బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–వెధవ గారు

    నిన్న బస్ స్టాపులో ఒకావిడ పడుతున్న వర్షాన్ని చూసి పక్కనున్నావిడతో ” వెధవ వర్షం పొద్దునె మొదలయింది. ఈ వానకి వెధవ లేవడు.వీడిని లేపి బ్రష్ చేయించి నీళ్లు పొసి పాలుయిచ్చి కిందకి తెచ్చెసరికి వెధవది ప్రాణం పోయిందనుకోండి,వెధవ సంత, ఇంతకీ వెధవ బస్ మాత్రం రాలేదు.ఈ డ్రెవర్ వానకి చాయ్ త్రాగుతూ ఫ్రెండ్ర్స్ తో వెధవ మీటింగులు పెట్టి వుంటాడు,” అంటూండగానే బస్ రావడం ,”లంఛ్ బాక్సు లొ ఏమీ వదలకుండా తిను,వెధవయ్యా, అని బస్ ఎక్కించి టా,టా” చెప్పి నన్ను గమనించి , బాగున్నారా, అని పలకరించి “వెధవది మొత్తానికి వర్షం పడిందండి బాబూ,లేకపోతే ఈ వెధవ (కూరలవాడిని ఉద్దేశించి) ఏం రేట్లు చెబుతున్నాడనుకున్నారు?” అలా మొదలయింది.
ఈపాటికి మీకు అర్ధమయిందనుకుటాను.అసహనంతొ, ప్రెమతొ,అసక్తతొ, ముద్దుతో ఎన్ని సార్లు వెధవ శబ్దం వుపయొగించినదొ , అది కొంతమదికి ఊతపదంలాంటిదనుకుంటాను. ఈ పదాన్ని పలకడం లో మనం నవరసాలంటారే అందులొ మనకి తెలియకుండానే ఆందరం ఆప్పుడొ ఎప్పుడొ ఉపయొగిస్త్తాం, కాని ఇంకోకరు వాడినప్పుడు మాత్రం మనకి ఏమిటి యిలా మాట్లాడుతున్నారనిపిస్తుందికదూ.
,p>     మన<b. కొంగర జగ్గయ్యగారు తెలుసుకదా సినినటుడండిబాబూ, గుర్తుకువచ్చారా?ఆయన మంచి రచయిత కూడాను,ఆయన1967 విజయచిత్ర (ప్రత్యేక సంచిక)లో ఓసారి ఈపదానికి గౌరవమిచ్చి<b." వెధవగారు" అని వివరంగా వ్రాసారు. వెధవ శబ్దం కేవలం పుంలింగమని సంస్కృతానికిసంబందం లేదని యిది తెలుగు పదమని చెప్పారు. కాని తెలుగులొ ఎప్పుడు పుట్టిందొ ఎలా పుట్టిందొ చెప్పడం కష్టమని అన్నారు.
పదబందం చేసినపుడు”పిచ్చివెధవ”, “టక్కరివెధవ”,”వెధవనిక్కులు”,”వెధవకూతలు”,అన్ని తెలుగు పదాలే వాడతాం కాని మిశ్రమ సమాసాలు చెయ్యమని కాని అప్పుడపుడు “రాక్షసివెధవ”, వెధవగుణం” లాంటి ప్రయొగాలు వాడుకలొ వున్నాయనీ అన్నారు.పండితులు ఈశబ్దాన్ని నిరాకరించారని,అధునాతన రచయితలు మాత్రం ఆ లోటు తీర్చారని, అచ్చ తెనుగుకి జరిగిన అన్యాయం తొలగించారని అన్నారు.ఆంతే కాదొండొయ్ వెధవ అనె మాట నిందా వాచకంగానో నీచార్ధం లొనొ వాడుతున్నామని చాలామంది అనుకుంటారు. ఇది కేవలం అపొహ.
ఈ వెధవ గారికి, వయస్సుతో ప్రమేయంలేదు, పసివెధవ మొదలుకొని “ముసలివెధవ” వరకు అన్ని ఏజ్ గ్రూపుల్లోను కనిపిస్తారు.

    పసిపాపల విషయంలొ ఎంత ముద్దుగా పిలుస్తాం,”బుజ్జివెధవ”, బుల్లివెధవ”,చంటివెధవ” అపిలుపులొ ఎంత అప్యాయత, డొసు పెరిగితే వెధవాయి కూడాను.జగ్గయ్య గారు చెప్పినట్లుగా
గుణ గణాలని బట్టి వెధవ గారు అనేక రూపాల్లో దర్శనం ఇస్తూంటారు.” పిచ్చి వెధవ అంటే అమాయకుడు,వెర్రి వెధవ అంటే బోళా శంకరుడూ అని. మామూలుగా ఈ గుణాలన్నీ అందరిలోనూ ఉంటాయి, కానీ అతడు వెధవ కూడా కావడంతో ఓ ప్రత్యేకత ఏర్పడుతోంది.

    శ్రీ జగ్గయ్య గారు మొత్తం ఓ డెభ్భై మంది వెధవలని identify చేశారు., అది చదువుతూంటే వెధవ గారిమీద ఆయన ఎంత పరిశోధన చేశారో అర్ధం అవుతుంది.ఆయన సినిమాల్లో ఎప్పుడూ
సీరియస్సు పాత్రలే వేసేవారు. ఈ వ్యాసం లో ఆయనలో దాగున్న హాస్య రసం పొంగి పొర్లింది. ప్రతీ తెలుగు వాడూ తప్పకుండా చదవ వలసిన వ్యాసం ఇది. 42 సంవత్సరాల వయస్సు ఈ”వెధవ” గారికి.

    చివరగా ఆయనన్నట్లు కొంతమంది ఒక వ్యక్తి యొక్క బాహ్యరూపానికి,దేహస్థితికి వెధవ గారిని తగిలిస్తూంటారు. ఉదాహరణకు..బోడి వెధవ, బక్క వెధవ,అనాకారి వెధవ, రోగిష్తి వెధవ, గుడ్డి వెధవ అని, ఇది మాత్రం చాలా అన్యాయం.భారతీయ సంస్కృతి, సభ్యత తెలిసినవాళ్ళెవరూ బాహ్యరూపానికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది కేవలం తెలియనివాళ్ళూ, అజ్ఞానులూ చేస్తున్న తప్పిదం.కానీ మన వెధవ గారు ఇలాంటివి పట్టించుకోరు. అదే వారి గొప్పతనం. సుఖదుఖాలు, రాగద్వేషాలూ సమానంగా చూడగలిగిన వీరు, అలాంటి ఘట్టాలు వచ్చినప్పుడు జాలిగా నవ్వుకుంటారు.మనంకూడా ఇతరులకు ప్రబోధం చేయాలి.

    అన్నింటికీ కొసమెరుపు గా ఆయన వ్రాసిన ఒక అఛ్ఛోణీ లాంటి వాక్యం..“అమెరికా లొ Statue of Liberty లాగ ఇక్కడకూడా, వెధవ గారికి ఒక జాతీయ స్థూపం నెలకొల్పాలి. ఈ మధ్యన మన శిల్పులు, ఏ జాతీయ నాయకుడి శిల్పమో చెక్కేటప్పుడు ఈ వెధవ గారిని దృష్టి లో పెట్టుకుంటున్నారు “–
నాలుగు పేజీల ఈ వ్యాసాన్ని కుదిరినంత కుదింపు చేసి మీతో పంచుకున్నాను. పుర్తిగా చదవాలంటే ” విజయ చిత్ర” 1967 ప్రత్యేక సంచిక సంపాదించండి. లేదంటే ఈ వెధవని వదిలెయండి !! pdf లూ అవీ చేసి బ్లాగ్గులో పెట్టమన్నారంటే , వెధవ కాపీరైట్లూ అవీనూ. కోర్టు వాళ్ళు నన్ను పట్టుకుంటారు, ఏ వెధవా నన్ను కాపాడడు…

%d bloggers like this: