బాతాఖానీ ఖబుర్లు–29


                              

                                    1983 లో వరణ్గావ్ ఫాక్టరి కి వెళ్ళిన ముందరి కొద్ది రోజులూ కొత్తగా ఉండేది. నెను వచ్చింది కెమికల్ ఫాక్టరీ లో 20 సంవత్సరాలు పనిచెసి. ఇదేమో ఫిల్లింగ్ ఫాక్టరీ, అమ్యునిషన్ తయారుచేసేది. ఇక్కడ సేఫ్టీ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించలెదు. ఏమిటో ఏమీ అవదూ అనే భావం ఎక్కువ ఇక్కడి ఫాక్టరీ లో. మేము వచ్చిన ఫాక్టరీ లో ఆక్సిడెంట్లు దగ్గరగా చూశాము, అందువలన సేఫ్టీ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పినా, ఏదో వెర్రివాడిలా కనిపించేవాడిని.

                                                       

           నెను పూనా లో ఉండగా విశాఖపట్నం లో ఉన్న    నేవల్ డాక్ యార్డ్ లో సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ కి అప్లై చేశాను. ఇంటర్వ్యూ కి వెళ్ళాను, చాలా బాగా చేశాను. కానీ పోస్ట్ గ్రాడ్యుఏషన్ లేకపోవడం వల్ల వాళ్ళు నాకు ఆ ఉద్యోగం ఇవ్వలేదు.. అప్పుడు మాత్రం చాలా బాధ పడ్డాను– డిగ్రీ తరువాత పైకి చదవనందుకు !!

                                   

                             మా బాబు ని ఫాక్టరీ వాళ్ళ స్కూల్లోనే వేశాము. అమ్మాయికి కేంద్రీయ విద్యాలయా లో చేర్చాము. ఆ ఏడాది స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం నాడు స్కూల్లో ఏదో స్పీచ్ ఇవ్వమన్నారు, మా అమ్మాయి పేరు ఇచ్చింది. సరే అని నేను నాకు తెలిసినది రాసిచ్చాను.  రెండు మూడు సార్లు

ప్రాక్టీస్ చేసి మర్నాడు మీటింగ్ లో అదరగొట్టేసింది. దానితో మా జనరల్ మేనేజర్ గారి దృష్టిలో పడింది, తనకి పూనా లో 5 సంవత్సరాలు కాన్వెంట్ లో చదవడం వలనైతేమి, స్వతహాగా ఉన్న తెలివితేటలైతేనేమి భగవంతుని దయ తో  ఆరోజు తరువాత అక్కడ చదివిన 9 సంవత్సరాలూ స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే. దాని ధర్మమా అని  నేనెవరో ఆ కాలని లో ఉన్నవాళ్ళందరికీ తెలిసింది– ఫలానా అమ్మాయి పెరెంట్స్ వీళ్ళూ అని– ఇంతకంటే జీవితం లో గొప్ప గౌరవం ఏం కావాలండీ.అన్నిరకాల పాటలు, రెసిటేషన్, ఇలక్యూషన్, ఒకటేమిటి అన్నింట్లోనూ  తనే ఫస్ట్..

                                          

                    1984 అక్టోబర్ కి  ఆప్రాంతం లో టి.వీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. నేను వదులుతానా, 31 సాయంత్రానికి ఇంటికి టి.వి వచ్చేటట్లుగా కొట్టువాడికి డబ్బులు ఇచ్చి వచ్చాను. మీకు గుర్తుండేఉంటుంది. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ  హత్య చేయబడింది, పైగా ఆరోజునుంచి 3 రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారాలూ. ఏం తిప్పలు పడ్డామండీ ఆ 3 రోజులూ. మొత్తం ఎస్టేట్ కి రెండంటే రెండే టి.వీ లూ, అందరికీ చూడాలనుంటుంది, చివరికి క్యూ లో జనాలని చూడ్డానికి వదలవలిసి వచ్చింది. ఎవరిని వదలకపోతే వాళ్ళకి కోపం, ఏమైతేనే టి.వీ మహాత్మ్యం వలన చాలా పాప్యులర్ అయిపొయాము . ఆ తరువాత రెండు నెలలో మొత్తం కాలనీలో ప్రతీ ఇంటికీ ఓ టి.వీ. వచ్చింది.

                                                 

             1985 లో  మా అబ్బాయి ని కూడా  సెంట్రల్ స్కూల్లో వేశాము. ఓ ఏడాది బాగానే ఉందండి. కానీ ఎక్కడో ఏదో  ఆడ్ గా అనిపించేది, సంగతేమంటే మా అబ్బాయి ఏక్ దం హిందీ, తెలుగు తప్ప ఇంకో భాష మాట్లాడేవాడు కాదు. ధన్యవాద్, శుభ్ రాత్రీ,నమస్తే వగైరా వగైరా. ఎలారా భగవంతుడా వీడిచేత ఇంగ్లీష్ మాట్లాడించడం అని నెనూ, మా ఇంటావిడా ఆలోచించాము.మన చిరంజీవి కి దేనిమీద ఎక్కువ ఆసక్తీ అని. చూస్తే వాడికి ఆటలమీద చాలా ఇంటరెస్ట్. సరేఅని, ప్రతీ వారం ” స్పోర్ట్ స్టార్ ” తెప్పించడం మొదలుపెట్టాము. అంతే హిందీ చంపక్ లూ, లోట్పోట్ లూ చూడ్డం మానెశాడు. ఆ తరువాత అంచెలంచెలుగా వాడి ఇంగ్లీష్ జ్ఞానం పెరిగిపోయింది. ఈవేల్టి రోజున వాడు మాట్లాడే ఇంగ్లీష్, మాకు గర్వ కారణం . అందుకనే చెప్తాను మా ఇద్దరి పిల్లల వల్లా మేమెవరో అందరికీ తెలిసింది. ఆ విషయం లో భగవంతునికి జీవితాంతం కృతజ్ఞుడినే. అందుకే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ జన్మలో ఏం పుణ్యం చేసికొన్నానో ఇలాంటి భార్యా, పిల్లలూ నాకు దక్కారు !!

                                          

                  మాకు అక్కడ కాలనీ లో ఓ కోపరేటివ్ సొసైటీ ఉండేది. మా జనరల్ మేనేజర్ గారు నన్ను దానికి ట్రెజరర్ గా వేశారు. ప్రతీ రెండేళ్ళకీ ముగ్గురు స్టాఫ్, ఒక అఫీసర్ ని నామినేట్ చేస్తారు.  ఈ  అకౌంటింగ్ వ్యవహారాలు, నాకేమీ తెలియదు. అలా అని పెద్దాయనకు ఎదురు చెప్పే ధైర్యం లేదు. చూద్దాం, ఓ నెలరోజులు నేర్చుకుంటే అదే వస్తుంది, అదేం బ్రహ్మవిద్యా అని  చేరిపోయాను. మొదట్లో అంత డబ్బు చూసేడప్పడికి కొంచెం ఖంగారు వచ్చెది. ఎవదిని నమ్మాలో తెలియదు, అక్కద మాకు రేషన్, గాస్, గ్రోసరీ లు ఉండేవి.. వీటన్నింటి అమ్మం ద్వారా వచ్చిన డబ్బు, ప్రతీ రోజూ రాత్రి 8.00 గంటలకి నా దగ్గర డిపాజిట్ చేసేవారు. మేము ప్రతీ రోజూ ఫాక్టరీకి వెళ్ళవలిన అవసరం ఉండేది కాదు. నెలకొసారి జీతానికే వెళ్ళడం.అక్కడ పనిచెసి కొత్త కొత్త విషయాలు నెర్చుకొన్నాను.

2 Responses

 1. >> ఈ జన్మలో ఏం పుణ్యం చేసికొన్నానో ఇలాంటి భార్యా, పిల్లలూ నాకు దక్కారు !!
  ====
  ఈ లైన్ చూసి చాలా ఆనందం కలిగింది గురువు గారూ.

  మీ మొదటి పోస్ట్ నుంచీ చదువుతూ ఈ పోస్ట్ కి చేరుకున్నాక మీరు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది – కామెంట్లు కొంచం ప్రేరణ కలిగిస్తాయని. 🙂

  చెప్పాను కద గురువు గారూ ఆఫీస్ లో కొంచం పనిలేకపోతే మీ బ్లాగ్ చదువుతా అని. ఈ రోజు ఎక్కువ పని లేదు. సో… మొదటి పోస్ట్ నుంచీ చదవటం మొదలెట్టా.
  ఇక్కడిదాకా జర్నీ చాలా బాగుంది.

  చందు

  Like

 2. చందూ,

  ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం నేను వ్రాసిన టపా చదవడమూ, పైగా స్పందించడమూ చూస్తే, నామీదా, నా వ్రాతలమీదా ఎంత అభిమానం ఉందో తెలిసింది. అందుకే ఈమధ్య వ్రాసిన టపాలో వ్రాశాను–పాఠకుల స్పందన ఓ టానిక్కులాటిదీ అని. ఆరోజుల్లో వ్యాఖ్యలు చదివే, ఇప్పటికి ఎనిమిది వందలకు పైగా టపాలు వ్రాయకలిగాను. ..Thanks a lot.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: