బాతాఖాని ఖబుర్లు—-3


    

      నిన్న రాసిన ఖబుర్లకి కూడా స్పందన బాగానే ఉన్నట్లుగా అనిపించింది.శ్రీ కృష్ణారావు గారు నా ఖబుర్లు చదివి, ” అమరావతి కథల” లాగ ” కోనసీమ కథలు” రాయమన్నారు.  బాబూ, నేను ఆ స్థాయి కి చేరాలంటే కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఏదో నాకు గుర్తు ఉన్నంతవరకూ నా చిన్నతనపు విశేషాలు రాస్తున్నాను. మీరు ఓపికగా చదువుతున్నారు. ఈ జన్మ కి ఇది చాలు. అందరికీ వందనాలు.

     

        మా ఇంటి దగ్గర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడి లో డిసంబర్  అనుకొంటా ప్రతీ ఏడూ తీర్థం జరిగేది. ఇంక ఆ రోజున స్కూల్ కి శలవు.  తెల్లవారు ఝామునే  నిద్ర లేపేసి గుడికి తీసికెళ్ళేవారు.  మధ్యాహ్నం తీర్థం ఒక అందమైన అనుభవం. మనకి కావల్సిన జీళ్ళు,  ఖర్జురం పళ్ళు ( అవి ఓ తామరాకులో కట్టే  వారు ) , అలాగే మిఠాయి కొమ్ములు.. ఓహ్ ఆ రుచి ఈ రోజుల్లో దేనికైనా వస్తుందాండీ ?. తీర్థం చూడడానికి మా చుట్టాలు దగ్గర ఉన్న ఇందుపల్లి, సాకుర్రు,అంబాజీపేట లాంటి ఊళ్ళనుండి వచ్చేవారు. ఆ బెల్లం జీళ్ళు తయారుచేయడం ఓ అద్భుత ప్రక్రియ–ఓ స్థంభానికి ఆ పాకం చుట్టేసి ఇద్దరు మనుష్యులు దాన్ని పొడుగ్గా లాగి, ఆ తరువాత

దానిని చిన్న చిన్న ముక్కలు గా చేశేవారు. ఈ దృశ్యం 60 సంవత్సరాల తరువాత ఈ మధ్యన మా అమ్మాయీ పిల్లలతో అంతర్వేది వెళ్ళినప్పుడు చూసి ఎంత ఆనందించేనో  మాటల్లో చెప్పలేను.( ఫొటో తీయలేక పోయామే అని చాలా బాధ పడ్డాను, అయినా ఎప్పుడో అప్పుడు నాకు ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను)

            

     ఆ తరువాత గుర్తు లేదు సరీగ్గా మోబర్లీపేట లో వెంకటేశ్వర స్వామి తీర్థం. ఇది కొంచెం పెద్ద స్కేల్ లో జరిగేది, కారణం ఇక్కడ స్థలం ఎక్కువగా ఉండేది.. అలాగే సంక్రాంతికి మా ఇంటికి ఎదురుగుండా భోగి మంటలు వేశేవాళ్ళు. ఆ ముందు రోజు రాత్రి మా ఇంటి గేట్ (చెక్కది) తీశేసి ఇంట్లో దాచేశేవారం లేకపోతే రాత్రి ఎవరైనా దాన్ని భోగి మంటల కోసం  ఎత్తుకుపోయే ప్రమాదం ఉండేది !! అన్నింట్లోకీ అందమైనది మాకు దగ్గరలో జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థం. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒక్కసారే తీసికెళ్ళారు. ఆ తీర్థం లో వ్యాఘ్రేశ్వరం ప్రభ చాలా పెద్దది. ఆ దృశ్యాలు ఎప్పడికీ మన మనస్సుల్లోంచి చెరపలేము. ఇలా అవకాశం వచ్చినప్పుడు గుర్తు చేసికొని ఆనందించడమే. ఇవి అన్నీ కాకుండా శివరాత్రికి ముమ్మిడివరం లో బాలయోగి తీర్థం. ఏడాదికి ఒక్క సారి ఆయన దర్శనం ఇచ్చేవారు. మిగిలిన అన్ని రోజులూ మౌనంగా సమాధిలో ఉండేవారు. ఆయన దర్శనం చేసికోవడానికి విపరీతమైన జన సందోహం ఉండేది. ఆ జనం లో తప్పి పోకుండా నాన్నగారి చెయ్యో, అమ్మ చెయ్యో పట్టుకొని ఇంటికి చేరడం.

         

       ఇవన్నీ ఒక ఎత్తూ, దీపావళి ఒక ఎత్తూ. దిపావళి వచ్చేముందరే  సిసింద్రీలు( వాటిని ఆ రోజుల్లో మా ప్రాంతం లో తూరీగలు అనేవారు )ఎక్కడ తయారుచేస్తారో కనుక్కొనేవాళ్ళం. అవి రూపాయికి 100/200 లెఖ్ఖన అమ్మేవారు.  ఎవరో ఒకరితో బజారికి పంపించి తాటాకు టపాకాయలు, ఎలట్రిక్ టపాకాయలు, మెగ్నీషియుం వైరూ, పాము మందూ,కొనిపించేవారు. మతాబాలూ,చిచ్చిబుడ్లు ఇంట్లోనే చేయడం. ఇంత హడవిడి లోనూ ఎలాగో లాగ రెండు రూపాయల దాకా నొక్కేసి మన సిసింద్రీల కి ఫండ్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళం.

అన్నింటికంటే ముఖ్యం  తిప్పుడు పొట్లం– ఓ గుడ్డ లో ఎవేవో వేశే వారు. అన్నీ చుట్టేసి రెండు, మూడు తాటి  మట్టల మధ్య పెట్టి ఓ చేంతాడు కట్టడం. అది దీపావళి నాడు సాయంత్రం తిప్పుతూంటే అందులోంచి నిప్పు రవ్వలు రాలేవి. ఇదేమిటంటే ఖర్చు లేని పని, రాత్రి 8 గంటల దాకా మనని ఎంగేజ్ చేసి ఉంచడం అన్న మాట.

వెలుగుండగానే గోంగూర కాడలకి నూనెలో ముంచిన వత్తులు కట్టి అవి వెలిగించి ” దిబ్బూ దిబ్బూ దీపావళీ అని పాడుతూ అవి ఆరేదాకా నేలకి కొట్టాలి.ఈ కార్యక్రమం అయినాక, కాళ్ళు కడుక్కున్న తరువాతే దీపావళి సరుకుల మీద చెయ్యి వేయనిచ్చేవారు. (ఆ తరువాత మా అమ్మ గారు  80 / 90 సంవత్సరాల వయస్సు లో నా దగ్గర ఉండే వారు దీపావళి వచ్చిందంటే చాలు ఏరా ఫణీ పిల్లలచేత దివిటీలు కొట్టించావా అనేవారు. నా చిన్నతనపు రోజులు గుర్తుచేసికొని మా పిల్లలకిఆ విషయాలు చెప్పేవాడిని). పొద్దుటనించీ ప్రమిదలు నీళ్ళలో నానపెట్టడం.గుడ్డ వత్తులు చేసి అవే వాడడం. ఈ మధ్య లో మా అమ్మమ్మ గారు చేతిలో కొబ్బరాకుల కట్ట వెలిగించుకొని ఆ వెలుగు లో మా ఇంటికి వచ్చేవారు. ” ఇది నా ఎలట్రీ దీపం రా అనేవారు”.

    

      ఇంకొక విషయం మర్చిపోయాను. ఒకసారి మా అమ్మగారు ఎక్కడికో పేరంటానికి వెళ్తే నేను ఒక్కడినే ఉన్నాను. ఆ సమయంలో ఏదొ అడ్వెంచర్ చేయాలనిపించింది. ఇంట్లో తేగలు ఉన్నాయి, అవి తీసికొని ,రెండు భాగాలు చేసి, అందులో “చందమామ” అవతల పారేసి ( చందమామ తింటే చదువు రాదనేవాళ్ళు, నా కైతే తినాలనిపించేది. ఎప్పుడో తినేఉంటాను అందుకే చదువు  అబ్బలేదు). మా నాన్న గారి షేవింగ్ సెట్ లో ఉన్న ఒక పా త బ్లేడ్ తిసికొని ముక్కలు చేస్తుంటే పుటుక్కుమని బొటన వేలు తెగింది.రక్తం బొటబొటా కారు తూంటే ఏం చేయాలో తెలియక ఎదురుగుండా ఓ గంగాళం నీళ్ళు ఉంటే అందులో వేలు ముంచేశాను. ఇంకేముందీ మా అమ్మ గారు తిరిగి వచ్చి చూసుకొనేసరికి గంగాళం లో ఎర్రగా ఉండేసరికి  హడలి పోయింది ఆవిడ. ఆ చిన్ననాటి మచ్చ  బొటన వేలిమీద ఇప్పడికీ ఉంది, అది చూసినప్పుడల్లా ఆ  సంఘటన గుర్తు వస్తూంది.

Advertisements

18 Responses

 1. baagundi.

  Like

 2. చిన్నప్పుడు అన్ని తీర్థాలకి వెళ్ళే వాడిని.. ఇప్పుడు కూడా ప్రభల తీర్థానికి ఖచ్చితంగా మా ఊరు వెళ్తా.. మొన్న సంక్రాంతి నాటి ప్రభల తీర్థం ఫోటో లని ఇక్కడ పెట్టాను చూడండి.. 🙂

  http://telugabbai.wordpress.com/2009/01/24/%E0%B0%95%E0%B1%8B%E0%B0%A8%E0%B0%B8%E0%B1%80%E0%B0%AE-%E0%B0%B8%E0%B0%82%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%B2-%E0%B0%A4/

  Like

 3. సర్, నేనూ అమలాపురం వాణ్ణే. పుట్టి పెరిగిందే కాక ఎక్కువ భాగం చదువు నడిచింది కూడా అక్కడే. మీ కబుర్లు ఎన్నో జ్ఞాపకాల్ని వెలికి తీస్తున్నాయి. సుబ్బారాయుడి షష్టి తీర్థం మా చిన్నతనంలో చాలా పెద్ద పండగ/ఈవెంట్ల లో ఒకటి. దాని కోసం తెగ ఎదురు చూసేవాళ్ళం. ఆ తీర్థంలో పిల్లల ఆటబొమ్మలు బూరలు, బుడగలు వగైరా కొనుక్కోడం గొప్ప సంబరంగా ఉండేది.

  ఇంక దీపావళి గురించి మీరు చెప్పిన విశేషాలు అన్నీ ఒక్కటి కూడా పొల్లు పోకుండా మా ఇంట్లో కూడా జరిగేవి. మీనుంచి మరిన్ని కబుర్లకోసం ఎదురు చూస్తూ ఉంటాను.

  Like

 4. చాలా బాగున్నాయి ఫణి గారు మీ అనుభవాలు. ఇన్ని అనుభవాలున్నాయని తెలిస్తే ఆనాడే మీ చేతనొక బ్లాగు తెఱిపించేవాణ్ణి.
  అమరావతి కథలకు పసలపూడి కథలు ధీటుగా లేవంటారు. ఆ వెలితిని మీరు పూర్చగలిగితే … 😉
  – రాకేశ్వర

  Like

 5. మాది అనాతవరమండీ. మేము క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళం సుబ్బరాయుడి షష్టి కి అమలాపురం.గురువు గారు మహదేవుడు గారు మా బాబయ్య గారు అవుతారు.మా నాన్నగారు క్రమం తప్పకుండా ప్రతీ యేడూ పూజ చేయించే వారు ఆరోజున.

  Like

 6. నమస్కారాలు… మీ జ్ఞాపకాలు బావున్నాయి.. మీరు ఖచ్చితంగా అమరావతి కథలు లాగ రాయగలరు. ఏలాగంటే.. మీరు ఈ టపాలో అన్ని పండగలు కలిపి రాసారు. అలా కాకుండా ఒక్కో పండుగని, ఒక్కో తిరణాలని, ఒక్కో విషయాన్ని తీసుకొని మరింత విపులంగా, వివరంగా రాస్తే…

  Like

 7. ఇవన్నీ ఒక ఎత్తూ, దీపావళి ఒక ఎత్తూ. దిపావళి వచ్చేముందరే సిసింద్రీలు( వాటిని ఆ రోజుల్లో మా ప్రాంతం లో తూరీగలు అనేవారు )ఎక్కడ తయారుచేస్తారో కనుక్కొనేవాళ్ళం. అవి రూపాయికి 100/200 లెఖ్ఖన అమ్మేవారు…. Wow.. మరి ఇప్పుడో?

  Like

 8. ఫణికుమార్ గారు,

  మీరు పంపిన లింక్ లో ప్రభల తీర్థం ఫొటోలు చూసి చాలా ఆనందించాను.

  Like

 9. నాగమురళి గారు,

  మీకు నేను రాసినది చదివిన తరువాత ఆనాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఈ నా ప్రయత్నం కొంతవరకూ ఫలించినట్లే.

  Like

 10. శ్రీను గారూ,

  చంద్రమౌళీశ్వరస్వామి గుడిలోనూ, సుబ్రమణ్యేశ్వర స్వామి గుడి లో నూ మీ బాబయ్య గారు శ్రీ మహదేవుడు గారి ని చూసేవాడిని. మా ఇంటికి శ్రీ తోపెల్ల ఆయన పూజలు చేయించడానికి వచ్చేవారు.

  Like

 11. రాకెష్ బాబూ,

  మరీ అంత కొండ ఎక్కించేయకు నాయనా.

  Like

 12. కృష్ణారావు గారూ,

  మీ అభిమానానికి ధన్య వాదాలు. నెను ఏదో గుర్తుకు వచ్చినవి వ్రాస్తున్నాను. నాకు అంత వివరంగా వ్రాశే జ్ఞానం లేదు.

  Like

 13. శ్రీ అశోక్ గారికి,

  ఇప్పుడు ఆ తూరీగలూ లేవూ, మతాబాలూ లేవు. పైరొటెక్నిక్స్, లేసర్ ల తో కడుపు నింపుకుంటున్నాము !!

  Like

 14. Thanks Aruna.

  Like

 15. చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు.
  చాలా బాగా రాస్తున్నారు కూడా.

  Like

 16. “చందమామలని” మేము “దొంగ” లనే వాళ్ళం. కాకపోతే ఆ దొంగ కోసం తగువులాడుకొనే వాళ్ళం. అందుకే మాకూ చదువబ్బలేదు 🙂

  Like

 17. భవానీ గారూ, ధన్యవాదములు.

  Like

 18. అసంఖ్య గారూ, మేము ” చందమామ ” ని సరస్వతిదేవి అనేవాళ్ళం.చెప్పేనుగా అవి ఎవరికీ తెలియకుండా తింటానికి కక్కూర్తి పడే ఇలా తయారయ్యాను!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: