బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–చదువు,సంస్కారం

    చాలామంది అభిప్రాయం చదువుతో పాటు సంస్కారం అబ్బుతుందని. అది అందరి విషయంలోనూ నిజం కాదు.సంస్కారం జన్మతో వచ్చేది.మనం చిన్నతనంనుండీ, తల్లితండ్రులు ఇంట్లోనూ,గురువులు బడులలోనూ నేర్పగా వచ్చేది. అది చాలామందిలో తగ్గినట్లుగా ఈమధ్యన కనిపిస్తోంది. సంస్కారం అంటే అదేదో అందరూ కనిపించగానే నమస్కారాలు పెట్టేయాలని కాదు.
పైగా అలా పెట్టేవాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి–‘అతి వినయం ధూర్త లక్షణం’ అంటారు.

    మన రాజకీయ నాయకుల్ని కొంతమందిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. వాళ్ళు ఒకరిమీద ఒకరు వేసికొనే ఆరొపణలు వింటూంటే, వీళ్ళకంటే ఎటువంటి చదువూ లేని వాళ్ళు చాలా నయం అనిపిస్తుంది. పైగా మన రాజకీయ నాయకుల్లో చాలా మందికి ఎన్నెన్నో పెద్ద పెద్ద డిగ్రీలు కూడా ఉన్నాయంటారు. వీళ్ళకి public గా మాట్లాడేటప్పుడు కొంచెం వినసొంపైన భాష మాట్లాడాలని ఎవరూ నేర్పలేదనుకుంటాను. ఇది నాయకులకీ, నాయకురాళ్ళకీ వర్తిస్తుంది. రాజకీయాల్లోకి వెళ్ళగానే వాళ్ళకి నోటికివచ్చినట్లు మాట్లాడడానికి licence వచ్చేసిందనుకుంటారు, ఎవరిని పడితే వాళ్ళమీద చెయ్యి చేసికోవడం, ఓ fashion ఐపోయింది. ఈ మధ్యన ఓ MLA గారు ఓ బాంక్ మేనేజర్ మీద చెయ్యి చేసికున్నాడు, అది మన టి.వీ.ల్లో కూడా చూపించారు. అయినా సరే నేను కొట్టలేదన్నాడు సదరు MLA. చివరకు వాల్ల పార్టీ పెద్దలు మందలించేసరికి క్షమాపణ చెప్పాడు.

    ఎసంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు మన గౌరవనీయ శాసన సభ్యులు చేసే వీరంగాలు చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఇంక వాళ్ళ పిల్లలకి ఏం నేర్పుతారొ భగవంతుడికే తెలియాలి.ఎంత గొడవ చేస్తే
అంత బాగా వారి Public image పెరుగుతుందనుకుంటున్నారు. అది మన దురదృష్టం. ఇంకో MLA గారైతే ఏకంగా వారి కుటుంబాన్నే నిరవధిక నిరాహారదీక్షకి కూర్చోపెట్టేశారు. ఆ గొడవ ఏమయ్యిందో అందరూ మర్చేపోయారు.ఇది ఏ ఒక్కరిగురించో కాదు. 90 శాతం మన రాజకీయ నాయకులు ఇలాగే ఉన్నారు. వచ్చిన గొడవ ఏమిటంటే ఇలాంటి Unruly behaviour
కింద దాకా percolate
అవుతోంది. ఎక్కడ చూసినా విద్యార్ధుల సంఘాలే, ఓ చిన్న గొడవ వచ్చిందంటే చాలు బంధ్.మేము స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూళ్ళలో Mock assembly/parliament చేయించేవారు. అందులో విద్యార్ధులు భవిష్యత్తు లొ ఎలా ప్రవర్తించాలొ, ఎలా మాట్లాడాలో నేర్పేవారు.ఇప్పుడు అలాంటివాటికి కాలం తీరిపోయింది. ఎటువంటి శాసనసభా కార్యక్రమంచూసినా చాలు, ఎవరూ నేర్పనక్కరలేదు!!

    మేము ఉద్యోగాల్లో చేరిన తరువాత కూడా, ఎప్పుడైనా స్వగ్రామం వెళ్తే, అక్కడ మా పూర్వపు ఉపాధ్యాయులెవరైనా కనిపిస్తే ఆగి, ఆయనకు నమస్కారం చేసి, ఆశీర్వచనం తీసికొనేవాళ్ళం. ఇదేదో మేము గొప్ప పనిచేసేవాళ్ళం అని చెప్పుకోడానికి కాదు, మనకి చదువు చెప్పిన గురువుల మీద మనకున్న గౌరవాన్ని ప్రకటించుకొనే అవకాశం వస్తే చూపించుకోవాలని నా ఉద్దేస్యం.ఇప్పుడు నూటికి ఏ పదిమందో ఇలాంటి వారిని చూస్తాము.దీనికి కారణం మన పిల్లలదే కాదు, ఈ రోజుల్లో వస్తున్న ఉపాధ్యాయుల Quality కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. రాజమండ్రి లో విన్నాను– ఒక స్కూల్లో శ్రీ కందుకూరి వీరేశలింగం గారి గురించి ఒక పాఠం వచ్చినప్పుడు, ఆయన గురించి వివరిస్తూ ఆ టీచర్ “There was somebody by name K.V.Lingam. I think his full name is Kandukuri veeresalingam” అని చెప్పారుట. రాజమండ్రి లో ఆయన గురించి ఇలా వినవలిసిన దుర్గతి ఉంటే ఇంక సంస్కారం ఏం నేర్పుతారు?

    ఇంక మన క్రీడాకారుల గురించి చాలా చాలా ఉంటాయి. ఈ మధ్యన మన టెన్నిస్,b> So called స్టార్ సానియా మీర్జా, ఏ Tournament రెండో రౌండ్ దాటదు, కానీ బ్యాడ్మింటన్ లో
8 వ రాంక్ సంపాదించుకున్న సైనా మీద అవాకులూ చవాకులూ పేల్తోంది. పైగా తను ఆడే టెన్నిస్ Global game ట, బ్యాడ్మింటన్ ఏ కొద్ది దేశాలో ఆడుతారుట.సానియా కి వచ్చిన popularity గ్లామర్ వల్ల వచ్చింది. సైనా తన ఆట తొ చూపించింది. అందుకే చెప్పాను సంస్కారం అనేది ఎవరో చెప్తే వచ్చేది కాదు.It is mostly inherited. ఇంక వినోద్ కాంబ్లీ అయితే కూసే కూతలన్నీ కూసేసి సచిన్ తెండుల్కర్ ని నేనసలు ఏమీ అనలేదు పొమ్మన్నాడు.తను అన్న మాటలకి సచిన్ గౌరవం ఏమీ తగ్గలేదు, కాంబ్లీ సంస్కారమే బయట పడింది.
సచిన్ గొప్ప మనసు కలవాడు కాబట్టి ఏమీ స్పందించలేదు. అతనేమీ పెద్ద పెద్ద డిగ్రీలు తగిలించుకోలేదు.

    ఇంక కాలేజీల్లో జరిగే Ragging చూస్తే ఈ “సంస్కారం” ఎక్కడ, ఎలా, ఎవరు నేర్పించారో తెలియదు. కొన్ని కొన్ని ఎవరూ నేర్పించవలసిన అవసరం లెదనుకుంటాను.బయటకు వెళ్తే చాలా చూస్తూంటాము. బస్సుల్లో అనండి, లోకల్ రైళ్ళలో అనండి, చూస్తూంటే కడుపు తరుక్కుపోతూంటుంది. కారణం ఏమీ ఉండదు ఊరికే రోడ్డుమీద వెళ్తున్నవాడిమీద ఏదొ అసభ్యకరమైన వ్యాఖ్య చేయడం, అది విని ఈ గాడిదతో ఉన్న మిగిలిన గాడిదలు గొల్లు మని నవ్వడం. అదో పైశాచికానందం. ఇంట్లో వాళ్ళ తల్లితండ్రులు వాళ్ళ కడుపు కట్టుకుని ఈబడుధ్ధాయిల్ని కాలెజీలకి
పంపడం.వీళ్ళేమో ఏదొ సినిమా హిరొలనుకొని అచ్చొసిన ఆంబోతుల్లాఊళ్ళో వాళ్ళమీద పడడం.ఓ అంటే ఢం రాదు, వేషాలకేమీ తక్కువ లేదు.
వీళ్ళ ప్రయోజకత్వం తెలిసికోవడానికి ఈ రోజుల్లో ఎవరికీ టైము ఉండడం లేదు. చేతికో సెల్లూ, తిరగడానికో బైక్కూ ఇచ్చేస్తే చాలనుకుంటున్నారు. ఇంకొచెం డబ్బున్నవాళ్ళైతే కార్లూ, క్రెడిట్ కార్డులూ కూడా ఇస్తారు.పేపర్లో చుస్తూంటాము వీళ్ళ ఘనకార్యాలు. చేతిలో డబ్బులైపోగానే Kidnaps and extortions. ఇదంతా సంస్కారమేనంటారా?

%d bloggers like this: