బాతాఖానీ ఖబుర్లు —-9


                                  

    బి.ఎస్.సి ఎలాగోలాగ సెకండ్ యియర్ పాస్ అయ్యాను. ఆ రోజుల్లో మా నాన్న గారికి ఎమ్.ఎల్,సి కి పోటీ చేద్దామని ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.  నా ఉద్దేశ్యం లో మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి వాటి జోలికి పోవడం అంత ఆరోగ్యకరం కాదు. ముఖస్తుతి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అరచేతిలో కైలాసం చూపించేస్తారు. మనం అది అంతా నిజం అనుకొని ఆ మత్తు లోకి వెళ్ళిపోతాము. ముందుగా ఐయినవిల్లి శ్రీ గణేశుడి పూజ చేయించి పాంఫ్లెట్లు అచ్చేయించి, హడావిడి అంతా మొదలుపెట్టారు. ఈ గొడవలలో పడి నా చదువు గురించి పెద్ద పట్టించుకొనేవారు కాదు. అదే కాకుండా నాకు చదువుకోడానికి కావలిసిన సదుపాయాలన్నీ సమకూర్చేరు. నాకు విడిగా ఒక రూమ్ ( మా ఇంట్లో మొత్తం  16 రూమ్ లు ఉండేవి) . చదువుతున్నాననే అందరి నమ్మకమూనూ.

ఇంట్లో అందరిదీ ఎలక్షన్ల ఖబుర్లే. వీడెవడో ఇన్ని వోట్లు చూసుకొంటాడూ, వాడెవడో ఇన్నీ అంటూ  రోజూ ఇవే విషయాల మీద చర్చలే.

                                

     నేను చెప్పానుగా నాకు చదువు మీదకంటే మిగిలిన విషయాలమీద ఆసక్తి ఎక్కువ అయ్యింది. ఎప్పుడు చూసినా క్రికెట్ కామెంటరీలూ, సినిమాలూ, పత్రికలూ ( ఇవేమైనా తిండి పెడతాయా ? ). ప్రతీ రోజూ గుడికి వెళ్ళడం, శనివారం అయితే మోబర్లీపేట లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడమూ ఎప్పుడూ మానలేదు. అయినా మనం చదవకుండా దేముడు మీద భారం వేస్తే ఎలాగండీ ?

                              

       ఆ రోజుల్లో సినిమాల లో  ఎన్టీవోడూ, నాగ్గాడూ హీరోలు. కాలేజీ లో రెండు పార్టిలు. మాది నాగ్గాడి పార్టీ. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు– కొల్లి సుబ్రహ్మణ్యం అని వాడు ఎన్టీవోడి పిచ్చ అభిమాని. వాళ్ళ తమ్ముడు కృష్ణశాస్త్రి  మా పార్టీ.  ఇదే కాకుండా మా కాలేజ్ లో మంచి మంచి అమ్మాయిలు కూడా ఉండేవారు. ఎవరినో ఒకరిని అభిమానించడమూ, రోజూ ఆ గ్రూప్ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లో కటకటాలలొంచి వెయిట్ చేసి, సరిగ్గాఇంట్లోంచి బయలుదేరి వాళ్ళ ముందర గా పెద్ద పోజ్ కొట్టుకొంటూ నడవడమూ( ఎంతైనా డిగ్రీ ఫైనల్ యియర్ వాళ్ళం కదా). గట్టిగా ఆ అమ్మాయిల తో కళ్ళెత్తి మాట్లాడేధైర్యం కూడా ఉండేది కాదు. ఉత్తిత్తినే మనసులో ఇష్టపడడం అన్నమాట !! ఎంతైనా వయస్సు అలాంటిది కదండీ !!  ఇన్నిన్ని వ్యవహారాలలో మునిగితే చదువు ఎలా అబ్బుతుందీ ?

                                 

    ఇంకో విషయమండోయ్  ఆ రోజుల్లో ఫైనల్ యియర్ లో ఓ కొత్త ” జాడ్యం” ప్రవేసించింది– పరిక్ష (మంచి ) మార్కులతో పాస్ అవుతామని ధైర్యం లేని వాళ్ళు ఆ ఏడాది ” విత్ డ్రా ” చేసేసికోవడం, మళ్ళీ సెప్టెంబర్ లో వెళ్ళడం. మా కాలజీ లో ఆ ముందటేడాది కొంత మంది ” బ్రిలియంట్” విద్యార్దులు అలా చేసి నిజంగా సెప్టెంబర్ లో “ఫస్ట్ క్లాసులు” తెచ్చుకొన్నారు. లెక్చరర్లూ దీనిని సమర్ధించేవారు. అందువలన అదో మంచి ఫాషన్ అయింది.  ఈ పధ్ధతేదో బావుందనుకొన్నాను. ఎలాగూ నాకు ఏమీ అర్ధం అవడం లేదు. ఎలక్షన్ల హడావిడి వలన నన్ను అడిగే వాళ్ళూ లేరు. పరిస్థితులు కూడా అనుకూలించాయి. ఒక సారి ఇలా నిశ్చయించుకొన్న తరువాత  పుస్తకాలు అన్నీ నీట్ గా  అలమార్లో పెట్టేసాను. పరీక్ష కి వెళ్ళడమూ, 90 నిమిషాలలో బయటకు వచ్చేయడమూ, ఎవరైనా అడిగితే

” విత్ డ్రా ” అయ్యేనని పోజు కొట్టడమూ. మా అమ్మ గారు అడిగితే అదే సమాధానం చెప్పాను. సెప్టెంబర్ లో వెళ్ళి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవచ్చు అని కోసేసాను. పాపం ఆవిడ కూడా నమ్మేసింది. పరీక్ష మానేసిన తరువాత ముందరగా మా నాన్నగారు గోదావరికి అవతలే ఉన్నారని కన్ ఫర్మ్ చేసికొని ఆరోజు సెకండ్ షో సినిమా ” జిస్ దేస్ మే గంగా బహతీహై ” సినిమాకి చెక్కేశాము.  పొద్దుటే లేచేసరికి ఇంకేముందీ, మా నాన్నగారు రాత్రే వచ్చారుట, రాగానే నేను చేసిన ఘనకార్యం మా అమ్మ గారు చెప్పేశారు. ఆరోజు తగిలాయండీ చివాట్లూ,జీవితం మీద విరక్తి వచ్చేసింది. నా మాట మీద ఎవరికీ నమ్మకం లేదే. అక్షింతలు వేయడం  అయిన తరువాత ఇంక వార్నింగ్ ఇచ్చేశారు . బయటకు వెళ్తే కాళ్ళు విరగ్గొడతామని ( కాలేజీ లో డిగ్రీ పుచ్చుకోవడానికి సిద్ధం గా ఉన్న పిల్లాడితో ఇలాగేనా ఉండేది?)

                                

     ఏమైతేనే సెప్టంబర్ వచ్చిందండీ. ఏది చదివినా అంతా వచ్చేసినట్లుండేది. పరిక్ష హాల్ లోకి వెళ్ళేటప్పడికి ఏమీ గుర్తొచ్చేదికాదు. అదేం ఖర్మమో!! ప్రాక్టికల్స్ కి ఆరోజుల్లో బయటనుంచి ఎక్జామినర్స్ వచ్చేవారు. నా అదృష్టం కొద్దీ ఫిజిక్స్, కెమిస్ట్రీ లకి మా నాన్నగారి శిష్యులే వచ్చారు. వాళ్ళకి నా నంబర్ ఇచ్చి ” కొంచెం వీడిని చూడండి థీరీ బాగానే రాశాడు( అలాగని నేను చెప్పాను!!) ప్రాక్టికల్స్ కొంచెం సహాయం చేసేరంటే క్లాస్ వస్తుంది ” ఈయన మాట కాదనలేక పాపం వాళ్ళు చేసేదేమిటో చేశారు, అంటే ఫుల్ మార్కులు ఈయడం అన్న మాట. ఇంతలా అందరూ సాయం పట్టినా చివరికి చావు తప్పి కన్ను లొట్టోయినట్లు గా థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాననిపించాను. అప్పడికి నా వయస్సు అక్షరాలా 17 సంవత్సరాల 7 నెలలు. చెప్పేనుగా ఆరోజుల్లో  ” ఏజ్ రెస్ట్రిక్షన్లు ” ఉండేవి కాదని.

Advertisements

9 Responses

 1. అమ్మో! మీరు సామాన్యులు కాదు.
  నేను ఎంతో బుద్దిగా చదువుకున్నాను. ఒక్క ఫౌండేషన్ కోర్సె క్లాసులు మాత్రం బంకు కొట్టాను. ఊరికనే కాదు. ఆ మేడం టోన్ వింటే తలనొప్పి వచ్చేసేది. సరదాగా చెప్పట్లేదు. ఒకరోజు క్లాసులో ఏడ్చేసాను కూడా. మా ఫ్రెండ్సు నా అటెండన్స్ మేనేజ్ చేస్తామని చెప్పారు నా బాధ చూడలేక.

  Like

 2. నేనూ అంతే. మాకు ఇంజినీరింగ్ లో ఒక సోషల్ స్టడీస్ అని ఉండేది. రెండు సార్లు డింకీ కొట్టి మూడోసారి పాసయ్యాను. దానికొచ్చే లావుపాటి మేడం ఎంత దరిద్రపు @#$%# చెప్పక్కర్లేదు. దానికేమీ రాదు. నేను క్లాసులో పబ్లిగ్గా పడుకునేవాడిని. ఇప్పుడు కానీ అది కనిపించిందా, చెప్పుతీసుక్కొట్టి మొహం మీద ఉమ్మేస్తాను దానికి. ఆవిడంటే నాకంత కొపం ఇప్పటికీ!

  Like

 3. మా నాన్నగారు మూడ్ బాగున్నపుడు ఆరుబయట నవారు మంచం మీద పడుకుని చల్లని వేసవి సాయంత్రాలు ఇలాంటి పాత కబుర్లు చెప్తూ ఉండేవారు. మీ కబుర్లు వింటుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మీతో బాతాఖానీ చలా బాగుంది ఫణిబాబుగారూ!

  అన్నట్లు ఈ వారం స్వాతి వీక్లీ లో కోతికొమ్మచ్చి గురించి మీరు రాసిన ఉత్తరం ఆ సీరియలంత బాగుంది.

  Like

 4. భవానీ గారు,

  నేను రాసేవి బాగా చదువుకున్నవాళ్ళు చదివితే పాడై పోతారు. అందుకనే మా ఆవిడ ” అస్తమానూ మీ చిన్నప్పటి ఖబుర్లు చెప్పి పిల్లల్ని పాడు చేయకండీ ” అని చీవాట్లు వేశేది. అయినా సరే వాళ్ళకి ఎంత ఇష్టమో ఈ ఖ బుర్లుఅన్నీ. పాపం వాళ్ళు బాగా చదువుకొని పైకి వచ్చారు, అదింతా మాఇంటావిడ క్రెడిట్టే !!

  Like

 5. సామాన్యుడు గారూ,

  కూల్ కూల్ !! శాంతించండి.

  Like

 6. భలే పాసైపోయారండి డిగ్రీ.. హెడ్ మాస్టర్ గారి అబ్బాయిగా పుట్టడం ఎంత అదృష్టమో కదా… తదుపరి ఏమిటండి? పై చదువా, ఉద్యోగమా లేక వివాహమా?

  Like

 7. సుజాత గారు,

  మనం ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటుందండి. నాకు కూడా ఈ గొదావరి గాలి తగిలేటప్పడికి నా జ్ఞాపకాలు అక్షర రూపం దాల్చాయి.

  Like

 8. మురళీ గారూ,

  కొంచెం ఓపిక పట్టండీ. ఏమీ దాచుకోకుండా అన్నీ చెపుతాను.

  Like

 9. మురళి గారూ,

  హెడ్మాస్టారి అబ్బాయి గా పుట్టడం వలన అన్నీ మంచి గా ఉంటాయనుకోకండి. అందరి లాగా అల్లరి చేయడానికి వీలుండేది కాదు. ” ఇమేజ్ ” కాపాడుకోవాలిగా!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: