బాతాఖానీ–తెరవెనుక (లక్ష్మిఫణి ) ఖబుర్లు–అర్రే బాగానే ఉన్నారా.


    చిన్న పిల్లలది అదో వింత మనస్తత్వం. ఎక్కడికైనా వెళ్తే , తల్లితండ్రుల్ని బయట పెట్టడమే వాళ్ళ ద్ధ్గేయంగా ఉంటారు.మనం ఏదో గొప్పగా, ” మా వాడు బయట ఏమీ తాగడండి ” అన్నామో మన కొంప ముంచేయడమే తమ జన్మ హక్కులాగ, అదే తాగుతాడు/తుంది.ఇంట్లో మనం ఏమీ పెట్టకుండా మాడ్చేస్తున్నట్లుగా
ఓ పోజు కూడా పెడుతారు. మనం ఓ వెర్రి నవ్వు నవ్వేసి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంకో టాపిక్ లోకి మార్చేస్తాము.అలాగే రైలు ప్రయాణాల్లో కూడా అలాగే ఉంటారు.ఎక్కడనుంచి వస్తాయో వీళ్ళకి ఈ విపరీతమైన బుధ్ధులు !!

   ఇది ఇలా ఉంటే, తల్లి తండ్రులది అదో రకం.చాలా మంది ఎవరింటికైనా వెళ్తే తమ పిల్లల్ని చాలా కట్టడి లో ఉంచుతారు.మనకీ ఏమీ సమస్య ఉండదు. కొంతమందైతే వాళ్ళ పిల్లల్ని ఎటువంటి కంట్రోల్ లేకుండా మన కొంపమీద వదుల్తారు. మనం ఏమీ అనలేము. ఇంటికి వస్తే భార్యో, భర్తో వీళ్ళకి కాపలా ఉండాలి.
లేకపొతే మన కొంప కొల్లేరైపోతుంది.వాళ్ళ పిల్లలు వాళ్ళకి గారం కానీ, ఊళ్ళోవాళ్ళందరినీ ఎందుకు క్షోభ పెడతారో అర్ధం అవదు. కొంతమందైతే పిల్లలకి అన్నం పెట్టడం చూడాల్సిందే. ఓ కంచం లో ఏదో పెట్టి ఆ పిల్లనో, పిల్లాడినో ఊరంతా తిప్పుతూ బలవంతం చేయడం. అపార్ట్మెంట్ సొసైటీ లలో ఐతే సెల్లార్ లో ఓ సైకిలు మీదో, దేనిమీదో తిప్పుతూ, ఆ డ్రిల్ చేయడం. ఖర్మ కాలి మనలాంటివాడెవడైనా అక్కడనుండి వెళ్తూంటే,” చూడు బూచాడు, అన్నం తినకపోతే నిన్ను ఎత్తుకుపోతాడు ” అని మన ఇమేజ్ అంతా పాడిచేస్తారు.అక్కడ రాజమండ్రి లో ఐతే, నన్ను ఓ డాక్టర్ చేసేశారు. అన్నం తినకపోతే డాక్టర్ అంకుల్ ఇంజెక్షన్ ఇచ్చేస్తారూ, అని ఆ పిల్లని భయ పెట్టడం. పోన్లెండి మరీ బూచాడూ అన లేదు. అప్పటినుంచి ఆ పాప నన్ను చూస్తే భయ పడి పారిపోతుంది. ఏదో తనని చూసినప్పుడల్లా మా నవ్య ని చూసినట్లుంటుందికదా అని నేననుకుంటే ఆ పిల్ల నా దగ్గరకే రాదు.అప్పటికీ నేను అడిగేను ” మీకేం అపకారం చేశానని ఇలా నన్ను హింసిస్తున్నారూ ” అని.వాళ్ళన్నారూ–ఇక్కడ అందరి వంతూ అయిపోయింది, మీరొక్కరే కొత్త ” బక్రా ” అన్నారు ఏం చేస్తానూ ?

   మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే, మనం అనవసరమైన త్యాగాలు చేసేసి, మన పిల్లల్ని ” నీ బొమ్మ తీసికోనీయమ్మా, చిన్న బాబు కదూ ” అంటాము. అలాగని వాళ్ళింటికి వెళ్తే అక్కడ ఏమీ ముట్టూకోనీయము. ఇది చాలా అన్యాయం కదూ.ఇలాంటివారిని ” చైల్డ్ అబ్యూజ్ ” కింద అరెస్ట్ చేయించాలి!!

   నిన్న చెప్పానుగా నాకు అందరితోనూ పరిచయం చేసికోవడమనే ఓ జాడ్యం ఉంది. గత 10 సంవత్సరాలుగా, మా నాన్నగారి అబ్దీకం, పూణే లోని రాఘవేంద్ర మఠం లో చేస్తూంటాను. అదే తిథికి పెట్టుకొనేవారు ఓ పదిమంది దాకా ఉంటారు. వాళ్ళందరినీ ప్రతీ ఏడాదీ కలుసుకొనేవాడిని. కలుసుకున్న ప్రతీ సారీ ఒకే డైలాగ్–
” సంతోషం, మళ్ళీ కలుస్తున్నానూ” అని. నేనంటానూ ఎప్పుడైనా నేను కనిపించక మా అబ్బాయి కనిపిస్తే తెలుసుగా… ఈ సారి గోదావరి తీరాన్న కంభం వారి సత్రం లో మా నాన్న గారి ఆబ్దీకం పెట్టాను. మొన్న పూణే లో నా రాఘవేంద్ర మఠం స్నేహితుడొకడు కనిపించాడు. నన్ను చూసి ” అర్రే బాగానే ఉన్నావా, ఇసారి కనిపించకపోతే మేమందరం పాపం నీ గురించే మాట్లాడుకొన్నాం” అని ఓ పరామర్శ చేశాడు.. ఇలా ఉంటుంది ఒక్కో సారి !!

   గత 10 సంవత్సరాలుగా, నేనే కూరలకి వెళ్ళేవాడిని. మార్కెట్ లో ఉన్న కూరల వాళ్ళందరూ పరిచయమే. అందరితోనూ ఖబుర్లు చెప్పడం ఓ అలవాటు ( కొద్దిగా ధర తగ్గిస్తాడేమో అని !!) ఈ మధ్యన రాజమండ్రీ కి మారడం తో , మా అబ్బాయి వెళ్తున్నాడు. వాడితో అందరూ ” బాబా కిధర్ హై” అని పరామర్శా!!అందరితోనూ పరిచయం చేసికొంటే ఇలాంటి ఈతి బాధలు తప్పవు.

   ఇన్ని ఔతున్నా కానీ, నేను నా స్వభావం మార్చుకోను.చెప్పులు కుట్టే వాడి దగ్గరనుండి, కూరల కొట్టు వాళ్ళు,టెలిఫోన్ల వాళ్ళూ, కచ్రా ఎత్తేవాళ్ళూ అందరూ నా ఫ్రెండ్సే. నేను సర్వీస్ లో ఉండగా, మా ఫోర్మన్ ఒకాయన చెప్పేవారు– మనకి ఎంత మంది స్నేహితులుంటే అంత మంచిది. ఎప్పుడైనా మనం ఏ రోడ్డు మీదైనా పడిపోతే, మనని తెలిసినవారు ఎవరో ఒక్కరు ఉంటారు. ఇంట్లో కబురు చెప్పడానికైనా ఎవరో ఒకరుండాలిగా. అలాగే ఆయన రిటైర్ అయిన తరువాత ఒకరోజు న మార్కెట్ లో హార్ట్ ఎటాక్ వచ్చి పడిపోయారు.అక్కడ ఉండే కొట్ల వాళ్ళందరికీ ఈయన తెలుసు. ఆయన అక్కడే స్వర్గస్తులయ్యారు. అ కొట్ల వాళ్ళే ఇంటికి వార్త చేరేశారు.

   .రాజమండ్రీ లో అయితే ఆటో వాళ్ళ దగ్గరనుండి అందరూ స్నేహితులే, మా సొసైటీ లో ఉన్న పాప తప్ప !! మా పిల్లలంటూంటారు ఇంతమందితో స్నేహం ఎలా చేస్తావూ అని.ఈ రోజుల్లో పెద్ద పెద్ద సొసైటీలలో ఒకడికి ఇంకొకడు తెలియదు. తనేమిటో తన కుటుంబమేమిటో అంతే.మన కుటుంబాలు ఎలా ఉన్నాయో అదేదో న్యూక్లియర్ ఫామిలీ అంటారుగా, అలాగే మన ఫ్రెండ్షిప్లు కూడా న్యూక్లియర్ అయిపోయాయి

   మా దగ్గర ఓ డబ్బా కెమేరా ( కోడక్ ) ఉండేది.దాంట్లో ఎనిమిది మాత్రమే బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు వచ్చేవి. ఒక సారి పిల్లలకీ, మాకూ రంగుల్లో ఫొటోలు తీయించాలని, మా ఫ్రెండ్ ఒకడిని ఇంటికి పిలిచాను. ఏవేవో తీసి, చివరగా నాకు కూడా విడిగా ఓ ఫొటో తీశాడు. ఓ వారం రోజులు పోయిన తరువాత ( ఇప్పటి లా ఇన్స్టెంట్ వెరైటీ రోజులు కావుగా ) ఫొటోలు అన్నీ తీసికొచ్చాడు. అంతా బాగానే ఉంది, నాది మాత్రం ఎన్లార్జ్ చేసి తెచ్చాడు.. ” ఇదేమిట్రా ” అంటే, మొహమ్మాట పడిపోయి, దానికి డబ్బులు తీసికోకుండా ” ఇది నా దగ్గరనుండి కాంప్లిమెంటరీ, ఉంచండి, తరువాత ఎప్పుడైనా ఉపయోగిస్తుంది ( దండ వేయడానికి అనే అర్ధం వచ్చేటట్లుగా )” అని నాకు అంట కట్టేశాడు !!.

19 Responses

 1. Challani Godavari pakka, prasanthamaina jeevitham. Time pass chakati bhatakani tho. Super Uncle. Naa blog lo meeru vadilina comment nuchi ikkadaki follow ayamu. Payna, comment vadilipettina Rajashekar, naa thamudu. Telugu ni, english lo..sure, might irritate you. Keep up the good work.

  Like

 2. meeku abhyantaram lekapothe mimmalini guruvu garu ani pilustanandi. Deeniki moodu karanalu vunnayi modatidi meeru ma nannagaru vayaskulu ,rendodi naaku uncle anna padam ante assalu ishtam ledu, moodavidi nenu kooda telisina teliyakapoyina matladatanu andarito parichayam kosam, mee blog choosaka kachhitam ga meeru guruvulu.

  Boochodu vishayam lo meeru adrushtavantulu, pillala vishayam “child abuse” baaga chepparu..bahusa manam “hypocrite” avvakanda vundadaniki ala chestamemo.

  mee snehitudu photo teesukuravatam vivarana chaala haasyam ga vundi.

  Like

 3. “ఇలాంటివారిని ” చైల్డ్ అబ్యూజ్ ” కింద అరెస్ట్ చేయించాలి!!” 😦 😦 nooooooooooo అంతపని మాత్రం చెయ్యకండి.
  “కొంతమందైతే వాళ్ళ పిల్లల్ని ఎటువంటి కంట్రోల్ లేకుండా మన కొంపమీద వదుల్తారు”…అవును అలాంటివారిని చూస్తే నాకు చాలా కోపం వచ్చేసుంది.ఇంట్లో ఎలా వున్నా బయట కొద్దిగా అన్నా కంటోల్ లో పెట్టాలిగా.

  Like

 4. బాగుందండి మీ బాతాఖాని. నేను కూడా మా ఇలాకా లో బూచమ్మనే…
  ” అర్రే బాగానే ఉన్నావా, ఇసారి కనిపించకపోతే మేమందరం పాపం నీ గురించే మాట్లాడుకొన్నాం” అని ఓ పరామర్శ చేశాడు.. ” కిస… కిస… కిస ….

  Like

 5. 2 days back nenu boochadu ayyanu…………..ento……..emi anaalo koda teleedu janaalaki…………

  Like

 6. ఉమా,

  నా బ్లాగ్గు నచ్చినందుకు చాలా సంతోషం. తమ్ముడుకు ఎప్పుడైనా వంకాయ కూర చేసిపెడతారా, లేక ఇదంతా లోకం కోసమేనా . మీరు అభిమానంతో వ్రాసే వ్యాఖ్యలు ఏ భాషలో ఐతేనేమిటి, భావం అర్ధం అయితే చాలు.!!!

  Like

 7. రాజశేఖర్,

  తిట్టుకోకుండా ఎలా పిలిచినా ఫర్వాలేదు. సొసైటీ లో మన ఇమేజ్ పాడవకుండా చూసుకోవడానికి, మనం పడే తిప్పలలో ఇదొక మచ్చుతునక. పాపం పిల్లలు కదా, ఏమీ ఎదురు చెప్పరు ( ఆ వయస్సు లో)

  Like

 8. రాధికా,

  అలాంటి పిల్లలు, ఇంట్లోనూ అలాగే ఉంటారు. ఆటవిడుపు కోసం బయట వాళ్ళ మీద వదులుతారు !! మనం, మన ఇల్లూ వాళ్ళకి కొంచెంసేపు ” పంచింగ్ బాగ్స్ ” అవుతాము.

  Like

 9. ..భలే రాసారు సార్/..“కొంతమందైతే వాళ్ళ పిల్లల్ని ఎటువంటి కంట్రోల్ లేకుండా మన కొంపమీద వదుల్తారు”…
  బాగా పేలాయి .. కాంప్లిమెంటరీ.. చక్కని టైమింగ్
  నిజంగా మంచిని గ్రహించే విధంగా చెప్పారు ..అభినందనలు ఫణిబాబు గారు

  Like

 10. భావనా, వినయ్,

  ఈ విషయం లో నేను మీ ఇద్దరికంటే అదృష్టవంతుడినే, ఇంకా బూచాడిని అవలేదు. డాక్టర్ తో సరిపెట్టేశారు. భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేము కదా. అన్ని రోజులూ మనవి కావు.
  ఓర్పు చూపించండి, మీరు కూడా ఒకరోజు ” డాక్టర్ ” అవుతారు !!..

  Like

 11. పిల్లల విషయాలు మీర్రాసినవి చుట్టూ చూస్తుంటా నేనైతే రోజూనూ! తల్లిదండ్రుల్ని ఫూల్ చేయని పిల్లలెవరో చెప్పండి. మా పాపకు ఆరేళ్ళు. బిస్కెట్లు ఇష్టపడదు ఎంత మంచివి తెచ్చినా సరే! కింద మా వాచ్ మన్ ఇంట్లో మారీ బిస్కెట్లు అడిగి మరీ తీసుకుని ఆవురావురుమని రెండ్రోజులుగా తిండి తినని దానిలాగా తింటుంటే కడుపు రగిలిపోయిందంటే నమ్మండి.

  Like

 12. కొలిసెట్టి,
  ధన్యవాదాలు.

  Like

 13. సుజాతా,

  కడుపు రగిలిపోవడం కంటే ఇంకో విషయమేమంటే, అలా మన పిల్లలు అవతలివాళ్ళ దగ్గర తింటూంటే, వాళ్ళు మనకేసి చూసే చూపులు మరీ అన్యాయంగా ఉంటాయి.అక్కడికి మనకి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియనట్లుగా. పైగా ఉచిత సలహాలు కూడా ఇస్తారు !!

  Like

 14. > మనం ఏదో గొప్పగా, ” మా వాడు బయట ఏమీ తాగడండి ” అన్నామో మన కొంప ముంచేయడమే తమ జన్మ హక్కులాగ, అదే తాగుతాడు/తుంది.ఇంట్లో మనం ఏమీ పెట్టకుండా మాడ్చేస్తున్నట్లుగా ఓ పోజు కూడా పెడుతారు

  so true…

  Like

 15. మీరు పిల్లల గురించి రాసినవి నేను చూసాను.కానీ మా నాలుగేళ్ళ అబ్బాయితో ఇంతవరకు ఇలాంటివి ఏమి ఎదురుకాలేదు. ఇప్పటివరకు ఎవరి ఇంటికి వెళ్ళినా అక్కడ తినడానికి ఇస్తే మా వాడు ఇది తినడు అది తినడు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. మీ అబ్బాయి తింటాడా అంటే మా అబ్బాయిని అడిగి వాడు ఇష్టపడితే పెట్టండి అని చెప్తాను. దీని వల్ల మా వాడు ఇంట్లో ఒకలాగ, బయట ఒకలాగ ఎప్పుడూ ప్రవర్తించలేదు తిండి విషయంలో.

  Like

 16. స్నేహ గారూ,

  మీరు చాలా అదృష్టవంతులు. మామూలుగా నూటికి తొంభై మంది కి నేను చెప్పిన లాంటి అనుభవమే ఎదురౌతుంది. మీరు ఆ మిగిలిన పది మందిలోని వారు.కిప్ ఇట్ అప్.

  Like

 17. paanipuri123,

  May be its not true in all cases, as Sneha mentioned above. There are always exceptions.

  Like

 18. చాలా అద్భుతంగా రాశారు గురువుగారూ! మా పిల్లలు కూడా అంతే. ఇంటిలో ఏమి పెట్టినా తినరు, కానీ ఇంటిలో ఏదైతే ససేమిరా వద్దంటారో అవన్నీ బయట వాళ్ళింట్లో ఆవురావురుమంటూ తింటారు. ఈ మధ్యనే ఒకరోజు మా ఆవిడ మా అమ్మాయిలిద్దరికీ ప్రొద్దున్నే కోడిగుడ్డు అట్లు (ఆమ్లెట్లు) వేస్తే ఇద్దరూ తినలేదు. వాళ్ళు వదిలేసినవి నేను తిని ఆఫీసుకి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం మా ఆవిడ ఫోను చేసింది నాకు…తను కోపంతో పొగలు సెగలు కక్కుతుందని నాకు ఫోన్లోనే అర్ధం అయిపోయింది. నేనేమైనా వెధవపని చేశానేమో, నా మీద చిఱ్ఱుబుఱ్ఱులాడుతోందేమోనని బిక్కుబిక్కుమంటుంటే మొత్తానికి విషయం ఏమిటో చెప్పింది. నేను ఆఫీసుకి వెళ్ళాకా పిల్లల్ని తీసుకుని మా స్నేహితుల ఇంటికి వెళ్ళిందట. మా స్నేహితుడి భార్య పిల్లల్ని అడిగిందట, “ఏమర్రా! ఆమ్లెట్లు తింటారా?” అని. మా ఆవిడ పెద్ద గొప్పగా చెప్పిందట, వాళ్ళు అసలు తినరు అని. కానీ పిల్లలు మాత్రం “అవును, ఆంటీ! ఆమ్లెట్లు కావాలి” అనడమే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న అరడజను గుడ్లు ఆవురావురుమంటూ లాగించేశారట. పాపం మా ఆవిడకి బుఱ్ఱ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదట! 😦

  నిజానికి మా అమ్మాయిలిద్దరూ పాపం చాలా మంచి వాళ్ళు, బుద్ధిమంతులు లెండి! ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా!

  కానీ మా చిన్నది మాత్రం ఇంట్లో పులి, వీధిలో పిల్లి. పిల్లి అంటే పిరికిదికాదు లెండి, కానీ ఇంట్లో నానా అల్లరి చేసి, బయటకి వెళ్ళినప్పుడు, స్కూల్లోను పరమ బుద్ధిమంతురాలయిపోతుంది. బయట అందరూ అంటూంటారు, “ఇలాంటి పిల్లల్ని ఒక వందమందినైనా కళ్ళుమూసుకుని పెంచవచ్చును, అని”. వాళ్ళను చూసి మా ఆవిడ మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ అనుకుంటుంది, “ఒక్కసారి మాఇంటికి వచ్చి ఏ కర్టెన్ వెనకాలో ఒక రెండు గంటలు దాక్కుని దాని విశ్వరూపం చూసిన తర్వాత మళ్ళీ ఇదే మాట అనండి” అని!

  భవదీయుడు,
  అబ్బులు

  Like

 19. అబ్బులూ,

  చెప్పానుగా పిల్లలు,బయటకు వెళ్ళినప్పుడు మనమీద ఉన్న కసి అంతా తీర్చుకుంటారు !! ఇంట్లో ఎప్పుడూ తిననవికూడా, మనల్ని ఏడిపించడానికి ఆబగా తినేస్తారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: