బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–HOME Minister

    పైన శీర్షిక చూసి నేను ఏదో చిదంబరం గారి గురించో, సబితా ఇంద్రారెడ్డి గారి గురించో వ్రాస్తున్నానని అనుకోకండి. వారి గురించి వ్రాయడానికి ఎన్నెన్నో న్యూస్ పేపర్లున్నాయి. ఇంకా ఇక్కడ బ్లాగ్గులలో కూడా Space తినేయడం అనవసరం. నేను వ్రాసేది మన కి సంబంధించిన మన జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తి గురించి. ఆ వ్యక్తే లేకపోతే ఈ సృష్టి కే అర్ధం లేదు.
She continues to be the “unsung” hero/ine. ఒక్కసారి గుండెమీద చేయి వేసికొని ఆలోచించండి– ఒక అమ్మ, ఒక భార్య కనుక లేకపోతే మన అస్థిత్వమే లేదు.
వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఈ విషయం అందరికీ తెలిసిఉన్నా ఒప్పుకోవడానికి మన “అహం” అడ్డొస్తుంది.ఇందులో ఎవరూ exceptions లేరు ( నన్నుకూడా కలుపుకుని).మనం అందరమూ ఆ వ్యక్తిని Take it for granted గా చేసేసికొన్నాము. అయినా ఆ వెర్రి ఇల్లాలు మన గురించే ఆలోచిస్తుంది.

మన అమ్మల గురించి ఒక్కసారి గుర్తు చేసికోండి, మనం ఎంత పెద్దవారమైనా మన గురించే ఆలోచిస్తుంది. ఒక్కొక్కప్పుడు ఆ ఇంటికి వచ్చే కోడలికి ఈ విషయం నచ్చదు. అయినా చీవాట్లు తింటూనే తన కొడుకు గురించి ఆలోచిస్తుంది.మనకే ఒక్కొక్కప్పుడు చిరాకు వస్తుంది– నేను ఇంత పెద్దవాడై, పిల్లల తండ్రినైనా ఇంకా నా గురించే ఎందుకు తాపత్రయపడతావూ అని విసుక్కున్నా, తన పని తను చేస్తూనే ఉంటుంది.ఇప్పుడైతే ఇంతింత చదువులూ అవీ వచ్చాయి కనుక, పిల్లల పెంపకాల గురించి పుస్తకాలూ, అలాగే అంతర్జాలాలూ, కన్సల్టెంట్లూ ఎన్నెన్నో వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయండీ ఇవన్నీ ? ఏ బడికీ వెళ్ళి చదువుకోలేదు, ఇంట్లో నేర్చుకున్న రామాయణం, మహాభారతం లలో నేర్చుకున్న విషయాలు ఆకళింపు చేసికొని మనని పైకి తీసికొచ్చారు. ఈ రోజుల్లో లా Nuclear families కావు. ఒక్కో కుటుంబం లో అధమ పక్షం ఓ అరడజనైనా బ్రతికి బట్ట కట్టిన సంతానం ఉండేవారు.ఇవికాకుండా పురిటిలోనే పోయిన వాళ్ళు. ఎక్కడ చూసినా 8-10 కాన్పులుండేవి. ఈ రోజుల్లోలాగ మెటర్నిటీ శలవలూ, నో మార్క్స్ క్రీం లూ ఉండేవికావు. ఒకదాని తరువాత ఒక కానుపు. పైగా ఇంట్లో ఎంతమందుంటే అంత అందమూ, సౌభాగ్యమూ అనుకొనేవారు. మన అమ్మలే వద్దనుకుంటే మనం ఈ నాడు ఈ బ్లాగ్గులు వ్రాసుకొనేవారమా, లేక చదువుకునేవారమా ? ఇక్కడ తండ్రి కంటే తల్లే ముఖ్యం. ఆవిడ వద్దనుకుంటే ఎవరూ ఏమీ చేయకలిగేవారు కాదు.

ఇలా వరసగా పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకోలేదు, వాళ్ళని ఓ మంచి వ్యక్తిగా దిద్దడంలో తల్లిదే ముఖ్యపాత్ర. ఎందుకంటే ఈ తండ్రి అనే ప్రాణి, సంపాదించి ఇంట్లో డబ్బు ఇస్తే చాలు, భార్యే అంతా చూసుకుంటూందనుకొనేవాడు. ఈయన గారిచ్చే సంపాదనతోటే ఇంట్లో అంతా జరుగుతోందన్న దురభిప్రాయం చాలా మందికి ఉండేది.వీధిని పడకుండా గుట్టుగా సంసారం గడిచిందంటే అంతా ఆ ఇంటి ఇల్లాలి ఘనతే. ఆవిడ ఏ Management Institutes కీ వెళ్ళలేదు.అయినా వాళ్ళు చేసిన Time management, ఈ రోజుల్లో ఎవరైనా చేయగలరా? ఏమైనా అంటే ఆరోజుల్లో
సంగతి వేరూ, ఈరోజుల్లో పరిస్థితులు వేరూ అంటారు.అప్పటి లాగ ఈ రోజుల్లో కూడా 5-6 పిల్లలుంటే ఏమయ్యేదీ? ఊహించుకుంటేనే భయానకంగా ఉంది కదూ, ఇలాగే మన అమ్మలు అనుకుంటే…

అలాగని ఈ రోజుల్లో ఉన్న “అమ్మ” లను కించపరచడంలేదు. ఎన్ని యుగాలైనా అమ్మ అమ్మే.ఇప్పుడు మాత్రం పొద్దున్నే చూడండి వాళ్ళు చేసే భరత నాట్యం–పిల్లల్ని లేపడం,వాళ్ళకి తిండి పెట్టడం, బాక్స్లు సర్దడం,ఈ లోపులో మన హీరో గారు మెల్లి మెల్లిగా లేచి ఏదో బిజీ గా ఉన్నట్లుగా, మధ్యమధ్యలో తొంగిచూస్తూ( పిల్లల్ని తయారుచేయడం అయిందా లేదా అని), భార్యని త్వరగా తెమలమని హడావిడి పెట్టేస్తాడు.ఈవిడెమో ఇవన్నీ తెముల్చుకుని ఆఫీసుకి పరుగులెడుతుంది.పోనీ కారులోనో, స్కూటర్ మీదో తీసికెళ్ళొచ్చుగా, అబ్బే, పిల్లల వంక పెట్టి ముందుగానే పారిపోతాడు, పైగా దారిలో తన ఆఫీసులో పనిచేసే ఏ అమ్మాయికో లిఫ్ట్ కూడా ఇస్తాడు.

ఇదివరకటి రోజుల్లో గుర్తుందా, మన అమ్మలు చాకలి లెఖ, పాల లెఖ నోటితో చెప్పేసేవారు,నాగాలెన్నున్నాయోకూడా గుర్తు పెట్టుకుని. ఇప్పుడైతే calculator లేకుండా చేయమనండి!
ఇంకో సంగతి మన తాతయ్యలు ముందుగా స్వర్గస్థులైనా సరే, మన మామ్మలూ, అమ్మమ్మలూ అధైర్య పడకుండా, పాలేర్లని పెట్టుకొని పాడీ పంటా చూసుకునేవారు. అదేకాకుండా ఆ రోజుల్లో
నమ్మకాలూ అలాగే ఉండేవి. మేము చేసికున్న అదృష్టం ఏమిటంటే మాకు ఆనాటి అమ్మమ్మల్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది. అంటే ప్రస్తుతం 50–60 సంవత్సరాల మధ్యన ఉండే ఆడ మొగ వారికి. ఈ జనరేషన్ వాళ్ళకి Grandma, Grandpa ల గురించి మాత్రమె తెలుసు.ఒక్కసారి మీ అమ్మగారిని అడిగి చూడండి, వాళ్ళ అమ్మనిగురించి. నాన్నని వాళ్ళ అమ్మనిగురించి అడిగితే లాభంలేదు, ఎందుకంటే ఆయన Administration centre అప్పటికే మారిపోయింది.ఒకమాట ఒప్పుకోవాలి మగవారి Allegiance to the ultimate power,i.e. the lady of the house.

ఇన్ని పనులు సవ్యసాచిలా చేస్తున్నా మనకి అమ్మంటేనే లోకువ. ఎందుకంటే మనకి ఆవిడ ఓ Punching bag. నాన్నమీద ఏమైనా ఎగిరేమనుకోండి ఇంట్లోంచి తరిమేస్తాడు. అమ్మైతే
మన గురించే ఆలోచిస్తుంది.That’s what the umbilical cord is all about!!
ఆనాటి అమ్మ అయినా ఈ నాటి అమ్మ అయినా ఎప్పుడూ తన ఇల్లూ, పిల్లలూ ,భర్తా గురించే ఆలోచిస్తుంది. నాగులచవితికి ఉపవాసాలుంటుంది, పోలాల అమావాస్యకి పూజలు చేసి
పొట్టెక్క బుట్టలు
చేస్తుంది. అయినా ఆఖరికి అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం.
This is my humble Tribute to all Ammaas ( Past, present and future).

I want to appologise to all my readers for all the mess I created today. I am trying to repair the same. Somehow my page is not traceable. I will be back soon.

బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు-HOME Minister

బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు-Non Resident Andhraas (NRAs)

    నేను పొద్దుట నా బ్లాగ్గు URL మార్చే కార్యక్రమంలో ఉండగా , ఓ పోస్ట్ టైపు చేశాను. అదికూడా దురదృష్టవశాత్తూ కూడలి/ జాలరి లలో వచ్చేసింది. క్షంతవ్యుడను. నేను ఈ వేళ మన పరాయి రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి గురించి వ్రాస్తున్నాను. వాళ్ళని ముద్దుగా N R A ( Non Resident Andhraites) అందాము.

    నేను ఇక్కడ మహరాష్ట్ర లో గత 46 సంవత్సరాలుగా ఉంటున్నాను. తెలుగు శుభ్రంగా మాట్లాడుతాను, చదువుతాను. ఆ మధ్య ఎవరో అడిగారు కూడానూ ” ఇన్నాళ్ళనుండి రాష్ట్రం బయట ఉండి కూడా తెలుగు అంత చక్కగా మాట్లాడగలుగుతున్నరూ అని. ఇదేం బ్రహ్మవిద్యా? మనం నేర్చుకున్న భాష మాట్లాడడం కూడా ఓ వింతగా కనిపిస్తోంది ఈ రోజుల్లో. నాకైతే మా కోనసీమ భాషలో ఎవరు మాట్లాడినా గుర్తు పట్టేస్తాను!! ఓ సారి పూణే లో ఒకాయన మాట్లాడుతున్నారు ఎవరితోనో–నేను అడిగాను మాస్టారూ మీది ఏ ఊరని.ఆయన ఎంతో మొహమ్మాట పడిపోతూ, ” మాది ఆంధ్ర దేశంలో , ఓ మారుమూల ఊరండి” అన్నారు.అయినా వదిలిపెట్టక, ఎక్కడండీ అన్నాను, వదిలేలా లేడూ అనుకొని ” బోడసకుర్రు” అన్నారు.అంటే కోనసీమన్నమాట అంత సిగ్గుపడిపోతారేమిటండి బాబూ, నాది అమలాపురమండి బాబూ,అనేటప్పటికి ఆయన ఎంతో ఆనందపడిపోయి, ఓ గంటసేపు మాట్లాడుకున్నాము.

    నెను మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా తెలుగు మాట వినిపిస్తే చాలు వదిలిపెట్టను. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే.వాళ్ళని పలకరిస్తాను.ఎవరి వెర్రి వాళ్ళకి ఆనందం. ఈ మధ్యన కొన్ని విచారకరమైన సంఘటనలు కూడా చూశాను.తాము తెలుగు వారిమని చెప్పుకోవడం సిగ్గు పడేవారిని–ఈ ప్రకోపం ముఖ్యంగా మన Software కుర్రాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోంది. పరిచయం చేసుకోగానే వాళ్ళ ఆస్థి ఏదో లాగేసుకుంటాడేమో అన్నంత భయం వీళ్ళకి.అలా ఎందుకో నాకు అర్ధం అవదు.
ఈ ఊళ్ళొ వచ్చే ప్రతీ తెలుగు పుస్తకమూ కొనుక్కుని మరీ చదువుతాను, ఎవరికీ ఇవ్వను!! ఎవరిదగ్గరా తీసికోను. మరీ దూరం అనికానీ ఆంధ్రా అసోసియేషన్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఇన్నేళ్ళలోనూ నాలుగంటే నాలుగు సార్లే వెళ్ళాను.కారణాలనేకం.చెబితే బాగుండదు. ఎవరినైనా కష్టపెట్టిన వాడినౌతాను.సభ్యత్వం కూడా తీసికొన్నాను. ఏమైనా కార్యక్రమాలుంటే తప్పకుండా తెలియచేస్తామంటారు, కానీ ఎప్పుడూ చేయలెదు. సభ్యత్వం ఇచ్చేటప్పుడున్న enthusiasm పిలిచేటప్పుడుండదు.అక్కడకు వెళ్ళినా ఏదో మనకి తెలిసినవారి ద్వారానే కనుక వాళ్ళతోటే కాలక్షేపం చేయాలి. కొత్తగా వచ్చాడూ, పోనీ ఏదో పరిచయం చేసికుంటే బాగుంటుందేమోననే భావం ఎక్కడా కనిపించదు. పోనీ ఎవరితోనైనా మాట్లాడాలని, ముందుగా ఓ నవ్వు పారేస్తే అది మనమే కిందనుండి ఎత్తుకోవాలి !! అర్ధం అయిందా? రెండు చేతులు కలిస్తేనే కదండీ చప్పట్లు వచ్చేవి? ముందుగా ఎవరినో అడిగి తెలిసికుంటారు– వీడు ఎక్కడ పనిచేస్తున్నాడూ, వీడి వల్ల మనకెమైనా ఉపయోగం ఉంటుందా అని. ఏమీ లేదూ అని తెలియగానే మిమ్మల్నెవడూ పట్టించుకోడు.

    మనం మన ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అడుగుతారు, అక్కడ పూణేలో తెలుగువాళ్ళున్నారా, అందరూ కలుస్తూంటారా అని.నవ్వొస్తుంది చెప్పడానికి.’ మీకు కావాలంటే మూడు లక్షల మంది ఉన్నారూ, అఖర్లేదనుకుంటే ఎవ్వరూలేరు అంటాను.
ఈనాటి కుర్రాళ్ళకింకో భయంఉందండోయ్–మనం ఏదైనా సంబంధంగురించి చూస్తున్నామెమో అని. నా ఉద్దేశ్యంలో బహుశా ఈ కారణంవలనెమో ఇంకో తెలుగువాడితో పరిచయం చేసికోవడానికి, కొంచెం వెనకాడతారు. అందుకేనేమో ఈ రోజుల్లో ఈ software కుర్రాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం లేదు.రెండుమూడేళ్ళక్రితం అయినవేమో అయిపోయాయి.అయ్యా ఈ కుర్రాళ్ళని ఎవరు ఎంచుకుంటారండి బాబూ, గవర్నమెంటుద్యోగంచేసేవాడికి First preference ఇస్తున్న ఈరోజుల్లో !!

    ఇంక అమ్మాయిల మాటైతే అడగఖర్లెదు తెలుగులో మాట్లాడితే నామోషీ అన్నట్లుగా ఉంటారు.మాతృభాషలో మాట్లాడుకోవాలని ఎందుకుండదూ వీరికి? చాలా రోజులనుండి ఇక్కడే పుట్టి, పెరిగిన వారికి చదవడం, వ్రాయడం రాలెకపోవచ్చు, మాట్లాడడానికి ఏం రోగం ? టి.వీ.లలో తెలుగు కార్యక్రమాలు చూడడం ఏదో Village brutes చేసే పని.పైగా కొంతమందిని చూశాము ” మా పిల్లలకి తెలుగు అర్ధం అవదండీ ” అనడం. అదో గొప్ప qualification అనుకుంటారు.తల్లి తండ్రీ తెలుగువాళ్ళు, వీళ్ళకెందుకు నేర్పలేదో అర్ధం అవదు. అంటే ఈ భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేవి వీళ్ళకు అర్ధం అవకూడదనా? ఏమో !!

%d bloggers like this: