తెలుగువాళ్ళకి ములక్కాడలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అదేం ఖర్మమో ఈమధ్యన మార్కెట్ లో వాటి ధర కొండెక్కేసింది. మరీ పావుకిలో 20 రూపాయలంటే కొనే పరిస్థితా మనది? ఏదో చవకలో దొరికితే కొనొచ్చు కానీ, మరీ కిలో 80 రూపాయలంటే, కొని పూజ చేయాలనిపిస్తుంది. ఈలోపులో అవి ఎండిపోయి, నా వయస్సుకి వచ్చేస్తాయి, అది వేరే సంగతనుకోండి. దానితో ఈమధ్యన మార్కెట్ కెళ్ళినప్పుడల్లా, దూరం నుంచే చూసేసి, “మమ” అనుకొని వచ్చేస్తున్నాను. అంతేసి డబ్బులు పెట్టి [...]
Filed under: Uncategorized | 5 వ్యాఖ్యానాలు »