బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయినా సరే బతికేస్తున్నాం…

   తెలుగువాళ్ళకి ములక్కాడలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అదేం ఖర్మమో ఈమధ్యన మార్కెట్ లో వాటి ధర కొండెక్కేసింది. మరీ పావుకిలో 20 రూపాయలంటే కొనే పరిస్థితా మనది? ఏదో చవకలో దొరికితే కొనొచ్చు కానీ, మరీ కిలో 80 రూపాయలంటే, కొని పూజ చేయాలనిపిస్తుంది. ఈలోపులో అవి ఎండిపోయి, నా వయస్సుకి వచ్చేస్తాయి, అది వేరే సంగతనుకోండి. దానితో ఈమధ్యన మార్కెట్ కెళ్ళినప్పుడల్లా, దూరం నుంచే చూసేసి, “మమ” అనుకొని వచ్చేస్తున్నాను. అంతేసి డబ్బులు పెట్టి [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొంపలో అన్నీ బావున్నంత కాలమే…..

   ఇంత వయస్సొచ్చిన తరువాత, వయస్సులో ఉన్నట్టుండమంటే కష్టమే కదూ! ఏదో మరీ మంచం పట్టకుండా, మన పన్లు మనం చేసికుంటూంటే, మనకీ, మన చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం. ఏవో చిన్నా చితుకూ వస్తూనే ఉంటాయి. అలాటప్పుడే చిరాకులూ పరాకులూనూ. ఏం చేస్తాం ఏదోలా కాలక్షేపం చేసేయాలి. మనకైతే ఏ కాలినొప్పో, రొంపో, లైట్ గా జ్వరమో వస్తే, దగ్గరలో ఉన్న ఏడాక్టరు దగ్గరకో వెళ్ళడమో, కాదూ కూడదనుకుంటే, ఏవో OTC మందులేసికోవడమే. పనైపోతుంది. కానీ మరీ అలవాటు చేసేసికుంటే, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మరీ అంత sensationalism… అవసరమంటారా…

Bhopal    ఈవేళ ప్రొద్దుట అదేదో చానెల్, TV 9 అనుకుంటా, ఓ కార్యక్రమం వస్తోంది. దాంట్లో ఈమధ్యన నార్వే లో , భారతీయ సంతతికి చెందిన, ఇద్దరు చిన్నపిల్లల సంరక్షణా భారం గురించి, జరిగిన సంఘటన గురించి, ఓ కార్యక్రమం చూపించారు. వీళ్ళ కార్యక్రమం చూసినవారనుకుంటారూ, ఏదో మన దేశంలోనే, చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయన్నట్టూ, వాటిని అందరూ యతాతథంగా పాలిస్తున్నట్టూ, ఓ పేద్ద ఇమేజ్ తయారుచేసేశారు. మన ఆచారవ్యవహారాలూ, సంప్రదాయాలూ, అలవాట్లూ చూసుకుంటే, నార్వే ప్రభుత్వం [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నిన్నటి రోజున నేను వ్రాశినటపా మీద ఓ వ్యాఖ్య వచ్చింది. శ్రీ బాపు గారి గురించి సాక్షి పేపరులో వచ్చిన కార్టూన్ లింకు ఇచ్చారు. మళ్ళీ మీరందరూ, ఆ లింకేమిటో అని ఖంగారు పడేబదులుగా, అదేదో నేనే పెట్టేస్తే బావుంటుందని, ఆ కార్టూన్ పైన ఇచ్చాను. ఎంత apt గా ఉందో కదూ !! ఇంకో విచిత్రం ఏమిటంటే, ఈ వ్యాఖ్య పెట్టిన వారి పేరు “బాపు”, ఆయన మెయిల్ ఐడీ లో రమణగారి పేరుండడం. ఈవేళ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

NLaw    నేను ఓ వారం రోజులపాటు బ్లాగులు వ్రాయకపోవడానికి, ఆయనెవరో పెట్టిన వ్యాఖ్య ఓ పేద్ద కారణం కాదు.It was purely coincidental… ఏదో మూడ్ లేక వ్రాయలేదు. కానీ, నిన్నటి టపా చదివినవారి సంఖ్యా, వ్యాఖ్యలూ చదివిన తరువాత అనిపించింది– ఇంక మిమ్మల్ని వదిలేది లేదూ.. అని. ఏదో అసలు ఉండేదెంతకాలం, అందులో మళ్ళీ మూడ్లూ, అలకలూ అంటూ కూర్చుంటే మీరందరూ సుఖపడిపోరూ? వామ్మోయ్, నేను వ్రాస్తూనే ఉంటాను, మీరు భరించకా తప్పదు…     నిన్న [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇలా అయితే కష్టమే కదండీ….

    ఓ వారం అయింది టపా వ్రాసి. మనం టపాలు వ్రాయకపోతే, ప్రపంచం ఏదీ ఆగదు. పైగా ఎవరి పని వాళ్ళు హాయిగా చేసికుంటారు. నాకైతే పనేమీ లేదు కానీ, మిగిలినవారికి ఏదో ఒక వ్యాపకం ఉంటుందిగా. ఏదో మన టపాలు మిస్ అవుతున్నారూ అందరూ, అనుకోడం ఓ తృప్తీ. నిజం చెప్పాలంటే అలాటిదేమీ ఉండదు. పాపం ఆయనకెవరికో ( పేరు కూడా వ్రాసుకోలేని దుస్థితి పాపం ఆయనది) నెత్తిమీద ఇంకా బొచ్చొచ్చుండాలి ఈ వారం లోనూ! [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ఓ మనిషవ్వొచ్చు, కొట్టవ్వొచ్చు, అనుబంధం అనుబంధమే….

Manney’s     ప్రతీ మనిషికీ చిన్నప్పటివో, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటివో, ఎన్నెన్నో జ్ఞాపకాలుంటాయి. పైగా ఓ మనిషి కానీ, ఓ సంఘటన కానీ, తన జీవితంలో ఒక మార్పుకి గురి అయినదైతే అసలు మర్చిపోలేము. అలాగే ఏ స్కూలుకెళ్ళేటప్పుడో దారిలో ఉండే కొట్టనండి, ఓ సినిమా హాలనండి , సావకాశంగా కూర్చున్నప్పుడు గుర్తొస్తూంటాయి. ఎప్పుడో, సంవత్సరాల తరువాత ఓ సారి చూసొద్దామని వెళ్తే అక్కడేముంటుందీ? ఆ కొట్టు స్థానంలో ఓ మాలూ, సినిమా హాలు స్థానం లో [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Exchange Offers….

   ఇదివరకటి రోజుల్లో ఇంట్లోకి ఏదైనా electronic item కొనడమే కష్టమయ్యేది. కారణం మరేమీ లేదూ, కొనే “ఒపిక” or “ఆర్ధిక స్థోమత” లేక! పైగా ఆరోజుల్లో ఇప్పటిలాగ instalments వగైరా ఉండేవి కావూ, అరువులాటిదీ దొరికేది కాదు. రెండు మూడేళ్ళు ఏదో కూడబెట్టి కొనుక్కోవడమే. నేను చెప్పేది నమ్మకపోతే, మీ ఇంట్లో ఉండే పెద్దాళ్ళని అడగండి, మీ ఇంటికి మొట్టమొదటి ఫ్రిజ్ ఎప్పుడొచ్చిందీ, మిక్సీ ఎప్పుడొచ్చిందీ, అంతదాకా ఎందుకూ టేబిల్ ఫాన్ ఎప్పుడొచ్చిందీ అని! వాళ్ళూ పాత [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఏంచేయగలం…

   ఇదివరకటి రోజుల్లో మార్కెట్ వాతావరణం మరీ అన్యాయంగా ఉండేది కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, బజార్లోకెళ్ళి ఏదైనా వస్తువు కొని, ఇంటికెళ్ళిన తరువాత దాంట్లో లోపం ఏదైనా కనిపిస్తే, కొట్టువాడు తిరిగిచ్చేవాడు. దానికో కారణం మనుష్యులు మరీ వ్యాపార దృష్టితో కాకుండా, కొద్దిగా మానవత్వం, ఒకళ్ళమీదొకళ్ళకి నమ్మకం గట్రా ఉండడం. కానీ ఈరోజుల్లో ఎక్కడ చూసినా, అంతా consumerism. ఆ పాడైన వస్తువు తిరిగి పుచ్చుకుంటే మనకేమైనా లాభం ఉందా, అసలు ఆ వచ్చినవాడు నమ్మదగ్గవాడేనా etc..etc.. [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అమ్మయ్య సుఖపడ్డాడు…

   అదేదో ఓవర్లు తక్కువ చేశాడని, నాలుగో టెస్టు ఆడకూడదని మన so called cool captain ధోనీ మీద ban పెట్టారుట ! సుఖపడ్డాడు. అందరికీ సమాధానాలు చెప్పుకోలేక ప్రాణం మీదకొస్తోంది! ఓ గొడవోటి వదిలింది. మన మీడియాల్లో అదేదో “అగ్నిపథ్ సీరీస్ ” అని పేరోటీ! ఇంకోడెవడో కాప్టెన్ అయితే ఏదో మొహమ్మాటానికి నెగ్గినా నెగ్గొచ్చు. కానీ మనవాళ్ళు అనుకోవాలిగా అలాగని. ఓడిన ప్రతీమాటూ ఒకటే మాట- It is one of those things.. [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers