బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు-రాజకీయాలు

    ఇక్కడ మహారాష్ట్ర లో విద్యా శాఖా మంత్రి విఖేపాటిల్ గారికి ( ఆయన ఎన్నెన్నో విద్యా సంస్థలు నడుపుతున్నాడులెండి) ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. జూనియర్ కాలేజీలని ఉన్నాయి చూడండి, వాటిల్లో 90 శాతం State Board విద్యార్ధులకి రిజర్వ్ చేసేశాడు. మిగిలిన 10 శాతమూ, అందరూ కలిసి కొట్టుకోవాలన్న మాట-CBSE, ISC లాంటి కేంద్ర బోర్డ్ లలో 10 వ తరగతి చదివిన వాళ్ళందరూనూ. అసలు ఇలాంటి దరిద్రపు ఐడియా ఎలా వచ్చిందో తెలియదు.ఇలాంటి జాడ్యం మిగిలిన రాష్ట్రాలకి కూడా పాకితే ఈ CBSE, ISC వాళ్ళు ఎక్కడ చదువుతారండి బాబూ?
అదృష్టం కొద్దీ ముంబై హైకోర్ట్ వాళ్ళు దీనిని కొట్టేశారు. మంచి విషయమేమంటే వీళ్ళు మళ్ళీ సుప్రీం కోర్ట్ కి అపీల్ చేయలేదు.అంటే దీని అర్ధం ఏదో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ బాంక్
రాజకీయాలన్న మాట.ఈ రాజకీయ నాయకులు Cheap popularity కోసం ఏమైనా చేస్తారు.

    నిన్న రైల్వే బడ్జెట్ మీద చర్చ సమయంలో లాలూ ఏమన్నాడో విన్నారా?దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లని World class చేస్తానని తను మంత్రి గా ఉన్నప్పుడు ఉత్తిత్తినే అన్నాడట. సిగ్గు లెదూ అలా చెప్పుకోవడానికీ? ఇప్పుడు తెలుస్తోంది మన రాజకీయ నాయకులు ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో. లాలూ ఏమో ఏవేవో చేసేసి రైల్వేలకు 90,000 కోట్లు సంపాదించాడని అదేదో
Turn Around చేసేశాడని దేశం అంతా మారుమ్రోగించేశారు. Management Institutes వాళ్ళందరూ ఇతనికి బ్రహ్మ రధం పట్టారు.తను చేసిందేమీ లేదు, భార్యకి ముఖ్యమంత్రి పదవి, ఓ కొడుక్కి క్రికెట్ టీం లో స్థానమూ, ఇంకో కూతురికి LIC వాళ్ళ దగ్గరనుండి అవార్డులూ–ఎందుకయ్యా అంటే ఈ పిల్ల “తన” స్వశక్తి తో ఎన్నో కోట్ల రూపాయల భీమా చేయించిందిట,వాళ్ళ నాన్న పేరు ఉపయోగించకుండానే చేసిందా? లాలూ తిన్న పశుగ్రాసం విషయం ఇంకా తేలలెదు !!

    మొన్నటి దాకా తి.తి.దే లో పనిచేసిన రమణాచారి గారు ఆ పదవి వదిలి, దేవాదాయ శాఖ లో ముఖ్య కార్యదర్శి గా చేరగానే “ డాలర్ “ కేసుని తిరగ తోడుతున్నారు.ఇన్నాళ్ళూ తిరుమలలోనే ఉండి ఏం చేశారుట? నిద్రపోయారా? ఇంక మరో E O, పి.వి.ఆర్ ప్రసాద్ ఇదివరలో స్వాతి వారపత్రికలో శ్రీ వెంకటేశ్వరస్వామి మహిమలగురించి వ్రాశారు, చాలా బాగున్నాయి.
అవి బాగున్నాయన్నారు కదా అని ఇప్పుడు తను ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు జరిగినవన్నీ వ్రాయడం మొదలెట్టారు. పోయిన వాళ్ళగురించైతే ఫర్వా లెదు బతికున్నవాళ్ళ గురించి కూడా ఎడా పెడా వ్రాసేస్తున్నారు. Ethics అనేవి లేవా?

    ఇంక మమతా బెనర్జీ బెంగాల్ కే అంతా చేసేసిందని ఏదవడం ఎందుకూ , ప్రతీ మంత్రీ తన రాష్ట్రానికే చేస్తాడు. చవాన్ రక్షణ శాఖలో ఉన్నప్పుడు 1962 లో మహరాష్ట్రా కి 8 కొత్త Ordnance Factories తీసుకుపోయాడు.ఇందిరా గాంధీ ధర్మమా అని మెదక్ లో Ordnance Factory మొదలెట్టారు, చివరకు జరిగిందేమిటీ, ఆవిడ వెళ్ళగానే వెంకట్రామన్ ధర్మమా అని ఆవడి కి వెళ్ళిపోయాయి.ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.
దరిద్రమంతా మన తెలుగు మంత్రులతోనే మిగిలిన వాళ్ళకుండే ధైర్యం లేదు, ఎవడో ఏదో అనుకుంటాడని భయం !!బండారు దత్తాత్రేయ రైల్వే లో ఉండగా ఎన్ని ప్రాజెక్టులు తేగలిగేడుట?
కొన్ని సంవత్సరాలనుండీ రక్షా సహాయ మంత్రి గా తెలుగు వాళ్ళే ఉంటూ వచ్చారు–మొదట్లో కొత్త రఘురామయ్య, ఆ తరువాత కృష్ణంరాజూ, ప్రస్తుతం పళ్ళంరాజూ--ఎక్కడో మారుమూలున్న నలందా లో 40 వ Ordnance Factory పెట్టడానికి జార్జ్ ఫెర్నాండెస్ చేసినంత కూడా మన ” తెలుగు తేజాలు “ చేయలేకపోయారు.వీళ్ళు మంత్రులుగా ఉన్నన్నీ రోజులూ వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటారు కానీ మన గురించి ఎవడు పట్టించుకుంటాడండి బాబూ?</font.