బాతాఖానీ ఖబుర్లు


   నెను కొత్తగా బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. ఇన్నాళ్ళూ ఏదో ఇంగ్లీష్ లో రాసేవాడిని.ఎలాగోలాగ తెలుగు టైపింగ్ నేర్చుకొని ( దీనికి నన్ను ముందర కౌముది ఎడిటర్ శ్రీ కిరణ్ ప్రభ గారూ, శ్రీ వసుంధర గారూ ఉత్సాహ పరిచేరు).

    రిటైర్ అయ్యిన తరువాత కాలక్షేపం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే, బ్లాగ్ లు వ్రాయడం ఓ మంచి వ్యాపకం అని తెలిసింది.. మన మాట విని, విని ఇంట్లోవాళ్ళకి  బోర్ కొట్టేసింది. ఇంక ఊరి మీదకు వెళ్తే బాగుంటుందనుకొన్నాను. చదివిన వాళ్ళు చదువుతారు, లేకపోతే మానేస్తారు.ఇంకొకళ్ళని బాధ పెట్టనంతవరకూ మనం ఏదైనా వ్రాయచ్చని నా అభిప్రాయం.

 

ప్రస్తుతం తెలుగులో అన్నివిషయాలమీదా చాలా మంది వ్రాస్తున్నారు.రాజకీయాలు,సినిమాలూ,  సాహిత్యము,హాస్యమూ,కవితలూ  ఒకటేమిటి ప్రపంచం లో ఉన్న

 

ప్రతీ  సమస్య మీదా వాదోపవాదాలు చదువుతున్నాము. ఆ విషయాలమీద వ్రాసే ప్రజ్ఞ, సామర్ధ్యం ఎలాగూ లేదు. నాకు సంబందించిన విషయాల మీద మాత్రమే రాద్దామనుకొంటున్నాను..

 

  నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మాది కోనసీమ లోని  అమలాపురం. మా నాన్నగారు( శ్రీ సోమయాజులు గారు) అక్కడె చాలా కాలం హెడ్మాస్టర్ గా పని చేశారు. ఆయన ఎక్కడ ఉంటే నా చదువు కూడా అక్కడే ( పాస్ అవడం తేలిక ). మండపేట లో 4,5 ఫారమ్ లు చదివి ఆ తరువాత అమలాపురం లో చదివాను.

 

ఆరోజుల గురించి ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. కాలికి ఏదైనా బెణికితే మా అమ్మమ్మ గారు “ఇరుకు” మంత్రం, తేలు కుడితే ఓ మంత్రం వేసేవారు.

 

మోకాలు వాస్తే ఎవరో తరవాణీ అన్నం, చక్రకేళీ అరటిపండూ కలిపి అరటి ఆకు లో వేసి మోకాలి మీద కట్టమన్నారు. ఆకలి వేస్తే తినడానికి బాగుండేది! అమలాపురం

 

నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే  గోదావరి దాట వలసి వచ్చేది. రేవు దాకా బస్సు లో వెళ్తూఉంటె , ఆ టికెట్లు ఇచ్చే కండక్టర్ ని చూస్తూంటే , మనం కూడా పెద్ద అయిన

 

తరువాత ఆ ఉద్యోగం వస్తే బాగుండేదనిపించేది !!  అలాగే సినిమా టికెట్లు ఇచ్చేవాడు కూడా మనకి హీరో లా కనిపించేవాడు. ఇలా గుర్తు చేసుకొంటూ ఉంటే ఎంతో

 

బాగుంటుంది. ఆ రోజులు మళ్ళీ రావు.

30 Responses

  1. బాగున్నాయి సర్ మీ కబుర్లు. మరిన్ని కబుర్ల కోసం ఎదురు చూస్తున్నాం..

    Like

  2. బాగున్నాయి సర్ మీ కబుర్లు. మరిన్ని కబుర్ల కోసం ఎదురు చూస్తున్నాం..

    Like

  3. ఆ రోజులు తిరిగిరావుకానీ ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుని మాతొ మీరు ఆనందించండి.

    Like

  4. Oka vishayam mannavistaanu guruvu gaaru..
    Retire ayina vaalla ki blog laanti kaalakshepam oka manchi aayudam.
    Endukantaara? antha vayasu jeevitham gadipaarante.. enno kasta nastaalu padi vuntaaru jeevitham lo, aa anubhavaala nunchi enno nerchukuni vuntaaru.. aa anubhavamanthaa alaa meethone vundi pothe elaa? Maa laanti mee tarvuaathi taraaniki andinchaali gaa..
    anduke mee laanti vaaru vraase, cheppe prathi manchi kaburu eanthoo vupayogam.
    Meemu mee gurinchi korukunedi, meeru ennallu brathikithe annallu aarogyam gaa aanandam gaa vundaalani
    (naaku kalakaalam batakaalani korukovatam etc, ledu, ennallu brathiki naa okari ki vupayogapadettu vunte chaalu)

    Like

  5. good baagundi…………me anubhavaalu raayandi(andarila abhipraayalu kakunda

    Like

  6. సూపర్! “గుర్తుకొస్తున్నాయి….” టపాలు నాకు భలే ఇష్టం.. 🙂

    Like

  7. స్వాగతం అండీ,
    ఎవరికైనా ఎప్పటికైనా తలుచుకు మురుసిపోయే తరగని సిరి చిన్నానాటి జ్ఞాపకాలే కదండీ
    మీఅలాంటి పెద్దవారు చెపుతుంటే మరీ బావుంటాయి.

    Like

  8. సంతోషం. స్వాగతం. మీ అనుభవాల్ని గురించి చెప్పండి. మీ ఆలోచనలు కూడా!

    Like

  9. చాలా బాగున్నయి జ్ఞపకాల ఊసులు. మీ రచనాశైలి బాగుంది. ఇక మీరు మీ జ్ఞపకాలను రింగురింగులగా (పాత తెలుగుసినిమాలలో లాగా) తిప్పండి. చూసి/చదవి అనందీస్తాము. తప్పుగా భావించకపోతే, ఒక సూచన. మీ టాపాకి శీర్షిక “బాతఖానీ ఖబుర్లు” కన్నా, “కాలక్షేపం కబుర్లు” అనో, “”బాతఖానీ బఠాణిలు” అనో పెట్టెంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే, బాతఖానీ అన్నా, కబుర్లు అన్నా ఒకటేకదా!.

    అభినందనలతో…
    వల్లూరి సుధాకర్

    Like

  10. బావున్నయ్ మీ కబుర్లు..తప్పక రాస్తుండండి

    Like

  11. చాలా బాగారాసారండి

    Like

  12. మీ అనుభవాలు మరో అమరావతి కథలు లాగ…. కోనసీమ కథలు కావాలి.

    Like

  13. ప్రదీప్, అమ్మ ఒడి, శ్రీ, వినయ్ చక్రవర్తి, గోపాల కృష్ణ కోడూరి, లలితా,కొత్తపాళీ, కిరణ్, నేస్తం గార్లకు ధన్యవాదములు. మీ అందరి అభిమానం తో ఇంకా ముందుకు వెళ్ళ గలనని విశ్వాసం వచ్చింది.

    Like

  14. namaskaaram sir!
    chaala baagundi..sir….continue cheyyandi..
    mee naresh rgukt

    Like

  15. నమస్కారం ఫణి బాబు గారు,
    మీరు బ్లాగు ఎప్పుడు మొదలు పెట్టనున్నారా అనుకున్నాను. మొదలు పెట్టినందుకు సంతోషం. మీ బ్లాగు చదువుతుంటే, మీతో ప్రత్యక్షంగా మాట్లాడడం వలనేమోగాని, మీ నోట వింటున్నట్టే వుంది 🙂
    -రాకేశ్వర

    Like

  16. WELL SIR, VERY GOOD

    Like

  17. నమస్కారం. బ్లాగులోకానికి స్వాగతం.

    Like

  18. welcome to this virtual world sir….

    Like

  19. నరేష్, రాకేష్,అర్జున్, భవానీ,కృష్ణారావు,ఐ యామ్ హరీష్ లకు ధన్యవాదములు.

    Like

  20. namste phani babu gaaru,
    meeru meerena ani chuusaanu, meeru meere ani telisindi. SWATI pustakam loa kotikommachchi seershikaloa mee letter chusaanu. adikuuda baagumdi. amte idi baagundi
    sailaja

    Like

  21. hello sir,nenu kudaa kotta ga e blog start chesanu.nenu gurtunnana madhu,eemadhumasamloo blog spot.mi kaburlu chalabavunnayi uncle.chaduvutunte kallamundu anni kanipistunnayi…roju mi kaburla kosam chustanu.

    Like

  22. శైలజా,

    పోన్లే అమ్మా.వీడెవడు, ఎక్కడో చూసినట్లుగా ఉందీ అనుకున్నావన్నమాట. Thanks.

    Like

  23. మధూ,

    గుర్తున్నావమ్మా.నీవు కొత్తగా బ్లాగ్ మొదలెట్టినప్పుడు అది కూడలి లో ఎలా కనిపిస్తుంది అని అడిగినప్పుడు, ఏదో పెద్ద నాకేదో తెలిసినట్లుగా మెయిల్ పంపానుగా!!

    నీలాగ ఎదురు చూసేవాళ్ళు ఉండాలేగానీ, రాయడానికి బొల్డంత ఉంది.

    Like

  24. mI kAlakShepaM kaburlu cAlA bAgunnai. mAlguDi DEs lAga tayArucEyDaniki prayatniMcu.

    -rAmaM

    Like

  25. PHANI BABU GARU MEE CHINNANATI MUCHATLU MATHO PANCHUKOVADAM NAAKU CHALA ANANDHAM GA VUNDHI.MAA CHINNANATI VISHAYALU GURTHUKOSTHUNNAI…EE VAYASULO MEERU THEESYKUNNA EE NIRNAYAM BAGUNDHI.WISHING YOU BEST OF LUCK.

    Like

  26. p.p.srinivas,

    Sorry for responding so late. Thank you very much.

    GOD BLESS YOU.

    Like

  27. Mee laanti pedda vaallu mee gnapakaalanu,anubhavaalanu maatho panchukovatam nijam gaa oka manchi vishayam.

    Dhanyavaadamulu.
    Sharma

    Like

  28. Sharma,
    Thanks. Hope you enjoy my posts.

    Like

  29. మీ రచనా శైలి బాగుంది. హాస్యం పండుతోంది. అయితే మీది అమలాపురం అన్నమాట. మేము ఇదివరకు బండారులంకలో ఉండేవాళ్ళం. తర్వాత రావులపాలెం వచ్చేసాము. ప్రస్తుతం మాత్రం రాజమండ్రి కి దగ్గరలో ఉంటున్నాము.

    Like

  30. శ్రీ వాసుకీ,

    మొత్తానికి కోనసీమని, తూ.గో.జీ నీ వదలడం లేదన్నమాట ! నాకు గోదావరి అన్నా, తూ.గో.జి అన్నా,మరీ కోనసీమ అన్నా ప్రాణం.

    Like

Leave a comment