బాతాఖాని–తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు


                      

     నేను, ప్రతి రోజూ నా ఖబుర్లే రాస్తున్నాను కాబట్టి ఏదో వారం లో ఒక రోజు మా ఇంటావిడ తో కలిపి రాయచ్చు కదా అని పెద్ద గొప్పగా ఈ కాలమ్ కి

లక్ష్మిఫణి ఖబుర్లు అని పేరు పెట్టినంత సేపు లేదు, ఆవిడ స్వంతంగా ఒక బ్లాగ్ ప్రారంభించేసింది !! ఆ రోజున ఈ–తెలుగు మీద దూర్ దర్సన్ లో ప్రసారమైన కార్యక్రమం చూసి తను కూడా అర్జెంట్ గా తెలుగు టైపింగ్ నేర్చేసుకొని రాయడం మొదలుపెట్టేసింది. ఊరికే పేరు పెట్టానుగా అని అదే కంటిన్యు చేస్తున్నాను. ఈ మధ్యన ఏమౌతోందంటే ఆవిడ కంప్యూటర్ ని వదలడం లేదు. నాకు ” భ క్తి ” టీ.వీ. లో గరికపాటి నరసింహారావు గారి ” మహా భారతం” కార్యక్రమం అయిన తరువాత “స్లాట్ ” ( అంటే రాత్రి  11.30 తరువాత అన్న మాట) దొరుకుతోంది !!. భోజనానికి లేవదు, సీట్ వదిలేస్తే నేను వచ్చేసి కూర్చుంటానేమో అని భయం.ఇదివరకే బాగుండేదండీ, ఏమి కావల్సినా నన్ను అడిగేది, ఇప్పుడో తనే సెర్చ్ చేసేసుకుంటోంది. పైగా  ” ఈ విష యం విన్నారా  ” అంటూ మొదలెడుతుంది. వంట లోకి నాకేమైనా కావల్సి ఉంటే ” తెలుగుదనం.కాం ” లో చూసి చెప్పండి  అది చేసిపెడతాను అంటూంది.

                    

    ఇది కాదు పధ్ధతీ అని ఇవాళ మా పక్కనే ఉన్న ” కుమారీ ” టాకీస్ లో  ” ఆకాశమంత ” సినిమా కి వెళ్ళాము. ఎంత అద్భుతంగా తీశాడండీ ఆ సినిమా!! ఇందులో మేము ఆనందించిన విషయమేమిటంటే అదేదో మా ఇంట్లో జరిగిన కథ లాగానే ఉంది. సినిమా లో లాగ మేమేదో ఎస్టేట్ ఓనర్స్ మి మాత్రం కాదు.

సినిమాలో లా కాకుండా మాకు ఇద్దరు పిల్లలు–ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరిదీ ప్రెమ వివాహాలే. మా అల్లుడు కూడా పంజాబీ (సర్దార్ కాదు). మా అనుమతితో జరిగిన పెళ్ళిళ్ళే. ఆ కారణాల వల్ల మాకూ ఆ సినిమా బలేగా నచ్చేసింది.

                    ఒక్కటె నచ్చలేదు– సినిమా ఇంటర్వెల్ లో అదేదో పిచ్చి సినిమా ట్రైలర్ వేసి ఈ సినిమా ఆనందం పాడిచేశాడు. అందువలన ఆ సినిమా సి.డి. రాగానే కొనుక్కొని మళ్ళీ మళ్ళీ చూస్తాను.

Advertisements

16 Responses

 1. ముదితల్ నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పించినన్ అన్నాడొక కవి గారు.
  ముదితల్ నేర్చిన పిమ్మట మొట్టికాయల్ తినని పురుషుండు గలడె అని మనం సవరించుకోవాలి 🙂

  Like

 2. post is nice

  kothapali guruvugaarU
  అంతే సారు అంతే

  Like

 3. మొన్న స్వాతి లో కోతి-కొమ్మచ్చి కి మీ కామెంట్లని ఇచ్చారు కదూ… అయితే వచ్చేవారం మీ శ్రీమతి గారివి వస్తాయేమో!!!

  Like

 4. mi pillalu chala adrustavantulu. yendukante valla love marriage ni oppukuni meeru chesaru kada.mi birthday yeppudo cheptara?

  Like

 5. ఇప్పుడే సూర్యలక్ష్మి గారి బ్లాగు చూశాను.
  మీరు అప్పటిలో అన్నట్టు, స్లాటులు వేసుకోవలసిన అవసరం రానేవచ్చిందన్న మట. 🙂
  राकेश्वर

  Like

 6. హన్నా!! అప్పుడే చాడీలు మొదలెట్టారా. అంటే ఆడవాళ్లకు నేర్పించి తప్పు చేసామంటున్నారా. మీకు తోడుగా కొత్తపాళీగారు, బాబాగారు. సరిపోయింది.
  ఒక ఉపాయం చెప్పనా!!! మీరు మరో కంప్యూటర్ కొనుక్కోండి, ఇప్పుడు కనీసం ఆ టైమ్ కైనా దొరుకుతుంది. భవిష్యత్తులో ఆ చుట్టుపక్కలకి వెళ్లలేరు. ఈ బాధపడలేకే మావారు నాకు కొత్త కంప్యూటర్ కొనిచ్చి, నాసిస్టమ్ ముట్టుకోవద్దు అని ఆర్డర్ వేసారు. :).. అదన్నమాట సంగతి..

  Like

 7. కొత్తపాళీ గారు, బొల్లోజుబాబా గారు,

  మనం మనం ఒకటి కాబట్టి ఎదో అభిమానం కొద్దీ ఉన్న విషయం వ్రాశారు !!

  Like

 8. మేధా గారూ,

  ఇప్పుడిప్పుడే మొదలెట్టింది కదండీ, కొంచెం టైమ్ పడుతుంది.

  Like

 9. మధూ,

  వాళ్ళు కాదమ్మా అదృష్టవంతులు. నేను. నా బాతాఖానీ ఖబుర్లు ముందు ముందు చదివితే నీకే అర్ధం అవుతుంది.
  I am proud of my wife and children.

  నేను చేసికొన్న పుణ్యం ఏమిటంటే బాపూ, రమణ గార్ల జోడీ లో బాపూ గారి తో జన్మ దినం పంచుకోవడం !!

  Like

 10. రాకేష్,

  క్రిందటి సారి ఉన్నట్లుగా ” అతిథి సత్కారాలు” ఏమీ ఉండవు ఈ సారి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆవిడ తన లోకం లో ఉంటుంది, నాకేమో ఏమీ తెలియదు. నీకు కావల్సినవి నీవే తీసుకోవాలి !!

  Like

 11. జ్యోతి గారూ,

  మీ సలహా వినడానికి బాగానే ఉంది.అమ్మా, ఇప్పుడైతే ఒకే కంప్యుటర్ కాబట్టి, రోజులో ఎంతో కొంత సేపైనా నాకు అది ఇచ్చి, ఎదో వండి పారేస్తూంది. ఆవిడకు విడిగా కంప్యుటర్ ఇస్తే నేను ఏ కర్రీ పాయింట్ నో నమ్ముకోవాలి !!

  Like

 12. “ఏ కర్రీ పాయింట్ నో నమ్ముకోవాలి !!”…haa haa..haa..

  Like

 13. గిరిష్ కే, రాధిక గారు
  Thank you very much.

  Like

 14. awesome andi!! ha ha ha:-)

  Like

 15. మారుతీ గారు
  Thanks a lot.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: