డిశంబరు దగ్గరకొస్తోందంటే చాలు, మాకు అమలాపురం లో హడావిడే హడావిడి. స్కూలుకెళ్ళే దారిలో సుబ్బారాయుడి గుడుంది. పెద్దాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడూ అని అనేవారనుకోండి, కానీ పిల్లలందరికీ సుబ్బారాయుడే! ఆ గుడేమీ మరీ పెద్దది కాదు ఆ రోజుల్లో. ఈమధ్యన 50 ఏళ్ళ తరువాత చూసేసరికి, సదుపాయాలెన్నో చేశారు. ఆ రోజుల్లో, సుబ్బారాయుడి షష్టికి స్కూలు శలవు. అంతకుముందు ప్రతీ రోజూ స్కూలికి వెళ్ళేటప్పుడు, కొట్లవాళ్ళు, పందిళ్ళు వేస్తూ కనిపించేవారు. అబ్బో ఎన్నెన్ని కొట్లో! అటు స్కూలుదాకా, ఇటు చెరువు [...]
Filed under: Uncategorized | 6 వ్యాఖ్యానాలు »