బాతాఖానీ –తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు


                                                                    

       క్రిందటిసారి ఖబుర్లలో చెప్పాను కదండీ, మా ఇంటావిడ తన ” వెయిట్ రెడ్యూసింగ్ అభియాన్” లో నన్ను చాలా తిప్పలు పెట్టేస్తోంది. ఇంటినిండా క్యారెట్లూ, బీట్రూట్లూ, మొలకెత్తిన పెసలూ, ఇవేకాకుండా ఈ మధ్యన “ఓ ట్స్ ” ఒకటి.  వాట్లతో ఉప్మా చేస్తుంది, ఇదేమీటంటే ” ఆరోగ్యానికి చాలా మంచిది ” అని ఓ డైలాగ్గూ . ఏదొ ఆవకాయ రోజులు కదా అని ఏమైనా మనసు మార్చుకొని మామిడి కాయలు తెమ్మంటుందేమోనని రోజూ, ” నేను బజారు కి వెళ్తున్నానూ ఏమనా కావాలా ” అంటే , ” క్యారెట్ ఒక్కటే ఉంది,దాంతో పాటు కీర దోసకాయ తీసుకురావడం మర్చిపోకండి” అంటుందే కానీ మామిడి కాయల సంగతి ఎత్తదే . ఈ మధ్యన మా మరదలు కొత్తావకాయ, మాగాయ ఓ బాటిల్ లో పెట్టి ” పోనీ బావగారు వేసికొంటారు ” అంటూ, మాకిచ్చింది. ఇంక రోజూ, పొద్దున్నా సాయంత్రం ఈ రెండింటితోటీ లాగించేస్తున్నాను. వాళ్ళు వచ్చి  ” మా ఊరగాయలు ఎలా ఉన్నాయి ” అని అడగ్గానే ” బ్రహ్మాండంగా ఉన్నాయి ” అనేశాను. ఇలా అనేటప్పడికి మా ఇంటావిడలో  రావల్సిన మార్పు వచ్చేసింది, ఈ రెండు బాటిల్స్ లోదీ అవగానే ఈయన ఎవరింటికో వెళ్ళేసి తన బాధలూ వెళ్ళబోసి మళ్ళీ ఓ రెండు బాటిల్స్ తెచ్చేసుకొంటాడూ అవటా అనుకొని , ఈసారి బయటకు వెళ్ళినప్పుడు ఓ 20 కాయలు తెండి, ఉప్పులోవేస్తాను, అది మాగాయ కి, పప్పులోకి ఉపయోగిస్తుందీ అని మొత్తానికి పర్మిషన్ ఇచ్చేసిందండి.  ఆ 20 కాయలూ సైజ్ ఎలా ఉండాలో చెప్పలేదు,నేను  నా డెసిషన్ తీసికొని ఓ పాతిక కాయలు తెచ్చేశాను. అందులో ఓ 20 కాయలు తరిగి ఉప్పులోవేసింది. ఓ అయిదు కాయలు పక్కనేఉంచి, ” బజారు కెళ్ళి ఓ అర కిలో ఆవకాయ పిండి,ఒ కిలో పప్పునూనే తీసుకురండి అని ఓ వరం పారేసింది. పరిగెత్తుకొని బజారెళ్ళి ఆ రెండూ తీసికొచ్చేశాను. ఆ విధంగా మా ఇంట్లోకూడా ఓ బాటిల్ తో కొత్తావకాయ వచ్చేసింది. ఇప్పుడే చెప్తోంది ” ఆ ఉప్పులో వేసిన ముక్కలు మీకోసం కాదూ, పూణే లో మా పిల్లలికిట”. పోన్లెండి ఆవకాయైనా పెట్టింది, ఒకటి మాత్రం డిసైడ్ చేసుకొన్నాను, మాఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, ఈ ఆవకాయ మాత్రం వెయ్యనీయను ( దీన్ని  నేను ఏడాది పాటు అపురూపరంగా వేసికోవాలి ), వాళ్ళకి కర్రీపాయింట్ నుంచి తెచ్చిన పచ్చళ్ళు మాత్రమే!!

                                                                 

     ఏమిటో అనుకొంటాము గానీ ఈ  ఈతిబాధలు అన్నీ మనం చేతులారా తెచ్చుకొన్నవే. గుర్తుండేఉంటుంది స్నాతకం టైము లో కాశీ ప్రయాణం అని ఉంటుంది, అప్పుడు పెళ్ళికొడుకు పాంకోళ్ళూ, ఓ గొడుగూ అవీ పట్టుకొని కాశీ వెళ్ళిపోతానూ అంటాడు, అలా వెళ్ళిపోయినా బాగుండేది. ఇంతలో మనకి అవబోయే బావమరిది వచ్చి ” వద్దు బావా మా అక్కయ్యనిచ్చి పెళ్ళి చేస్తామూ ” అంటాడు. ఆ టైము లో మనం బుట్టలో పడిపోతాము. ఏదో బట్టలూ అవీ పెట్టి మనని కన్ఫ్యూజ్ చేసేసి ఇలా సెటిల్ అయిపోతాము. ” వుయ్ హాడ్ అవర్ చాయిస్” ఎవర్నీ ఏమీ అనడానికి లేదు.

 

                                                           

     ” ఏ నాటి నోము ఫలమో  ఏ దాన బలమో ”  అంటూ భైరవి రాగం లో త్యాగరాజ కీర్తన పాడుకొంటూ లాగించేయడమే !!

Advertisements

3 Responses

 1. మరే… చేసుకున్నవారికి చేసుకున్నంత మహానుభావా.. ఎందుకీ తిప్పలు.. మీరే ఆవకాయ పెట్టేసుకుంటే పోలా.. ఆవిడ కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు మీరు వంటింట్లో ఆవకాయ పెట్టేసుకోండి.. సింపుల్….

  మీ ఆవిడ మీద చాడీలు చెప్పడానికి మీకు భలే చాన్స్ దొరికింది కదా.. కానివ్వండి. ఎన్ని రోజులో ఈ సంబడం. :)))

  Like

 2. జ్యోతి గారూ,

  ఉన్నది ఉన్నట్లుగా చెప్తే చాడీలంటారు. మంచికి రోజులు కావండీ.

  Like

 3. అవునండి, నిజమే ఇది కలికాలం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: