బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–ఆర్ధిక మాంద్యం


    నిన్న టివి లోనూ, ఈ వేళ సాక్షి దిన పత్రిక లోనూ ఒక వార్త చూసి చాలా బధ పడ్డాను. హైదరాబాద్ లో మహరాష్ట్ర కి చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసికొన్నాడని. కారణం –ఆర్దిక మాంద్యం. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట. ఆర్ధిక మాంద్యం ఒక్ ” బజ్ వర్డ్ ” అయిపోయింది. మా చిన్నతనం లోకానీ, ఉద్యోగం లో ఉన్నప్పుడు కానీ ఈ మాట ఎప్పుడూ వినలేదు. ఈ మధ్యన చదువుతున్నాము, కానీ దీని అసలు అర్ధం ఏమిటో నాకూ తెలియదు.

మా చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం లోనుండి వచ్చిన వాళ్ళు, ఏదో ఓ డిగ్రీ తీసికోవడం, ఆ తరువాత బి.ఈ.డీ ట్రైనింగ్ అయి ఎక్కడో టిచర్ గా చేరిపోవడమూ, డిగ్రీ లేనివాళ్ళు, సెకండరీ గ్రేడ్ ట్రైనింగో, లేక పీ.టీ ట్రైనింగో అవడమూ. ఎవరికీ ఏమీ సమస్య ఉండేదికాదు. పెళ్ళి సంబంధం వచ్చినా ఏదో కట్నం, దానితో పాటు రాలీ సైకిలో, హంబర్ సైకిలో ఇచ్చేవారు. కొంచెం డబ్బున్నవాళ్ళైతే ఆ సైకిలుకి ఓ డైనమో లైటు కూడా ఉండేది !! ఈ స్కూళ్ళలో కాకుండా కొంతమంది, కొచెం దూరం వెళ్ళడానికి సిధ్ధం అయితే, హైదరాబాద్ లో సెక్రటేరియట్ లోనో, లేకపోతే ఏ.జీ ఆఫీసులోనో సెటిల్ అయిపోయేవారు. వాళ్ళ తల్లితండ్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకొనేవారు– మా వాడు హైదరాబాదు లో పనిచేస్తున్నాడూ అని.పెళ్ళి సంబంధాలు కూడా పుష్కలంగా వచ్చేవి.

మా రోజులు అంటే 1962 తరువాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు దొరకడం ప్రారంభం అయ్యాయి. ఆ రోజుల్లో అంటే చైనా యుధ్ధం తరువాత ఇక్కడా పూనా లో డిఫెన్స్ అకౌంట్ లోనూ, మా ఆర్డినెన్స్ ఫాక్టరీలలోనూ ఎక్కడ చూసినా మన ( దక్షిణ భారతీయులే) వాళ్ళే కనిపించేవారు. మరీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు- ఏదో క్లెర్కులుగానూ, సూపర్వైజర్లు గానూ. ఎంత చెప్పినా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకంటే, మా వాటికి గ్లామర్ ఎక్కువగా ఉండేది, కారణం–జీతాలూ, టైముకి డి.ఏ లూ — పెళ్ళి 1974 లో అయేటప్పడికి నా జీతం 500 రూపాయలు, కట్లు పోగా చేతికి వచ్చేది 350. హాయిగా ఇద్దరికీ సరిపోయేది. ఇప్పుడున్నటువంటి మాల్సూ , అవీ ఉండేవికాదు. చేతిలో డబ్బుంటే ఏదైనా కొనుక్కోవడం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టడం. ఓ పిల్లో పిల్లడో వచ్చిన తరువాత, మన సో కాల్డ్ లక్షరీలు ( అంటే సినిమాలూ, హొటళ్ళూ ) బంద్.ఆ పిల్లల చదువులూ, వాళ్ళ బాలారిష్టాలూ వాటితో సరిపోయింది. కొద్దిగా రిస్క్ తీసికొనేవాళ్ళు, ఇన్స్టాల్మెంట్లమీద కొద్దిగా సరుకులు జమా చేసికొనేవాళ్ళు. నాకు ఇంట్లో ఫ్రిజ్ తీసికోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. దానిమీద డబ్బు పెట్టే ధైర్యమూ ఉండేదికాదు. స్కూటర్లూ, మోటార్ సైకిళ్ళ సంగతి నాకు తెలియదు.

90 ల దశకం వచ్చేటప్పడికి ఎకనామిక్ రెఫార్మ్స్ ధర్మమా అని మొత్తం పిక్చరే మారిపోయింది.ఐ.టీ ధర్మమా అని ఎక్కడచూసినా లక్షల్లో జీతాలూ, గ్లోబలైజేషనో అదేదో పేరుచెప్పి ఎక్కడ చూసినా హరితమే హరితం.ఎవరిని అడిగినా సత్యమ్ లో ఉన్నాననో, విప్రో లో ఉన్నాననో, వీటికి అంతులేదు. మమ్మల్ని చూసి ” సర్కారీ నౌక్రీ మే హై క్యా ? ” అని అదేదో క్రైమ్ లా చూసేవారు. సంబంధాలు చూసే వాళ్ళు కూడా సాఫ్ట్ వేర్ వాళ్ళనే ఆకర్షించేవారు. గవర్నమెంట్ ఉద్యోగస్థులకి పెళ్ళి అవడమే గగనంగా మారిపోయింది. ఏవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లు ఆఖరి ప్రిఫరెన్స్ గా మా వాళ్ళు( గవర్నమెంట్ పక్షులు) ఉండేవాళ్ళు !!నాకు ఇల్లుకట్టుకోవాలని ఆలోచన రావడానికి పాతికేళ్ళు పట్టింది.ఏదో అప్పోసప్పోచేసి ఇల్లు కట్టుకున్నాను. మా ధ్యేయం ఎలా ఉండేదంటే, ఓ ఇల్లు కట్టడం, పిల్లలని ఏ ఇంజనీరో, డాక్టరో చేయడం,వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం.అన్నీ పూర్తయితే మంచిదే.

ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ” మీకెవరికీ ఈ రోజుల్లోవాళ్ళలాగ ఓ యాంబిషన్ లేదు, డ్రైవ్ లెదు, రిస్క్ తీసికొనే ధైర్యం లేదూ” అనేవాళ్ళే. నేను నలభై రెండేళ్ళు సర్వీస్ చేసి ఆఖరి రోజున నాకు మా వాళ్ళు “లాస్ట్ పే సర్టిఫికెట్” ఇస్తే మా పిల్లలకి చూపించాను. నా మొదటి జీతం 202.50పైసలు.ఆఖరి జీతం 20,202 రూపాయలు మాత్రమే. ఇదే ఇంకో చోటైతే కార్పొరేట్ సెక్టర్ లో అయితే నా సర్వీసుకి ఆకంపెనీ చైర్మన్ అవాలి.గవర్నమెంటు లో ఉన్న రూల్స్ చిత్రంగా ఉంటాయి.అక్కడ మెరిట్ కి అంత విలువ లెదు. మిగిలిన చాలా ఫాక్టర్లుంటాయి.దాని సంగతి వదిలేయండి, నాకెప్పుడూ విచారం లెదు.నాకెదో అపకారం జరిగిపోయిందీ అని.. ఆ ఉద్యోగం నాకు తల్లి లాంటిది–నాకూ, నాకుటుంబానికీ రెండుపూటలా తిండి పెట్టింది,పిల్లలకి చదువు చెప్పించింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించింది, ఉండడానికి ఓ ఇల్లు కట్టీంచింది— ఇవన్నీ అన్నదీ నేను కాదు ,మా పిల్లలు. అప్పటికే వాళ్ళు ఉద్యోగస్థులయ్యారు, జీతాలు కూడా అయిదంకెలలో తెచ్చుకుంటున్నారు. నాకూ, మా ఇంటావిడకూ చాలా సంతోషం వేసింది, మన పిల్లల కాళ్ళు ఇంకా భూమి మీదే ఉన్నాయి వాళ్ళకేమీ ఫర్వాలేదూ అని.

నేను చెప్పేదేమిటంటే జీతాలూ, ఖర్చులూ ఇప్పుడూ ఉన్నాయి, అప్పుడూ ఉన్నాయి, తేడా యేమిటంటే మనుష్యులలో వేసిన వెర్రి తలలు.ఈ రోజుల్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే , జీతం అయిదంకెల్లో ఉంటుంది, వాడనుకుంటాడూ, అర్రే మానాన్న ఈ జీతం సంపాదించడానికి అన్నేళ్ళు పట్టిందీ, మనం ఓ ఏడాదిలో ఓ కారూ, ఓ ఫ్లాట్టూ కొనేసి మన సత్తా ఏమిటో చూపిద్దాం అందరికీను. అనే ఓ ప్రలోభం లో పడతాడు.అకస్మాత్తుగా ఉద్యోగాలు ఊడిపోయేసరికి మన వాడికి వళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది. ఈ కొన్న వస్తువులకి వాయిదాలెవడు కడతాడూ , క్రెడిట్ కార్డుల అప్పు ఎవరు తీరుస్తాడూ. వాళ్ళ నాన్నని అడిగే ధైర్యం లేదు. అప్పులు చెసే ముందర ఆయనతో చెప్పాడా లేదు , అందరినీ ఆశ్చర్యంలో ముంచేద్దామని ఈ అప్పులన్నీ చేసి తనే మునిగిపోయాడు. మన ఖర్చులమీద నియంత్రణ ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదుగా . ఈ ఆర్దిక మాంద్యం కొత్తగా వచ్చినదేమీ కాదు. ఎప్పుడూ ఉండేదే. మనుష్యులూ, వాళ్ళ జీవిత పంథాలూ మారుతున్నాయి. ఇదివరకటి తరానికి దానిని ఎదుర్కునే ధైర్యం ఉండేది. ఇప్పటి వాళ్ళకి అది లోపించింది ( అందరికీ కాదు, ఆత్మహత్యలు చేసికొనే సచిన్ లాంటి వాళ్ళకి )

తేలిందేమిటంటే ” యాంబిషనూ, డ్రైవూ ” కాదు కావల్సినవి, జీవితాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు. అదుంటే చాలు ” ఆర్ధిక మాంద్యం” గో టూ హెల్

కొసమెరుపేమిటంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగస్థులు పెళ్ళి సంబంధాల మార్కెట్ లో డిమాండ్ లో ఉన్నారు. ” దునియా గోల్ హై “ .

.. .

15 Responses

 1. “తేలిందేమిటంటే ” యాంబిషనూ, డ్రైవూ ” కాదు కావల్సినవి, జీవితాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు. అదుంటే చాలు ” ఆర్ధిక మాంద్యం” గో టూ హెల్”

  అద్భుతం గా చెప్పారండీ! 🙂

  Like

 2. baaga chepparu……….
  risk teesukune dhairyam ippudu chaala mandiki ledu observe cheyandi enta mandi tamaku vachhina software jobs lo settle avutunnaru gaani chdivindi okati chesedi okati………………….
  na point of view lo appti valle baga risk chese vaallu vaallaki avkasam vundi……..kooda

  Like

 3. “దునియా గోల్ హై “…..మళ్ళీ రుజువైంది. “నిదానమే ప్రధానం ” అంటే ఏంటో తెలిసొస్తుంది.

  Like

 4. మీరు వ్రాసే ప్రతి మాట లోనూ మీ జీవితానుభవం మొత్తం కనిపిస్తోంది..జీవితం పట్ళ సమ దృక్పథం మీ మాటల్లో కనిపిస్తోంది..చాలా బాగా వ్రాస్తున్నారు.

  Like

 5. యోగీ,

  థాంక్స్.

  Like

 6. వినయ్,
  అప్పటి వాళ్ళే రిస్క్ తీసుకొనేవారని నేనన్నా, అందరూ ఏకీవభించరేమో.అయినా నాతో ఏకీభవించినందుకు చాలా థాంక్స్.

  Like

 7. మోహన్ రాజ్, లలితా,

  నెను వ్రాసినది మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

  Like

 8. great andi.. its fact eppudu software vallaki money ela spend chesedi teliyadam ledu.. kasatlu vacchinappudu matram disappointment auvtunnaru.

  Like

 9. లోకేష్,

  డబ్బు ఎలా ఖర్చు చేయాలో తెలియదనలేము. మీరన్నట్లు కష్టాలు ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు..

  Like

 10. ur the firstperson who called me vinay………….all r calling vinayak in blog world thanks…………..

  Like

 11. andaru software valla meeda antaru gaani vallake anta money vaste dubaara cheyyakunda vunatara……………..

  Like

 12. వినయ్,

  నాలాంటి వాళ్ళకి ఇచ్చి చూడు బాబూ !!

  Like

 13. చాల బాగుంది

  Like

 14. గొపాలకృష్ణా,

  ధన్యవాదాలు.

  Like

 15. మాబాగా చెప్పారు సార్!
  అన్నట్టు ఇది చూశారా?
  http://kottapali.blogspot.com/2009/07/blog-post_16.html

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: