బాతాఖానీ—-తెరవెనుక ( లక్ష్మీ ఫణి ) ఖబుర్లు


                  

    అస్తమానూ  చిన్ననాటి ఖబుర్లే రాసి రాసి మిమ్మల్ని ” బోరు ” కొట్టడం న్యాయం కాదనిపించి, ఈ వేళ కొంచెం మార్చాలను కున్నాను. నాకు కంప్యుటర్ అంటే చాలా రోజుల వరకూ, ఏదో యువ తరం వారు ఉపయోగిస్తేనే బాగుంటందనుకొనే వాడిని. మేము భుసావల్ దగ్గర వరంగాం అనే ఊరిలో ఉండేవాళ్ళం. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదవడానికి పూణే వెళ్ళింది. అబ్బాయి క్లాస్ 8 లో ఉండగా కంప్యూటర్ కావాలన్నాడు, సరేనని అదెదో 286 అనుకొంటా– తెప్పించాను. దానిమీద చెయ్యి వేస్తే ఒట్టు.రోజూ మా అబ్బాయి దానిమీద నేర్చుకొంటూంటే  నేనూ, మా ఆవిడా సంబర పడిపోయేవాళ్ళం.

               

       ఆ తరువాత  1998 లో పూణే ట్రాన్స్ఫర్ అయి వచ్చేము. అప్పడికి మా అబ్బాయి వాళ్ళ అక్క లాగానే ఇంజనీరింగ్ లో చేరాడు. ఇంక ఆ 286 అవతల పారేయమన్నాడు. ఇంకోటేదో 50 వేలు పెట్టి కొనిపించాడు !! ఏంచేస్తాం చదువుకొనే పిల్లాడు అడిగితే కాదంటామా? అప్పడికి మా అమ్మాయి వివాహం అయి, మేము తాత, అమ్మమ్మ లు అయ్యాము. నేను పనిచేశే చోట ఆఫీస్ లో నా కింద ఓ 60 కంప్యుటర్లు ఉండెవి. అయినా వాటి మీద చెయ్యి వేశే ధైర్యం రాలేదు. మా అబ్బాయి

పై చదువుకి, గుర్గాం వెళ్తూ, ఈ కంప్యుటర్ ఇక్కడే ఉంచితే నాతో కాంటాక్ట్ ఉంచుకోవడానికి వీలు పడుతుంది అని చెప్పి నాకు మెయిల్స్ ఒపెన్ చెయ్యడం, పంపడం నేర్పాడు. ఈ లోపులో మా అబ్బాయి నా చేత ఇంకో కంప్యూటర్ అక్కడ వాడుకోడానికి కొనిపించాడు. ఇన్ని కొన్నా, నేను మెయిల్ పంపడం కంటే నేర్చుకోలేదు.

               

      రిటైర్ అయ్యే నాటికి ఇంక లాభం లేదనుకొని మెల్లిగా రంగం లోకి దిగాను. ( అరవయ్యో ఏట వేవిళ్ళ లాగ ). ఏతా వాతా చెప్పేదేమిటంటే నాకు ఈ నెట్ వ్యవహారం లో 2006 నుండి ఏదో కెలుకుతూ కాలక్షేపం చేస్తున్నాను.  మా అబ్బాయి ధర్మమా అని ఇంగ్లీష్ లో బ్లాగ్ ప్రారంభించాను, ఏవో వ్రాశే వాడిని,ఇవి కాకుండా అన్ని రకాల పేపర్లూ,మేగజీన్స్ కీ లెటర్స్ వ్రాసేవాడిని. పేపర్లో పేరు వస్తే అదొ ఆనందం. అక్కడ ఎప్పుడైనా నాకు ఏమైనా కంప్యూటర్ గురించి భయం పోగొట్టాడూ అంటే ఆ ఘనత అంతా మా అబ్బాయిదే.ఒక సారి ఈ” ప్రపంచం “లోకి వచ్చేసిన తరువాత నెట్ లో కి వెళ్ళి, మిస్టరీ షాప్పింగులు కూడా చేశేవాడిని. ఆ ఎస్సైన్మెంట్లకి ఎవో డబ్బులు కూడా ఇచ్చేవారు. చాలా ఎంజాయ్ చేసాను. ఏదైనా సందేహం వస్తే అమ్మాయి, అల్లుడూ, అబ్బాయి, కోడలూ నా  రెస్క్యూ కి వచ్చేవారు.

              

      ఆంధ్ర దేశం వదలి 45 సంవత్సరాలు గడిచేయి,బాధ్యతలు కూడా చాలా మట్టుకు అయిపోయేయి కదా అని కొన్ని రోజులు మన ప్రాంతాలన్ని చూద్దామనే సదుద్దేశ్యం తో ఓ ఆరు నెల క్రిందట రాజమండ్రీ లో ” కొత్త కాపురం”పెట్టాము.  ఏదో అవసరమైన సామాన్లు తెచ్చుకొన్నాము. ఈ మధ్యన మా అమ్మాయీ, అల్లుడూ,పిల్లలూ  దీపావళి కి వచ్చినప్పుడు ఓ వాషింగ్ మెషీన్ కొని పెట్టింది. ఇన్నాళ్ళూ కొన్నవి ఏ మూలకీ రాలేదు కానీ వాళ్ళ అమ్మాయి కొన్నదానిమీద ఎంత మక్కువో!! కూతుర్ని రోజూ చూస్తూన్నట్లు ఉంటుందిట. అలాగే నా 64 వ బర్త్ డే కి అబ్బాయి ఓ కంప్యూటర్ కొన్నాడు.

                

    చాలా రోజుల నుండి నాకు తెలుగులో వ్రాయాలని ఓ కోరిక ఉంది.పెన్ను తో రాద్దామంటే నా చేతి రాత ఎవరికీ అర్ధం అవదు, తెలుగులో టైప్ చేయడం రాదు, ఇలా కాదని, మొదటి బ్లాగ్ లో చెప్పినట్లుగా కౌముది కిరణ్ ప్రభ, వసుంధర గార్ల ప్రొత్సాహం తో  ఎలాగైతే తెలుగు లో టైప్ చేయడం నేర్చేసుకొన్నాను ఇంక వదులుతానా మిమ్మల్ని !! ఇక్కడే ఓ గొడవ వచ్చింది. నేను ఏదో సుఖ పడిపోతున్నానని మా ఆవిడ కూడా నేర్చేసుకొంది ( నేనే నేర్పానులెండి). ఇంక కంప్యూటర్ వదలదే!! ” నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా” అని రోజంతా దాని ముందరే కూర్చుంటుంది. ఏదొ కరెంట్ పోయినప్పుడు ఎదో వండి పారేస్తుంది.

Advertisements

17 Responses

 1. మంచి పని జరిగింది! మాకు చాలా సంతోషం.
  పోన్లెండి, రిటైరయినాక ఈ కాలక్షేపం మొదలెట్టారు. సర్వీసులో ఉండగానే ఈ వ్యసనం పట్టుకునుంటే అదో తంటా మళ్ళీనూ.

  Like

 2. ఈ వయసులో మీ అభిరుచికి, మీ ఓర్పుకి… పైగా మీ శ్రీమతి గారు… వాహ్… అద్బుతం. మీ 2nd innings.. మరింత సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడవాలని కోరుకుంటున్నాను.

  Like

 3. కొత్త పాళీ గారూ, కృష్ణారావు గారూ ,

  మీలాంటి వారి స్పందన చూసిన తరువాత, 60 ఏళ్ళ తరువాత కూడా జీవితం లో చాలా చెయ్యొచ్చనిపిస్తొంది. ధన్యవాదములు.

  Like

 4. భలే నవ్వించారీసారి. ఆవిడ కూడా బ్లాగు రాస్తే చదవాలని ఉంది.

  Like

 5. అరుణగారూ,

  ఆవిడ రాయడం మొదలు పెడితే ఇంక నేను రాసేది ఎవరు చదువుతారమ్మా? ఇన్ని సంవత్సరాలూ నేను చెప్పే ఈ కథలు విని, విని, –” అమ్మయ్యా, నన్ను వదిలేడు ఈయన,ఇంక నెట్ లో అందరినీ పట్టు కున్నాడు అని చెప్పి, మా పిల్లలకి కూడా ఫోన్ చేసి వాళ్ళకి కూడా ఈ శుభ వార్త చెప్పింది.”

  Like

 6. బాగుంది! వయసు దేనికీ అడ్డంకి కాదు లెండి.
  మీరు ఇలాగే ఉత్సాహంతో కొనసాగించండి.

  Like

 7. ఫణిబాబుగారు, చంపేస్తున్నారండి బాబు. 🙂
  నా అభిమాన సాహిత్య పాత్రల్లో ఒకడైన హొరేస్ రంపోల్ అంటూ ఉంటాడు, “With wives like these, who needs enemies?” అని. అతడే మళ్ళీ భార్యామణిని “She Who Must Be Obeyed” అని కూడా గౌరవిస్తుంటాడు.

  Like

 8. ఫణి బాబు గారు,
  మీ సెకండ్ ఇన్నంగ్స్ ఇంకా రంజుగా ఉంటుంది.కానివ్వండి. నేను మీరు ఏ పాతికేళ్ళవారేమో అని అనుకుంటున్నాను. మరీ బొత్తిగా పదహారేళ్ళ వారిలాగున్నారుగా?

  Like

 9. ప్రవీణ్ గారు,ధన్యవాదములు

  Like

 10. కొత్తపాళీ గారూ, మీరు చెప్పినవి చదవలేదు కానీ, రెండు పూటలా నోట్లోకి ముద్ద వెళ్ళాలంటే ( నాలాంటి రిటైర్ అయినవాడికి మరీనూ), అప్పుడప్పుడు మనం భార్య మీద చిన్న చిన్న జోకులు వేసినా కానీ , చివరలో ఆవిడ చెప్పినది వినేయడం మనకి ఆరోగ్యకరం!!

  Like

 11. నెటిజెన్ గారూ, మరీ మొహమ్మాట పెట్టేస్తున్నారు. ఈ 60 ఏళ్ళ వాళ్ళకి ఉన్న అడ్వాన్టేజ్ ఏమంటారా, రైళ్ళలో కానీ, బస్సులలోకానీ, మన పక్కన కూర్చోడానికి మొహమ్మాట పడరు( ఎవరైనా కానీ)

  Like

 12. ఫణిబాబుగారు,

  చాలా బాగా రాస్తున్నారు. మీతో పాటు మా జ్ఞాపకాలను బయటకు రప్పిస్తున్నారు..
  కాశీకీ పోయాను రామాహరే .. అన్నట్టుగా మీరు చెప్పె కబుర్లకు మీ ఆవిడ ఏమంటారో తెలుసుకోవాలనుంది. ఒకసారి ఆవిడను పిలుస్తారా??

  Like

 13. జ్యొతి గారూ, కాశీ దాకా వెళ్ళఖర్లేదు. అరుణ గారు ఏ ముహూర్తాన్న అన్నారో కానీ మా ఇంటావిడ కూడా బ్లాగ్ మొదలెట్టేసింది. http://bsuryalakshmi.blogspot.com/

  Like

 14. సూర్యలక్ష్మి గారికి బ్లాగు రాయటం నేర్పి, పెద్ద పొరబాటు చేశారు. ఇక మీ బ్లాగు ఎవరు చదువుతారు? నేను బ్లాగు పనిలో ఉన్నా, కాస్త కాఫీ కలిపివ్వరూ అంటూ మెల్లగా వంటగది వైపు దారి చూపిస్తారు. ఆ పై మీరు బ్లాగు రాద్దామంటే మీకు కంప్యూటర్ దొరకదు. జీవితం లో మీరు చేసిన మంచి పనుల వెనక brain తనదేనని వ్రాస్తే, పాఠకులు ఎవరి మాట నమ్ముతారు? Just kidding. Congrats to both of you for entering blog world.

  Like

 15. సీబీ రావు గారూ, మీరు రాసినది అక్షరాలానిజం.చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటీ? ప్రస్తుతం మీరు చెప్పినట్లే ఉంది నా పరిస్థితి. జీవితం లో తెలిసి చేసిన పెద్ద “తప్పు” ఇది!! నాకు ఒక లాప్టాప్ కొనమంటోదండి బాబూ. ఈ పి.సి . మా అబ్బాయి ఇచ్చేడు బాగానేఉంది అనుకొన్నంతసేపు పట్ట లేదు.రోజులు బాగుండనప్పుడు ఇలాగే ఉంటుంది !!

  Like

 16. > ఏదొ కరెంట్ పోయినప్పుడు ఎదో వండి పారేస్తుంది
  వంట గురించి మీరే కొంచెంసేపు ఫీజు పీకేస్తున్నారని, మీ శ్రీమతిగారికి తెలుసా? *j/k*

  Like

 17. panipuri123

  అంత ధైర్యం లేదు బాబూ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: