బాతాఖాని ఖబుర్లు –4


    శ్రీరామ నవమి గురించి  మరచి పోకూడదు. భూపయ్య అగ్రహారం లో రామాలయం ఉంది. అక్కడ నవమి రోజున సాయంత్రం పూజ మా అమ్మమ్మ గారు

చావలి బుచ్చాయమ్మ గారు చేయించేవారు.. ఇంక అరోజు హడావిడి అంతా ఇంతా కాదు. వాళ్ళ అటక మీద ఉన్న పెద్ద పెద్ద గంగాళాలు, బిందెలూ అన్నీ కిందకు వచ్చేసేవి.  సాయంత్రం అయ్యేసరికి బెల్లం పానకం తయారు చేశేవారు. పెద్ద పెద్ద బెల్లం అచ్చులు ఆ గంగాళం లో వేసి దాన్నిండా నీళ్ళు పోసి, దాంట్లో మిరియాలు వేసి, ఓ  రోకలి బండ తీసికొని అదంతా కొడుతూంటే కొద్దిసేపయ్యేసరికి బ్రహ్మాండమైన పానకం తయారు అయ్యేది, అదీ వడ పప్పూ అక్కడ గుళ్ళో ప్రసాదం గా ఇచ్చేవారు. మరచిపోయాను, వీట్లితోపాటు తాటాకు విసినకర్ర కూడా. –చిన్న పిల్లలకి ఇచ్చేవారు కాదు !!  ఆ తొమ్మిది రోజులూ, ఏదో ఒక కార్యక్రమం ఉండేది. అప్పుడే హరికథలు, బుర్ర కథలు ( శ్రీ నాజర్ గారివి, శ్రీ నిడదవోలు అఛ్యుతరామయ్య గారివీ) వినే భాగ్యం కలిగింది. అంత చిన్నప్పుడు విన్నా, ఇప్పటికీ అంటే 55 సంవత్సరాల తరువాత కూడా అవి గుర్తు చేసికొంటే ఒళ్ళు పులకరిస్తుంది, ప్రేక్షకులలో ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించేవారు.

ఇంక దసరా అంటే  స్కూల్ పిల్లలందరూ ఊరేగింపు గా అగ్రహారం లో ఉన్న అందరి ఇళ్ళకూ వెళ్ళే వాళ్ళం. అక్కడ పిల్లలందరికీ పప్పు బెల్లాలు పెట్టేవారు. దసరాలలో

మా మామయ్య గారి పుట్టిన రోజు వచ్చేది. మా అమ్మమ్మ గారికి సంబందించిన చుట్టాలు  అందరూ అమలాపురం లో ఉండాల్సిందే. ఆ రోజున అందరికీ వాళ్ళింట్లో భోజనాలు. దశమి రోజున బజార్లో ఏవేవో వాహనాలు  ( ఏనుగులు,హంసలూ, చిలకలూ ) పెద్ద పెద్ద ఆకారాలతో చేసి, వాటికి  లైట్లు అవీ పెట్టి అలంకరించేవారు. చుట్టు పక్కల ఊళ్ళనించి ఎంతో మంది వచ్చేవారు. ఇది అంతా అయేసరికి తెల్లవారి పోయేది.

ఇవే కాకుండా అగ్రహారం లో ఎవరైనా నందికేశుడి నోము చేసుకొన్నారంటే, స్కూలికి వచ్చి పిల్లలందరినీ తీసికెళ్ళేవారు.అక్కడ ఉండ్రాళ్ళూ, ఒక్కకప్పుడు అట్లూ ఇచ్చేవారు. ఆ అట్లతో  ” తిమ్మనం” అనేది నలుచుకోవడానికి ఉండెది. ఆ తిమ్మనం ” రుచి ” మాత్రం ఇప్పడికీ మరచిపోలేదు. అక్కడ వాళ్ళు పెట్టినవి ఏమీ వదిలేయకుండా తినాలి. ఇంటికి పట్టుకెళ్ళ కూడదు !!

శ్రావణ మాసం లో వచ్చే  వరలక్ష్మీ వ్రతానికైతే మా అమ్మ గారు తొమ్మిది పిండి వంటలూ చేసేవారు. నా అదృష్టం కొద్దీ ఇప్పడికీ నా భార్య  అదే  పద్ధతి లో చేసి పూజ చేసికొంటోంది.  అలాగే మా కోడలు కూడా అదే బాటలో నడుస్తూంది

పోలాల అమావాస్య నాడు చేశే   “పొట్టెక్క బుట్టలు” ఎవరైనా మరచి పోతారా?

అన్నీ పండగలే కాకుండా పిండివంటలు చేశే మరో రోజు  తద్దినం !! ఆరోజు చేశే గారెలు, అప్పాలూ,నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళూ,

ఒక్క చారు మాత్రం బాగుండేది కాదు. అందులోనూ అల్లం పచ్చడి, నువ్వుల పచ్చడీ  అస్సలు ఆ కాంబినేషన్ ఈ రోజుల్లో ఏ షెఫ్ అయినా చేయకలడా ? అందుకనే పిల్లలు ఆరోజు భోజనాలు ఎంత ఆలస్యం అయినా ఏడ్చేవారు కాదు. పైగా మనింట్లో అస్తమానూ తద్దినం వస్తే బాగుండును అనుకొనేవారు. ఈ విషయం రాస్తూంటే ఓ సంగతి గుర్తుకు వచ్చింది. ఒక సారి బొంబాయి లో మా స్నేహితుడింటికి మన గోదావరి జిల్లా వాడు వెళ్ళేడు. పోనీ కదా అని ఇతన్ని వాళ్ళ స్నేహితుడింటికి (తెలుగు వాళ్ళు)తీసికెళ్ళాడు. అక్కడ విళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా అని ఆ రోజున గారెలు చేసికొన్నారుట– గారెలూ, దాంట్లోకి బావుంటుంది కదా అని నలుచుకోవడానికి అల్లం పచ్చడి పెట్టారుట!! మనవాడికి సందేహం వచ్చి  ” వీళ్ళింట్లో ఎవరిదైనా తిథా ” అన్నాడుట.

Advertisements

6 Responses

 1. “దసరాకి వస్తిమని విసవిసలు పడక..చేతిలో లేదనక అప్పివ్వరనక..” సరిగానే చెప్పానా అండి? కొంచం ఆలస్యంగా చూశా మీ బ్లాగుని.. మొత్తం చదివేశాను. చాలా బాగా రాస్తున్నారు..

  Like

 2. దసరాకి డబ్బుకూడా అడిగేవారు. అర్దరూపాయిస్తే అంటేదిలేదు, ముపావులయిస్తే ముట్టేదిలేదు, పెక్కుపైకాలిస్తె పుచ్చుకుంటాము.

  Like

 3. >> పైగా మనింట్లో అస్తమానూ తద్దినం వస్తే బాగుండును అనుకొనేవారు.

  🙂

  Like

 4. మురళి గారూ, మేము ” అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు … ” అని పాడేవారు. ఇది కూడా మా ఆవిడను అడిగి రాస్తున్నాను !!

  Like

 5. లవ్లీ గారు, వాళ్ళు అడిగేవారా లేదా అనేకంటే, ఇవ్వడం మన ధర్మం అనుకొంటాను. వాళ్ళకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలమండీ?

  Like

 6. అసంఖ్య గారూ, మరి అందులోనే ఉంది ఆ చిన్నతనపు అమాయకత్వం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: