బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు– Feel Good

    ఈ వేళ అంతా Feel good mode లో ఉన్నాను. ఓ గంటసేపు మాతొ గడపడానికి మా అమ్మాయి అత్తగారు, మామగారు వచ్చారు.ఆ తరువాత మా ఫాక్టరీ హాస్పిటల్ కి వెళ్ళాను,
(వంట్లో బాగుండక కాదు!) ఊరికే ఖబుర్లు చెప్పడానికోసం.అక్కడ మా ఫాక్టరీ డాక్టర్ గారొకరు కనిపించి ” మళ్ళీ ఎప్పుడు డ్యూటీ లో జాయిన్ అవుతావూ” అనగానే ఇంకోకాయన “ఇతను రిటైర్ అయ్యి నాలుగున్నరేళ్ళవుతొంది నీకు తెలియదా’ అన్నారు. దానికి ఈయన,b> ” ఇతను నాకు ముందునుండీ తెలుసును, రిటైర్ అయ్యి నాలుగున్నరేళ్ళయినా ఇంకా fresh గానే ఉన్నాడు, మనకంటే active గా ఉన్నాడు, అందుకే అలాగ అడిగేను” ,/b>అన్నారు.
డాక్టర్ గా ఆయన అన్న మాట విని నాకైతే చాలా సంతోషం వేసింది.అదేమిటో నేను సర్వీసు లో ఉన్నప్పటి ప్రతీ వారూ నన్ను చూసి ఎవరూ విసుక్కోరు.భగవంతుది దయ వలన నెను పనిచేసిన ప్రతి చోటా కూడా ఇదే అభిప్రాయం. నిన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు, మా ఆఫీసర్లు ఇద్దరు కనిపించారు. వారు కూడా నెను పనిచేసినప్పటి సంగతులు గుర్తు చేసికొన్నారు.
మనం సర్వీసులొ ఉండగా అదె మనని గుర్తు పెట్టుకొనేది గా చేసేది. రేపెప్పుడో మనం పోయిన తరువాత కూడా, మనం చేసిన పనులు, మన ప్రవర్తనా అందరికి గుర్తుంటాయి.

    ఇప్పటి రోజుల్లో మన యువతరం, మాలాగ <b.ఒకే ఉద్యోగానికి వేళ్ళాడరుగా. ,ఎక్కడ బాగా జీతం వస్తే అక్కడికి మారిపోతూంటారు. దానికి నేను తప్పు పట్టడం లేదు. ఏదైనా ఉద్యొగం చేసినప్పుడు దానిలో Job satisfaction అనేది ఉండాలి. నాకు ఒక విషయం అర్ధం అవదు–ఈ,b> Job satisfaction అంటే ఏమిటీ–నిజంగా ఇదే కారణం అయితే, మనం చేసె
job ఏదైనా అందులో కూడా ఆనందం పొందవచ్చు. చెప్పేదేమిటో క్లియర్ గా ” డబ్బు” కోసమే మేము జాబ్ లు మారుతామూ అని ఒప్పుకుంటే, ఇంకా నిజాయితీ గా ఉంటుంది.

    ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేదీ– మాస్టారి అబ్బాయి మాస్టారే అయ్యేవాడు, బి.ఇ.డీ లేక సెకండరి గ్రేడ్డో. తాలుకాఫీసులో పనిచేసేవారి కొడుకు అందులోనే చేరేవాడు. డాక్టర్ గారి పిల్లలు డాక్టర్లే, ప్లీడర్ గారి పిల్లలు ప్లీడర్లే– ఎదో అక్కడక్కడ వీటిలో కొంచెం మార్పుండేది.70 ల దశకం ప్రారంభం అయిన తరువాత వచ్చిన జనరేషన్ కి ఇదేమీ నచ్చలేదు.ఇంకా <b.పాతచింతకాయ పచ్చడిలా,/b. ఉంటే ఎలాగా అని ఆలోచించారు. అవకాశాలు కూడా అలాగే వచ్చేవి. జీవితం అంతా పరుగులు పెట్టడం ప్రారంభం అయింది. డబ్బే ప్రధానమయ్యింది జీవితానికి, అది సంపాదించాలంటే ఎన్నెన్నో openings కనిపించాయి. మరీ డబ్బుకోసం ఉద్యోగం మారుస్తున్నామనుకోవడానికి మొహమ్మాటం వేసి ఈ job satisfaction అనే కొత్త పదానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటివారు చెప్పే ఈ కొత్త పదానికి పాత వారు ఎలా అర్ధం చెప్తారు? వాళ్ళు చేసేది ఏ పనైనా పూర్తి sincerity తో చేస్తే అందులోనే ఆనందం కనిపిస్తుంది.వాళ్ళే ఇప్పటివాళ్ళలాగ, రోజుకో ఉద్యోగం మార్చి ఉంటే, వీళ్ళు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివేవారా, ఉద్యోగం స్థిరంగా లేకపోతే డబ్బెక్కడినుండి వస్తుందీ, చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా చేసేవారు? ఏమైనా అంటే ఇప్పటివారు చెప్పే explanation ఒక్కటే–అప్పటి వారు జీవితం తో reconcile అయిపోయారు అని. ఒప్పుకున్నామండి.దానివల్ల లాభం ఎవరికి వచ్చిందీ?
ఇంకా ఏమైనా అంటే అప్పటికీ, ఇప్పటికీ సహస్రాలు తేడా ఉందీ, ప్రపంచం అంతా స్పీడ్ గా వెళ్తోందీ, మీలాంటివారు ఇంకా పాత జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నారూ అంటారు. ఒక్కటి చెప్పండి-ఇప్పటి వారికేమైనా మాలాంటివారి కొచ్చే Feel good జ్ఞాపకాలు ( ఉద్యోగాలకి సంబంధించినంత వరకూ) ఉన్నాయా? ఉండడానికి ఒకే ఉద్యోగంలో ఉన్నవాళ్ళెంతమంది? నాకు ఒక విషయం అర్ధం అవదు. మనం రోజూ తినే తిండితో బోర్ అవుతామా? రోజూ చూసే పిల్లలతో బోర్ అవుతామా? లేనప్పుడు రోజూ చేసే పనితో బోర్ ఎలా అవుతాము?,/b>

    మనింటికి ప్రతీ రోజూ పని మనిషి వస్తుంది, చాకలి బట్టలు తీసుకుని వెళ్తాడు, పాల వాడు పాలు తీసికొస్తాడు, ఒక్కసారి ఊహించుకోండి వీళ్ళంతా వారి వారి పనులతో బోర్ అయిపోయి,
So called job satisfaction అనే వంక తో పని మానెస్తే ఎలా ఉంటుందో?
నేను చెప్పేదేమిటంటే ఏదొ ఒక ఉద్యోగంలోనైనా కొన్ని సంవత్సరాలు పని చేసి, ఆ పనిలొ నిమగ్నమై
జీవితంలో కొంత సమయమైనా ఈ Feel good అంటే ఏమిటో తెలిసికోవడానికి ప్రయత్నించమని.ఇదంతా పాత రాతి యుగం ఖబుర్లలాగా ఉన్నాయంటారు కదూ?
నేను వ్రాసినదంతా ప్రతీ ఏడాదీ ఉద్యోగాలు మార్చేవారి గురించి మాత్రమె. మనం చేసే ప్రతీ పనిలోనూ ఏదో ఒక ఆనందం ఉంటుంది. దానిని గుర్తించి, దానిని enjoy చేయడంలోనే ఉంది
అసలైన మజా!!

కోతి కొమ్మచ్చిమిద సాక్షి పేపర్ లో శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారు వ్రాసిన సమీక్ష, శ్రీ ముళ్ళపూడి వారిని మించిపోయింది. మీతో పంచుకుంటున్నాను.