers. thanks in advance.

  Like

 6. లక్ష్మణ్,

  మరీ పెద్దవారమని గౌరవం ఇచ్చి నన్ను అడిగారు కానీ, గూగుల్ లో వెతికితే కావలిసినన్ని లింకులు దొరుకుతాయి. అయినా అడిగారు కాబట్టి….http://telugu-vara-mandi.blogspot.com/2009/07/vara-lakshmi-vratam.html . ఇదె కాకుండా ఇంకా, ఆడియో లు కూడా ఉన్నాయి.

  Like

 7. కొత్తపాళీ, పానీపూరీ,

  థాంక్స్

  Like

 8. ప్రసాద్,

  ఒక విషయం చెప్పనా బాబూ, తణుకులో ఇల్లు కట్టుకుని అమ్మేశాము, రాజమండ్రీ లో కూడా ఓ ఫ్లాట్ బుక్ చేసి, వదిలెసికున్నాను. ప్రస్తుతం అపార్ట్మెంట్ అద్దెకు తీసికుని ఉంటున్నాము!!
  That is what destiny is all about, dear!!

  Like

 9. నరసింహరావు గారూ,

  ధన్యవాదాలు.

  Like

 10. Uma,

  Thanks. We watched the Eclipse on TV !! It was totally cloudy on that day.

  Like

 11. పానిపూరీ,

  ఒకదానిమీద ” నేను సమయం వచ్చినప్పుడు అడుగుతానూ, అంతవరకూ సస్పెన్స్ ” అన్నారు. నిరభ్యంతరంగా అడగొచ్చు. దేనికైనా సమాధానం చెప్తాను. ఆ సస్పెన్స్ ఏదో విప్పేయండి !!

  Like

 12. కామెశ్వరి గారూ,

  నా బ్లాగ్గు నచ్చినందుకు సంతోషము.

  Like

 13. లక్ష్మణ్,

  మీరు అడిగిన వరలక్ష్మి వ్రతం గురించి ఈ లింకు లూ కూడా చూడండి—http://www.teluguone.com/bhakti/nomu/index.jsp

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: