బాతాఖానీ ఖబుర్లు — 6


                                                

       చిన్నప్పుడు   తిని ఆనందించిన కొన్నింటిల్లో ” బొంబాయి మిఠాయి “, పీచు మిఠాయి, మరచి పోకూడదు. స్కూల్ బయట అవి అమ్మేవాడు ఉండేవాడు. ఓ కర్ర కి అదేదో గులాబి రంగు లోఉండేది ( చుట్టి ఉండేది), దాన్ని మన మణికట్టు కి వాచీ లాగానో, లేక ఏదో రకమైన బొమ్మలాగానో చేశేవాడు. అది నాక్కుంటూ ఉండడమే !! ఆ అనందం ఎక్కడైనా ఉంటుందాండీ ? అలాగే మా అమ్మమ్మ గారు చేశే కొబ్బరి పరమాన్నం, అమ్మ గారు చేసే చంద్రకాంతాలు ( చెడిన కాపురం ఎలాగూ చెడింది, చంద్రకాంతాలు చెయ్యవే భామా అని ఒక సామెత ). ఇవే కాకుండా స్కూల్లో స్నేహితులతో ” కాకి ఎంగిలి చేసిన మామిడి కాయో, జాం కాయో  ఎప్పుడూ ఉండేవి !!

                                                  

      మా నాన్నగారు మండపేట లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఆపరేషన్ చేయడానికి విశాఖ పట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి లో చేర్చారు. అప్పుడు ఆయనకి తోడుగా నన్ను తీసికెళ్ళారు. అక్కడే ఆయనతో పడుక్కోవడం, ఆక్కడే మొట్టమొదటి సారి టెలిఫోన్ ఉపయోగించడం చేశాను. అదో అద్భుతమైన ఫీలింగ్. అక్కడ ఎదురుగుండా ఉండే ” పవన్ బేకరీ” లో రోజూ కాఫీ తాగడం, అప్పుడప్పుడు మెడికల్ కాలేజీ హాస్టల్ కి వెళ్ళడం, ఆసుపత్రి లో నర్సుల్ని

నోరు వెళ్ళపెట్టి చూడడం. ఏమిటో వాళ్ళు చాలా అందం గా కనిపించేవారు. ఇంత అందమైన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారేమిటీ అనుకోవడం!!

                                                    

     అమలాపురం లో నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే డాక్టర్ గారు బ్రెడ్ పెట్ట మనేవారు. ఆ బ్రెడ్ అమ్మే అతన్ని ” సాయెబు” అనేవారు.

సాయెబులందరూ, బిస్కట్లూ, బ్రెడ్లే చేస్తారనుకొనేవాడిని చాలా కాలం దాకా !! ఇంక మా డాక్టర్ గారి గురించి చెప్పాలంటే — ” ఆయన ( శ్రీ కూరెళ్ళ హరి హర స్వామి గారు) దగ్గరకు వెళ్ళడం అంటే నాకు చచ్చే భయం. ఆయన గొంతుకు చాలా పెద్ద గా ఉండేది. ఒక్కసారి  గట్టిగా ఆడిగారంటె మన రోగం ఫటా ఫట్. అక్కడ కాంపౌండర్ సత్యం అని ఉండే వాడు. అతను ఏదో పెద్ద సీసాలోంచి ఏదో గులాబీ రంగు నీళ్ళు ( కార్బనేట్ మిక్స్చర్ అంటారనుకొంటా), ఏవో పొడులు చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇచ్చేవాడు..  ఇంట్లో నౌకర్లు ఉండేవారు ( మా నాన్న గారు హెడ్మాస్టారు కాబట్టి) అయినా ఒక్కకప్పుడు అర్జెంట్ గా ఏదైనా కావల్సివస్తే నన్ను అక్కడ కి దగ్గర్లో ఉన్న సూర్రావు కొట్టుకి పంపేవారు. కావల్సినవి తీసుకొన్న తరువాత మనకి చేతిలో  బెల్లం ముక్క పెట్టే దాకా అక్కడ నుంచి కదలకపోవడం–ఇలాంటి చిన్న చిన్న మధురమైన జ్ఞాపకాలు ఎప్పడికీ తాజా గానే ఉంటాయి.

                                                   

     వేసంగి శలవలు వచ్చాయంటే మా పిన్ని గారి పిల్లలు వచ్చేవారు.  ఇంక అందరూ వాళ్ళకే సేవలు చేశేవారు, పట్నం నుంచి వచ్చారు కదా, అలాగే మా మామయ్య గారి పిల్లలు,  ఒకళ్ళు మెడ్రాస్ నుంచీ, ఇంకోళ్ళు ధీల్లీ నించీ. ఇంక మనని ఎవరు పట్టించుకొంటారూ ? అప్పుడు మాత్రం చాలా అసూయ గా ఉండేది. పైగా వాళ్ళందరూ తెల్లగా, బొద్దు గా ఉండేవారేమో అందరికీ వాళ్ళంటేనే ముద్దు . ఎప్పడికైనా మనం కూడా వాళ్ళలాగ తయారు అవ్వాలనుకొనేవాడిని. ఏమిటో చిన్నతనం లో మన ఊహలు ఎలా ఉంటాయో ఇప్పుడు తల్చుకొంటే నవ్వు వస్తుంది.

                                                   

      మా నాన్నగారికీ, అన్నయ్య గారికీ, ఎస్.ఎస్.ఎల్.సీ పేపర్లు దిద్దడానికి వచ్చేవి. చాలా ఉండెవి. దిద్దడం వాళ్ళందరూనూ, అవి అన్నీ సరిగ్గా బొత్తి పెట్టి ఉంచడం మనకి ఇచ్చేవారు. రాత్రిళ్ళు ఒంటి గంటా రెండు దాకా మెళుకువగా ఉందవలసి వచ్చేది. ఏమ్ లేదూ కారణం ఏమంటే అందరూ తినడానికి, అద్దాల బండి లో ఉండే మిఠాయి కొమ్ములూ, పకోడీలూ, జిలేబీలూ ఇలాంటివన్నీ తినడానికి వచ్చేవి. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా ఈ ఆనందాలన్నీ,

పేపర్లు దిద్దడానికి ఏదో ” స్పాట్ వాల్యుఏషన్” ట. అందరూ కలిసి కట్ట కట్టుకొని దిద్దడం, వాళ్ళ ఖబుర్లలో ఎవడొ ఒకడి కొంప ముంచేయడమూనూ.

                                                   

      చెప్పేనుగా మా ఇంట్లో ఉండి చాలా మంది కాలేజీ కి వెళ్ళేవారు.అందులో ఒకతను కమ్యునిస్ట్ అనుకొంటా–మా ఇంటి మీద

ఎర్ర జండా కట్టారు. అంతే ఇంకేముందీ మా పెదనాన్న గారు ఉగ్రుడై పోయి అందర్నీ తిట్టేసి, అది తీయించేదాకా వదలలేదు..

                               అలాగే అమలాపురం లో కరెంటు వచ్చినప్పుడు మొట్ట మొదట  ఎలట్రీ ( మా అమ్మమ్మ గారి భాషలో) వెలగడం ఇప్పడికీ గుర్తు

ఉంది. ఒకసారి అక్కడ ఏదో ప్లగ్ ఉంటే దాంట్లో ఏమైనా పెడితే ఏమవుతుందని కుతూహలం. పెట్టేను–ఫట్ మని పోల్ దాకా ఫ్యూజ్ అయిపోయింది పెద్ద చప్పుడు తో

 మా అమ్మ గారేమో వంటింట్లో ఉన్నారు. ఏమయిందో తెలియదు ఎవరు బాగు చేస్తారో తెలియదు. నాకు ఇప్పడికీ అర్ధం అవనిది ఏమంటే అలా ప్లగ్ పిన్ కి తాళం చెవి తగిలించినప్పుడు నాకు షాక్ ఎందుకు కొట్ట లేదూ అని. అలా కొట్టుంటె నేనూ ఉండేవాడిని కాదూ, మిమ్మల్ని ఇలా బోర్ కొట్టేవాడిని కాదూ.                       .

Advertisements

12 Responses

 1. చాల బాగున్నాయండి మీ చిన్నప్పటి కబుర్లు.. మా ఆలోచనలని కూడా బాల్యానికి తీసుకుని వెళ్తున్నాయ్

  Like

 2. పీచు మిఠాయి అంటే పింకుగా బూజు బూజులా వుండేది కాదా? భలే! బాల్యంలో అందరూ ఒకేలా అలోచిస్తామా? నాకు కూడా నేను నల్ల పిల్లననే ఫీలింగ్ చాలా ఎక్కువగా వుండేది!

  Like

 3. అమ్మో….అవన్నీ భలే గుర్తున్నయండీ మీకు. కొట్లో పెట్టే కొసరు బెల్లం ముక్కకోసం ఎదురుచూడటం తల్చుకుంటే నవ్వొస్తుంది. నా చిన్నతనం కూడా పల్లెలోనే గడిచింది.

  Like

 4. chala bagunayandi…………… naaku kudha naa patha rojulu gurtuku vachayi…………… ippati life n appati life compare chesthe chala miss avutunamu anpistundhi……….. chala thanx

  Like

 5. మీ కబుర్లు చాలా బాగున్నాయ్ . ఆద్యంతం చదివించేతట్టుగా వున్నై.అన్నట్టు మాది కూడా రాజమండ్రి యే నండి. మా బ్లాగ్ ను కూడ వీక్షించవలసిందిగ ప్రార్ధన

  Like

 6. అశోక్ గారూ, అందులోనే ఉంది ఆనందం అంతా.

  Like

 7. అశ్వినీ శ్రీ మీరు అన్నది కరెక్టే. బొంబాయి మిఠాయి ఎప్పుడూ చూడలేదా? ఓ కర్రకి చుట్టేవాడు. దానితో అన్నిరకాల బొమ్మలూ చేశేవాడు.

  Like

 8. లలిత గారూ, ఆ బెల్లం ముక్క లో ఉన్న ఆనందం ఇప్పుడు ఈ మాల్స్ వాళ్ళిచ్చే డిస్కౌంట్ ల మీద ఎంతో గొప్పది. ఆ రోజుల్లో బెల్లం ముక్క పెట్టేడంటే ఓ కస్టమర్ లాయల్టీ సంపాదించేశాడన్న మాటే కదా!! ఏ మేనేజ్మెంట్ స్కూల్లోనూ వాళ్ళు చదవలేదు. ఇప్పుడైతే లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి ఐ.ఐ,ఎమ్ ల లో నేర్చుకొంటున్నారు.

  Like

 9. తెలుగోడా గారూ, ధన్యవాదములు.

  Like

 10. ఆంధ్రా చిన్నోడ గారూ, ధన్యవాదాలు. మీ బ్లాగ్లు చదివేను. నేను గత 45 సంవత్సరాలూ ఉద్యోగ రీత్యా పూణే లో ఉండిపోయాను. నాకు మీరు వ్రాసే వాటి మీద కామెంట్ పాస్ చేసే అర్హత లేదు ( ఎందుకంటే వీటి గురించి నాకు అవగాహన లేదు ). అయినా ఇటుపైన చదువుతూ ఉంటాను. నాకు తెలిసిన అంశం మీద మీరు ఏదైనా రాస్తే తప్పకుండా నా అభిప్రాయం రాస్తాను.

  Like

 11. abba bhale ga navvistunnaru.meeru cheptunte avanni ippudu cheyalanipistundi…memu chala miss ayyamu balyanni.

  Like

 12. మధూ,

  నవ్వడం వరకూ బాగానెఉంది. ఇప్పుడు అలాంటివి చేస్తే ఇంట్లోవాళ్ళు ఊరుకోరమ్మా.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: