బాతాఖానీ—తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–QUALITY

    QUALITY అన్నమాట మేము Ordnance Factories లో పనిచేసినంతకాలం ప్రతీ రోజూ జపించేవాళ్ళం. ఎక్కడ చూసినా, విన్నా అదే మాట.మొదట్లో మావాళ్ళందరూ March నెలంతా Quality month అనేవారు. అది క్రమక్రమంగా November కి మారింది. ఆ నెలంతా ఏవేవో సింపోజీయమ్స్, ప్రతీరోజూ ఎవరెవరిచేతో లెక్చెర్లూ, ఒకటేమిటి నెలంతా ఊదరకొట్టేసేవారు.ఎవడినోట విన్నా ఇదేమాట.మేం తయారుచేసిన Ammunition సరీగా ఉంటేనేకదా బోర్డర్ లో ఉన్న మనవాళ్ళు ధైర్యంగా పనిచేసేది!
ఇంక వీటికి సంబంధించిన ఇతర పదాలతోనూ పరిచయం అయింది. ఫాక్టరీ లో ఉన్న కార్మికులచేత సరీగ్గా పనిచేయించడానికి, వాళ్ళకి ట్రైనింగులు అవీ ఇవ్వవలసివచ్చేది. ఈ సందర్భంలోనే

   మొట్టమొదటి సారిగా Quality Circles అనే మాట విన్నాను. మా జి.ఎం గారు ఈ పనంతా నాకప్పగించేరు. అందువలన దీనికి సంబంధించిన పుస్తకాలు అవీ చదవవలసి వచ్చింది.
Juran, Ishikaawaa ల పేర్లు మొదటిసారిగా విన్నాను. ఎంతచెప్పినా ప్రపంచంలో క్వాలిటీ కి సంబంధించినంతవరకూ, వీళ్ళిద్దరికే పెద్ద పీట వేస్తారు.వాళ్ళు వ్రాసిన పుస్తకాలన్ని చదివి,
slides తయారుచేసికొని ( అప్పటికింకా పవర్ పాయింట్ ప్రెజెన్టేషన్లూ అవీ మాకు తెలియదు). అది తెలిసేటప్పటికి నేను రిటైర్ అయిపోయాను!!
అవన్ని గుర్తుచేసుకుంటుంటే అనిపించింది– ఈ క్వాలిటీలూ అవి మన పూర్వీకులు ఏమీ చదవనవసరం లేకుండానే పాటించేవారు కదా అని. అదేదో Brain storming sessionచేయాలీ, అందరి అభిప్రాయాలు తెలిసికొని మనకొచ్చిన సమస్యని solve చేయాలీ అని నేను ప్రతీరోజూ మావాళ్ళని బోరు కొట్టేవాడిని, మా వర్కర్స్ అంత బాగా చదువుకున్నవాళ్ళు కాదు,
ఫాక్టరీకి భూమి సేకరించినప్పుడు ఆ పొలం అమ్మిన ప్రతి కుటుంబం నుంచీ ఒకో మనిషికి మా ఫాక్టరి లో ఉద్యోగం ఇచ్చారు. అందువలన మా వర్కర్స్ చాలామంది ఇదివరకు వ్యవసాయం చేస్తున్నవాళ్ళే. నేను ఇచ్చే లెక్చర్లు విని వాళ్ళలో ఒకతను లేచి ” సార్ ఇదేదో పేద్ద కొత్త సంగతిలాగ చెప్తున్నారేమిటీ, మేము ప్రతీరోజూ ఇదేచేస్తాము. సాయంత్రం రచ్చబండమీద కూర్చొని
ఎవరెవరి పంట సాగుబడి ఎలా వచ్చిందో, ఎవరెవరి సమస్యలేమిటో, వాటికి అందరూ కలసి ఎలా ఆలోచిస్తారో,అన్నీ అందరూ కలిసేకదా చేస్తాము”
అనగానే నా దగ్గర జవాబు లేకపోయింది. నిజమే కదా అతను చెప్పినది అనిపించింది. ఈ సంగతి బయటి వాళ్ళెవరో చెప్తే అదేదో కొత్తసంగతిలా అనుకొని మనం దానికి ఇంకా పెద్ద పెద్ద Terms పెట్టేస్తాం.

    ఇంక Random sampling గురించి మాట్లాడితే మన తల్లులు అన్నం ఉడికిందో లేదో ఎలా చూస్తారమ్మా? మెతుకు ముట్టుకుని.మన అమ్మలకంటే experts ఎక్కడ దొరుకుతారండి?
ఏమిటో శంఖంలో పొస్తేనే కానీ తీర్థం అవదుట. అతడేదో బయట దేశాలలొ విజయవంతమయ్యాయని చెప్తే అలాగే కాబోలు అని మనం కూడా దానినే అనుకరిస్తాము. ఇవన్నీ మన భారత దేశం లో ఎప్పటినుండో ఉన్నాయి. భక్తి టి.వి. లో శ్రీ గరికపాటి నరసింహారావు గారు చెప్పే మహాభారత వ్యాఖ్యానం వినండి తెలుస్తుంది. ఇప్పుడు జరిగే వ్యక్తిత్వ వికాసాలు, క్వాలిటీలూ,…
వీటన్నింటిగురించీ ఏనాడో మన పురాణాలలో చెప్పారు.

    బయటి దేశాల వాళ్ళందరూ మన ఇతిహాసాలకిచ్చే విలువ మనదేశంలో వాళ్ళివ్వకపోవడం విచారకరం.వైద్యం తీసికోండి, ఇంకో ఇంజనీరింగు తీసికోండి, దేంట్లోనైనా సరే మన పూర్వీకులేనాడో
చేసిన పనులే మనం ఇప్పుడు బయటవారి ద్వారా నేర్చుకొని వాళ్ళకి credit ఇస్తున్నాము. తంజావూరు పెద్దగోపురం మీద అంత పెద్ద గుండ్రాయిని ఎలా చేర్చారు?ఇప్పటిలాగ క్రేన్లూ అవీలేవుకదా?అలాగే మన పూర్వీకులు తయారుచేసిన ఏ కట్టడమైనా తీసికోండి,వారికున్ననేర్పరితనం మనకి ఎక్కడైనా కనిపిస్తోందా? అంతదాకా ఎందుకూ మా రాజమండ్రీ లో గోదావరి నదిమీద
కాటన్ దొరగారు 100 సంవత్సరాలక్రితం కట్టిన ఆనకట్టా, బ్రిడ్జీ ఇప్పటిదాకా చెక్కుచెదరలేదు.
అదే మనవాళ్ళు కట్టిన Road cum rail bridge కి 30 సంవత్సరాలు నిండకుండానే రోజూ
రిపేర్లే.

    Quality బాగుండాలంటే పుస్తకాలే చదవనక్కర్లేదు. ముందుగా అది తయారుచెసే వాళ్ళలో నిజాయితీ ఉండాలి. సరి అయిన పాళ్ళలో కాంక్రీట్ అవీ వాడాలి.ఆ మధ్యనహైదరాబాద్ లో కుప్పకూలిన flyover సంగతి మరచిపోకముందే మొన్న ఢిల్లీలో మెట్రో రైల్ flyover కూలడం. విచిత్రమేమంటే రెండింటిలోనూ Gammon India పేరు వినిపించడం.హైదరాబాద్ నివేదికేమయ్యిందో దేముడికే తెలుసు. ప్రస్తుత ఘనకార్యంలొ 5 లక్షల జురుమానాతో వదిలెసారుట.అసలు ఉండవలసినది మన పాలకుల Quality. అది సరీగ్గా ఉంటే మిగిలినవన్నీ అవే శుభ్రంగా ఉంటాయి.

%d bloggers like this: