బాతాఖాని ఖబుర్లు –8


                                              

       మా అన్నయ్య గారు పడ్డ శ్రమకి నేను మంచి మార్కులతో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష పాస్ అయ్యాను. ఆయనకి ఎక్కడ సంతోషం అనిపించిందంటే నాకూ, మా చిన్నన్నయ్య గారికి ( ఆయన చాలా తెలివైనవారు) వచ్చినన్ని మార్కులు రావడం. ఎలాగైతేనే కాలేజీ లో చేరడానికి అర్హత సంపాదించానండీ !!  ఏదో పేధ్ధ పొజిషన్ వచ్చినట్లు అనుకోవడం. ఇంట్లో మనకి పాంట్లు అవీ కుట్టించారు. అప్పడిదాకా నిక్కర్లే !! కాలజీ లో చేరేడప్పటికి నా వయస్సు 14 సంవత్సరాలు. ( ఆ రోజుల్లో ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తే గొడవ ఉండేది కాదు).

    అప్పుడే నాకు కొంచెం సమస్య ( శారీరికంగా ) వచ్చింది. నాకు మోకాళ్ళ మీదా, చీలమండమీదా చిన్న చిన్న తెల్ల మచ్చలు కనిపించాయి ). వాటి సంగతి  చూసి మా డాక్టర్ గారు” ఏం పర్వాలేదు” అన్నారు. ఇంట్లో కూడా అంతగా పట్టించుకోలేదు.

కానీ అవే కొంతకాలానికి పెద్ద సమస్య అవుతుందని మా అమ్మ గారు, నాన్నగారు అనుకోలేదు. మా అమ్మమ్మగారైతే  ఏవో బావంచ గింజలు పొడి చేసి నీళ్ళతో తాగించడమూ, దానితో పేస్ట్ చేసి ఆ మచ్చల మీద రాయడమూ చేసేవారు. ఇది ఇలాగుండగా మా డాక్టర్ గారైతే ఆ స్పాట్ ల మీద ఏదో ఇంజెక్షన్ ఇచ్చి అల్ట్రా వైలెట్ లైట్ వేసేవారు. మొత్తానికి ఆడుతూ పాడుతూ ఉండవలసిన వయస్సు లో ఒక గులక రాయి పడింది. దీని వలన నాకు ఇతర సమస్యలు ఏమీ రాలేదు.కాని  అదొక ఫీలింగ్– మనకి ఎవరికీ రాకూడనిది ఎదో వచ్చిందీ అని.పాంట్ వేసికోవడం కంపల్సరీ అయిపోయింది( ఆ మచ్చలు ఎవరికైనా కనిపిస్తాయేమో నని). ఇదంతా ఎందుకు చెప్తున్నానంటె — ఆ రోజుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరితోనైనా షేర్ చేసికొంటే దాని పరిష్కారం ఉంటుందని ఆలోచించేవారు కాదు,దాచుకోవాలనే అనుకొనేవారు– దీని వలన నష్టాలే ఎక్కువ, ఈ సంగతి తెలిసేటప్పడికి చాలా  ఆలశ్యం అయి పోయింది.

                                                

     ఆ గొడవ ఒదిలేయండి, నా కాలేజీ జివితం బాగానే స్టార్ట్ అయ్యింది. ఉన్న సమస్య అల్లా ఏమిటంటే, అక్కడ ఉన్న లెక్చెరర్లు అంతా మా నాన్న గారికి తెల్సిన వారే. అదేదో గ్రూప్  ( ఎం. పీ.డబ్ల్యు.)  తీసికొన్నాను. దానికి నేనొక్కడినే ఉండే వాడిని. కాలేజీ లో ఏమైనా వెధవ్వేషాలు వేస్తే ఆ సాయంత్రానికి ఇంట్లో తెలిసిపోయేది.ఇదొక్కటే బాగుండలేదు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ కామెంటరీలు వినడం ఒక కార్యక్రమం. సినిమా లైతే అస్సలు అడగఖర్లేదు. ఆ రోజుల్లో హిందీ సినిమాలైతే రిలీజ్ అయిన 4 నెలలకి వచ్చేవి.శంకర్ జైకిషన్ పాటలంటే విపరీతమైన ఇష్టం. అందుకని వాళ్ళు మ్యూజిక్ ఇచ్చిన ప్రతీ సినిమా చూడడమే,ఆ సినిమాలకి ఒక ట్రాన్స్లేటర్  ( శ్రీ వేమూరి రామకృష్ణ గారు) ఉండేవారు. ఆయన అన్ని సినిమాలకీ  ” అది బొంబాయి మహానగరం” అని మొదలెట్టేవారు. అన్నికథలూ అక్కడే జరుగుతాయనుకొనేవాళ్ళం !! ఆయనకి ఇంత హిందీ ఎలా వస్తూందా అని ఒక ఆరాధన !!

                                                 

     ఎలాగైతేనే పి.యూ.సీ పూర్తిచేసి ఇంక డిగ్రీ లోకి వచ్చామండీ ( ఇప్పటి దాకా బుర్రకెక్కినదేమీ లేదు ). ఎమ్.పి.సి. గ్రూప్ తీసికోమన్నారు, ( ఏదొ పెద్ద ఇంజనీర్ చేశేద్దామని ), ఈ మధ్యలో బలవంతం ఛేసి  ఐ. ఐ.టి పరీక్ష కూడా రాయించేరు,  అవి అన్నీ కూడా లాటిన్, గ్రీక్ లా ఉండేవి. అందువలన అలాంటి కోర్స్ లలో చేరే అవకాశం రాలేదు. ఫస్ట్ ఇయర్ లో పరీక్ష ఉండేదికాదు. సెకండ్ ఇయర్లొ లాంగ్వేజెస్, జనరల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉండేది.అవి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టులు. శ్రమ లేకుండా పాస్ అయ్యాను.

                                                  

    నేను ఎదో బాగుపడతానని శ్రీ రామకోటేశ్వర్రావు గారి దగ్గర ట్యూషనోటి !! అదీ రాత్రి  తొమ్మిదినుంచి పదకొండు దాకా. ఈ మధ్య లో మా కజిన్ ఒకడు వచ్చాడు కాలేజీ లో చేరడానికి. వాడు చాలా తెలివైన వాడు. తను మా అక్కయ్య గారింట్లో ఉండేవాడు, ( ఆవిడ మాకు మాథ్స్ చెప్పేవారు)

ఒకసారి ఎవో యూనిట్ టెస్ట్ అయితే వీడు ఆ ప్రశ్నలన్నీ ముందరే నాకు చెప్పేశాడు.. ప్రశ్నలు తెలిస్తే లాభం ఏమిటీ, ఆన్సర్లు కూడా చెప్పమన్నాను. అవి ఎలాగో బట్టీ పట్టేసి, మర్నాడు రాశేసాను. ఇంకేముందీ నాకేదో లెఖ్ఖలు చాలా బాగా వస్తాయని ఓ పెద్ద నమ్మకం వచ్చేసింది అందరికీ ను. నిజం చెప్పాలంటే నాకు ఆ మూడు సబ్జెక్టులూ ఏది రాదు. అస్తమానూ  క్రికెట్ కామెంట్రీలూ, సినిమాలూ ఐతే చదువు ఎక్కడినుంచి వస్తుందండీ? ఫిజిక్స్  ప్రాక్టికల్స్ లో అయితే యాక్సిలరేషన్ డ్యు టు గ్రేవిటీ ఎప్పుడూ 780 కి కుప్పించేయడమే !!స్టాప్ వాచ్ చూడడం కూడా తెలిసేది కాదు. ఎవడిదైనా రికార్డ్ చూసి రాసేసి గట్టు ఎక్కెయ్యడమే !!

                                                

     ఉన్నవి సరిపోనట్లుగా నాకు మోకాలి నొప్పి ఒకటి ఉండేది, ఇదివరకు బ్లాగ్ లో చెప్పేనుగా  తరవాణీఅన్నం, చక్రకేళీ,పెరుగూ కలిపి

కట్లూ ,అదంతా నేను ఆకలేసి తినేయడమూ--దీని వలన నన్ను క్రికెట్ ఆడనిచ్చేవారు కాదు. చెప్పకుండా ఎలాగోలాగ ఆడేసేవాడిని ( అంతే కాదు మా టీమ్ కి కెప్టెన్

కూడానూ). ఒక రోజు సాయంత్రం చీకటి పడేదాకా ఆడుతున్నాను, ఆఖర్లో కుడి పాదం మీద బాలు పడి దెబ్బ తగిలింది. ఇంట్లో చెప్తే ఇంకా దెబ్బలూ, ఎలాగరా భగవంతుడా అనుకొని, ఎలాగోలాగ ఇల్లు చేరికొని , ఓ పెద్ద కేక పెట్టేశాను. ఏమయ్యిందంటూ, మా అమ్మ గారు వచ్చేసరికి ” నా కాలు తలుపు లో పడిందీ, బెణికిందీ ”

అన్నాను.మా అన్నయ్య గారు హరి హర స్వామి గారి దగ్గరకు తిసికెళ్ళారు, ఆయనకీ ఈ కథే చెప్పాను, ” తలుపు కాల్లో పడిందా, కాలు తలుపులో పడిందా ” అని వేళాకోళం చేసి ఏదో కట్టారు. మన రోజు బాగుండక ఆ రాత్ర్ నిద్ర లో కలవరింతల్లో ” ఏయ్ సాంబూ బాల్ మెల్లిగా వెయ్యి అన్నానుట” ఇంకేముందీ నా దెబ్బలకి కారణం తెలిసిపోయి చివాట్లు పడ్డాయి.

Advertisements

6 Responses

 1. చిన్నప్పుడు నేను కూడా అచ్చం ఇలాగే.. కాకపోతే చిన్న ఛేంజ్.. మాకు పదో తరగతి తరువాత ఏకంగా ఇంటెర్ .. అంటే మేము మీకన్నా చాలా చిన్నోళ్ళం అన్నమాట.

  ఇక దెబ్బల విషయానికి వస్తే, ఆరోజుల్లో మనమే రికార్డ్.. కాబట్టి మిమ్మల్ల్ని ఓడించానని చెప్పొచ్చు

  Like

 2. ఫణిబాబు గారు – ముందుగా ఒక ఆశీర్వాదం ఇటు వదలండి. ఆ కాలపు విషయాలు చాలా ఆసక్తిగా వ్రాస్తున్నారు. మీ తర్వాతి పోస్టులకోసం ఎదురు చూస్తున్నాను.

  Like

 3. రోగానికి రట్టూ, సంసారానికి గుట్టూ వుండాలని సామెత.
  అంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు ఇతరులతో చర్చించడానికి సంకోచించకూడదు
  సంసారంలో సమస్యవచ్చినపుడు మాత్రం ఆ విషయం గుట్టుగా వుంచాలి. కొన్నాళ్ళకి అవే సర్దుకుంటాయి అని.
  ఇంతగా వైద్యం అభివుంద్ది చెదని రోజుల్లో పుట్టిన సామెతలెండి. మీకూ తెలిసే వుంటుంది.

  Like

 4. చక్రవర్తి గారూ,

  చూసేరా నేను రాసినవి చదివేసరికి అందరికీ వారి వారి చిన్నతనపు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేస్తున్నాయి. కొంతమంది అవి చెప్పుకోవడానికి మొహమ్మాట పడతారు.

  Like

 5. జీడి పప్పు గారూ,

  అడిగేరు కాబట్టి ఆయుష్మాన్ భవ. చదువుతానన్నారు కాబట్టి ధన్యవాదాలు.

  Like

 6. లలిత గారూ,

  మీరు చెప్పినది కరెక్టే. మధ్య తరగతి కుటుంబాలలో ఉన్న పెద్ద బలహీనత ఇది. ” ఊళ్ళో వాళ్ళు ఏమంటారో ‘ అని అనుకోవడం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: