బాతాఖాని–తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–Government

    బహుశా నేను గవర్నమెంట్ లో 42 ఏళ్ళు పనిచేయడం వల్లనేమో, వాళ్ళు చాలా welfare measures తీసికున్నారూ అనిపించేది. ప్రయాణాల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని( ఏ పార్టీ అయినా సరె) విమర్సిస్తే చాలా బాధ పడేవాడిని.వీలున్నంత వరకూ వాదించేవాడిని. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూంటే, ఏమోఅందరూ చెప్పేదే కరెక్టేమో అనిపిస్తోంది.

    ఈ వేళ hm tv లో ఒక చర్చా కార్యక్రమం చూశాను—” గోదావరి అవినీతి గట్టులు” అనో మరేదో పేరో–గురించి. దాంట్లో 1986 లో గోదావరి నదికి వచ్చిన వరదల తరువాత, గోదావరీ పరివాహకప్రాంతం లో ఏటి గట్లు బలం చేయడానికి ఎన్నెన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశారట, కానీ ఈ నాటి పరిస్థితి చూస్తూంటే దానికి విరుధ్ధం గా ఉంది. డబ్బు ఖర్చు చేశారు, కానీ వీటి పనులమీద కాదుట. అప్పుడున్న ఇంజనీర్లూ, రాజకీయ నాయకులూ తమ తమ జేబులు నింపుకోడానికని అనిపిస్తోంది. ఆ చర్చా కార్యక్రమం లో వాళ్ళు చెప్పే వివరాలు వింటూంటే మన దేశం ఎక్కడికి వెళ్తుందో అనిపిస్తుంది.

ఈ మధ్యన వార్తా పత్రికల్లో ఒక వార్త వచ్చింది--కోనసీమ లో భూమి క్రుంగిపోతూందని– ఎంతో బాధ వేసింది. కోనసీమ గురించి వినని వాళ్ళెవరూ ఉండరు,అలాంటి సహజ సౌందర్యమైన ప్రాంతాన్నికూడా మన ప్రభుత్వాల వైఫల్యం వలన మనం కాపాడుకోలేక పోతున్నాము.

   పైన చెప్పిన కార్యక్రమంలో ఒకాయన తను ఎన్నో సంవత్సరాలనుండి చేస్తున్న పోరాటం గురించి చెప్పారు–ఆయన complaint చేసినప్పుడల్లా, ప్రభుత్వం, ఓ కమెటి ని ఏర్పాటు చేసి, ఒకరో ఇద్దరో సీనియర్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం, మన కన్నీళ్ళు తుడవడానికి–ఓ రెండు నెలలలోపులోనే ఆ సస్పెండ్ చేయబడ్డ ఉద్యోగిని ప్రమోషన్ మీద ఇంకో చోటకి వేయడం. అంతే. ఈ చర్చా కార్యక్రమంలో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీ ల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వాళ్ళేదో ఊడబొడిచేరనీ చెప్పలెముకదా, తెలుగుదేశం వాళ్ళూ చాలా సంవత్సరాలు పాలించారు. అయినా మనం ఎక్కడున్నావు గొంగళీ అంటే అక్కడే అన్నట్లుగా ఉంది.

ఏ పార్టీ అయినా సరే ప్రజలకోసం ఎవరూ పనిచేయరు. వాళ్ళు ఉండే 5 సంవత్సరాల్లోనూ ఎంత సంపాదించుకోగలమూ అనే చూస్తారు.

    మన బాంకు ల సంగతే చూడండి -మీరూ, నేనూ ఏదైనా అప్పుకోసం వెళ్తే సవాలక్ష ప్రశ్నలూ, ఎక్కడాఆ లేని హామీలూ అడుగుతారు. అదే ఏ రాజకీయ నాయకుడికైనా అప్పు కావాల్సివస్తే నిమిషాల్లో వచ్చేస్తుంది. బాంకు లకున్న Non Performing Assets అన్నీ వీళ్ళ ధర్మమే.దేశంలో ఎక్కడైనా fraud జరిగిందని తెలిస్తే

దాని వెనుకాల రాజకీయ నాయకుడి చెయ్యి ఉన్నట్లే. ఒఖ్ఖడంటే ఒఖ్ఖడు నిజాయితీగా పనిచేయడు. ఈ మధ్యన చదివెఉంటారు–AICTE వాళ్ళందర్నీ అరెస్ట్ చేశారుట,మన పురందరేశ్వరి గారు ” నాకు ఆవిషయం ఇదివరకే తెలుసునూ, ఓ రిపోర్ట్ కూడా తయారుచెసి ఆప్పటి మంత్రి అర్జున్ సింగ్ గారికి ఇచ్చానూ, దానిని బుట్టదాఖలా చేశారూ” అని తన తప్పేమీ లేనట్లూ, అంతా పైవాళ్ళలొపం వల్లే జరిగిందన్నట్లు చెప్పారు. అంత sincere అయితే అప్పుడే ఎందుకు బయటకు తీసుకురాలెదుటా? మన రామలింగరాజు కూడా ఈ రాజకియనాయకుల అండదండలు లేకుండా అన్నన్ని ఘోరాలు చేయకలిగేవాడా? మా Ordnance factories కి ఒకానొకప్పుడు Chairman గా పనిచేసిన ఓ ప్రబుధ్ధుడు ఘోష్ అన్నవాడిని ఈ మధ్యనే అరెస్ట్ చేశారు.

    టి.వి. న్యూస్ పెడితే చాలు క్రింద scroll ల్లో చూపిస్తూంటారు, లెకపోతే breaking news లో, ఎక్కడో ఎవడినో అరెస్ట్ చేశారూ అక్రమ ఆస్థుల గురించీ అని. అదేమిటో ఒక్క రాజకీయ నాయకుడుకూడా ఇప్పటి దాకా ఈ కారణం చేత అరెస్ట్ అవలెదు. అయిన ఒక్క లాలూ ప్రసాద్దూ బైలుమీద బయటకు వచ్చి ఇంకో 10 సంవత్సరాలు మంత్రి గా పనిచెసి ఇంకో 10 తరాలదాకా సరిపోయే ఆస్థి సంపాదించాడు.మీరూ, నేనూ ఇలా బ్లాగ్గులు వ్రాసుకుంటూ బ్రతికేస్తున్నాము.

    ఒక్కొక్కప్పుడనిపిస్తుంది ఈ రాజకీయ నాయకులని చూస్తే వీళ్ళు చేసికున్న పుణ్యం ఏమిటీ, మన సామాన్య జనం చేసికున్న పాపం ఏమిటీ అని. ఏ క్వాలిఫికేషనూ అవసరం లెదు, ఏమీ శ్రమ పడవలసిన అవసరం లెదు, బజార్లో కాయగూరలు కొనక్కర్లెదు,బస్సులో నుంచొని ప్రయాణం చేయనవసరం లెదు,రైల్లో టికెట్లు కొనక్కర్లెదు, పిల్లల్ని చదివించడానికి కాన్వెంట్లూ, కాలెజీలకీ వెళ్ళి క్యూ ల్లో నుంచోనక్కర్లెదు. ఒక్కమాటైనా ఈ ప్రబుధ్ధులు వాళ్ళ గుండెలమీద చెయి వేసికొని ఆలోచిస్తారా అని, తినడానికీ అంతుండాలి, పోయేటప్పుడు తీసికెళ్తాడా, అయినా సరేఅదో ఆబ, ఇంకా కావాలీ అని.

%d bloggers like this: