బాతాఖానీ-తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు–భాషాభిమానం

    ఈ వేళ ” ఈనాడు ఆదివారం అనుబంధం” లో ఒక ఉత్తరం చూశాను. మహారష్ట్రలోని నాందేడ్ నుండి శ్రీ యోగేష్ సంగంవార్ అనే ఆయన వ్రాసినది.ఆయన Xerox Centre నడుపుతున్నారుట,అక్కడ ఒకసారి ఎవరో ” తెలుగు నేర్చుకోండి ” అనే పుస్తకాన్ని xerox చేయడానికి తీసికొస్తే, ఆయన ఒక Extra copy తాయారుచేసికొని, దాచి ,నేర్చుకొని ఉత్తరం వ్రాశారుట. అది చదువుతూంటే ఎంత సంతోషం వేసిందో. ఆంధ్రేతర రాష్ట్రాలలో తెలుగు నేర్చుకోవడానికి అందరూ ఇంత ఉత్సాహం చూపుతున్న రోజుల్లో , మన వాళ్ళు తెలుగులో మాట్లాడడమే నామోషీ,/b> గా భావించడం ఎంత బాధా కరమైన విషయము?

    టి.వీ. ల్లో చూస్తూంటాము మన ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులు ఓ మిట్టల్ అనేమిటి, ఓ ద్వివెదీ అనేమిటి అందరూ కూడా తెలుగు ని నేర్చుకొని ఎంత బాగా మాట్లాడుతారో. వారికి కొత్త భాష నేర్చుకొవాలనే ఆసక్తి, తపన ఉండడంవలనే కదా అంత సునాయాసంగా నేర్చేసికొని, మన గ్రామీణ భాగాల్లో వారితో మాట్లాడి, వారి వారి సమస్యలు తీరుస్తున్నారూ !
,p>     బయట వారు ఈ విధంగా నేర్చుకొని ప్రాంతీయ భాషకి ఇంత న్యాయం చేస్తూంటే మన వాళ్ళు, మాతృభాషలో మాట్లాడడానికే నామోషీ గా భావిస్తున్నారు. రాజమండ్రీ లో చూశాను–ప్రతీ వీధికీ ఓ కాన్వెంటు, బయట బోర్డ్ పెడతారు,b> With Teachers from Kerala for teaching English,
అని అది చూడగానే,b> చిర్రెత్తుకొస్తుంది. అక్కడికి కేరళా వాళ్ళేదో ఇంగ్లీషులో పండితులైపోయినట్లు. ఇవే కాక ప్రతీ సందులోనూ Institute for spoken English అని ఏడుస్తాయి.పోనీ వాటిలో నేర్చేసుకొని ఏమైనా పొడిచేసేశారా అంటే అదీ లేదు. ఆ Institute పెట్టినవాడి జేబు నిండుతోంది అంతే.

    భాష ఏదైనా మాతృభాషమీద అభిమానం ఉండాలి. నేను రాజమండ్రి లో ప్రతీ రోజూ ప్రొద్దుటే గోదావరి గట్టు మీద ఉన్న దేవాలయాలకి వెళ్టూంటాను. ఒ రోజు మార్కండేయస్వామి గుడి బయట ఓ వాన్ దగ్గర ” మరాఠీ ” మాట వినిపించింది. ప్రాణం లేచొచ్చింది. వెళ్ళి మరాఠీలో పలకరించేసరికి వాళ్ళకెంత ఆనందమనిపించిందో. పిఠాపురం లో కొలువై ఉన్న శ్రీపాద వల్లభ స్వామి వారి సన్నిధికి వచ్చారుట. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకొని తిరిగి వెళ్తారుట. నన్ను వాళ్ళతో వచ్చినవారందరికీ పరిచయం చేస్తూ, ” ఆప్లా మాణుస్’ అంటే ” మన వాడు’అని చెప్పారు. ఎంత సంతోషం వేసిందో. రాజమండ్రి కి ఉల్లిపాయలు నాసిక్ నుండి వస్తాయి. ఎప్పుడైనా M H series ట్రక్ కనిపిస్తే వెళ్ళి పలకరిస్తాను. అలాగని నా తెలుగు మమకారాన్ని అనుమానించకండి. నాకు తెలుగు నుడికారం మీద వెర్రి అభిమానం. అలాగని ఏవేవో పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు, సాహిత్యం తొ అంత పరిచయం లేదు</b.. అయినా తెలుగు మాట వినగానే ప్రాణం లేచొస్తుంది.

    నేను ఉద్యోగ రీత్యా Purchase department లో పని చేశాను. నాదగ్గరకు వచ్చే వారు Visiting Card ఇవ్వగానె, తెలుగు పేరు కనిపిస్తే ” మాస్టారు శుభ్రంగా తెలుగు లో మాట్లాడుకుందామా” అనగానే వాళ్ళూ సంతోషించేవారు. ఎంతోమంది తెలుగువారు పరిచయం అయ్యారు. ఆ స్నేహ సంబంధాలు ఈ నాటికీ నిలిచే ఉన్నాయి.ఇదెదో నెను వాళ్ళకి ఉపకారం చేశానని చెప్పటం లేదు,పరిచయం చెసికొవడానికి మాతృభాష ఎంత ఉపయోగిస్తుందో అని చెప్పడానికి మాత్రమే.
,p>     వచ్చిన గొడవల్లా ఏమిటంటే మన సినిమాల వాళ్ళు Neighbour’s wife is beautiful లెక పొరిగింటి పుల్ల కూరే రుచి అనుకొని, బయటి హీరోయిన్లకె పెద్ద పిట వేసి, వాళ్ళకే
Voice Dubbing చేసేసి జనం మీదకు వదిలేస్తున్నారు. అది మన దురదృష్టం. మన పిల్లలు కూడా దానికే అలవాటు పడ్డారు.ఎవరు తెలుగులో మాట్లాడినా అదికూడా డబ్బింగేమో నని
అటూ, ఇటూ చూసే,/b> పరిస్థితికొచ్చారు!!

    రాజమండ్రీ లో చాలామంది వ్యాపారస్థులు బయటనుండి వచ్చిన వారే.వారి పేరు చూస్తేనే తప్ప తెలియదు వారు బయట రాష్ట్రం నుండి వచ్చారని.ఎంత చక్కగా మాట్లాడుతారో మన భాషని.గుజరాత్, రాజస్థాన్, పంజాబ్.. ఎక్కడెక్కడినుండో వచ్చి తెలుగు శుభ్రంగా మాత్లాడుతారు కదా, మనవాళ్ళకేంరోగం మాట్లాడడానికి? నేను ప్రాంతీయ యాస గురించి మాట్లాడడం లేదు. ఎవరి యాస వారిది. భాష తెలుగే కదా. ఈ మధ్యన హైదరాబాద్ లో నెనూ, మా ఇంటావిడా మా చెల్లెలు గారింటికి మల్కాజ్గిరి వెళ్ళడానికి ఆటో ఎక్కి మాట్లాడుకుంటున్నాము, ఆటో డ్రైవర్ తో ఏదో హిందిలో చెప్పాను. అతను ఆటో ప్రక్కగా ఆపెసి ” ఏమి సార్, తెలుగు వారైఉండి నేనేం పాపం చేశానని నాతో హిందీలో మాట్లాడుతున్నారూ” అన్నాడు.అప్పటిదాకా మాకైన అనుభవాల వల్ల నేను హిందీలోనే మాట్లాడాను. తెలుగులొ మాట్లాడితే అదేదో పాపం చేసినట్లు చూస్తారు. పోలీసులయినా సరే, ఆటో వాళ్ళైనా సరే. అంతదాకా ఎందుకూ, మా కజిన్ వాళ్ళ అమ్మాయి పరీక్షలసంగతి అడుగుదామని,Kakateeya University కి ఫొన్ చేస్తే వాడేదో ఉర్దూలో మాట్లాడి, మా తమ్ముడిని ఖంగారు పెట్టాడు.

    ,b> విదేశాలలో ఉండే మన వాళ్ళందరూ తెలుగు కి పెద్ద పీట వేసి ఎంతెంతో సేవ చేస్తూంటే ఇక్కడ తెలుగు వారి భాషా తిరస్కృతి ఎంతో వెగటు పుట్టిస్తొంది.</b.తెలుగు కి ప్రాచీన హొదా కల్పించాలని
ఊరికే టి.వి.ల్లొనూ, రోడ్లమీదా placards పట్టుకు తిరగడం కాదు, హోదా ఇచ్చిన తరువాత మనం ఏంచేస్తున్నామనేది ప్రతి తెలుగు వాడూ గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాలి
.