బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సహనం, ఓర్పూ….

    మా చిన్నప్పుడు, ఇంట్లో ఏదైనా అల్లరి చేసినా, ఏ ఆటవస్తువో పాడిచేసినా, చివరాఖరికి ఏ సైకిలో నేర్చుకుంటూ దెబ్బ తగుల్చుకున్నా, ఇలా రాసుకుంటూ పోతే, మగ జన్మెత్తినందుకు, తండ్రి చేతిలో దెబ్బలు తినని వాడెవ్వడూ ఉండడు. చదువుల్లో మార్కులు తక్కువరావడం అన్నది ఓ evergreen बहाना ! అందులో నాలాటివాళ్ళకైతే ఓ అలవాటైపోయింది. అలాగని ఆ తండ్రి అనబడే ఆయన రాక్షసుడేం కాదు. ఏదో పిల్లాణ్ణి నాలుగు తగిలిస్తే బాగుపడి, ప్రయోజకుడౌతాడని ఓ అపోహ! మళ్ళీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం చేస్తారు, భరించాలి.. తప్పదు మరి….

   ఏమిటో గత నాలుగు రోజులనుండి, టపా వ్రాయడానికి మూడ్డే రావడం లేదు. ఏదైనా ఎక్కువ అయితే అలాగే ఉంటుందేమో? ఇంకా రెండున్నరేళ్ళు పూర్తవలేదు, మరీ 675 టపాలు కొంచం ఎక్కువైపోలేదూ? ఏదో అభిమానం కొద్దీ చదువుతున్నారు కదా అని, మిమ్మల్నందరినీ ప్రతీ రోజూ బోరుకొట్టేయడం భావ్యం కాదని, నోరుమూసుక్కూర్చున్నాను. కానీ ఈ వ్యసనం లోంచి బయటపడ్డం అంత సులభం కాదని తెలిసింది. ఇదిగో మళ్ళీ ప్రారంభం! ఏదైనా సరే “అతి” అయితే, చిరాకేసికొస్తుంది.ఒక్కొక్కప్పుడు, అది నెగెటివ్ గా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–An exhaustive note for pre- 2006 Pensioners….

PPO    నా టపాలు చదివేవారు కానీ, చదువుతున్నవారి తల్లితండ్రులకు కానీ, పైన ఇచ్చిన pdf ఉపయోగిస్తుందేమో ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా పెన్షన్ ఎకౌంటు భార్యతో జాయింటు ఎందుకు చేయాలో వివరించారు. పైన ఇచ్చినదే కాకుండా, కేంద్రప్రభుత్వ పెన్షనర్ల వివరాలు ఇక్కడ మళ్ళీ ఇక్కడా చూసుకోండి. నా స్నేహితుడొకరు నాకు పంపించగా, మీ అందరితోనూ పంచుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఉపయోగిస్తే సంతోషం. 2006 తరువాత రిటైరయినవారికి సమస్యలేదు, వచ్చిన గొడవల్లా, అంతకుముందు రిటైరయినవారికే. ఎవడూ మన మాట వినడూ, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అప్పుడూ.. ఇప్పుడూ…

   ఇదివరకటి రోజుల్లో పిల్లాడో పిల్లదో చదువు సందర్భంలోనో, ఉద్యోగసందర్భం లోనో, ఎక్కడో దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు, వీళ్ళెళ్ళిన ఊళ్ళల్లో, వాళ్ళకి తెలిసిన ఏ చుట్టానిదో, స్నేహితుడిదో ఎడ్రసో, ఫోన్ నెంబరో సంపాదించి, వాళ్ళకి ఉత్తరం వ్రాసో, ఫోను చేసో చెప్పేవారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, ఏదో ఒకళ్ళైనా తెలిసినవారుంటే మంచిదీ అని. అంతేకానీ, వీళ్ళ పిల్లలకి ఆ అవతలివాళ్ళేదో ముద్దచేసి భోజనం పెట్టాలనీ, బ్రష్షుతో పళ్ళు తోమాలనీ, ఒళ్ళు తోమి స్నానం చేయించాలనీ కాదు! ఎప్పుడెలాటి [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్న ఓ టపా వ్రాశాను ‘పేర్లతో పిలుచుకోడం’ అని. దానిలో ప్రస్తావించిన విషయాలే ఈవేళ ప్రొద్దుట, ప్రత్యక్షంగా వినడం/చూడ్డం తో, అబ్బో ఫరవాలేదూ, నేనూ ఏదో విషయాన్ని గురించి వ్రాయకలనూ అనిపించింది. అదేదో ” live show” లా అనిపించింది. ఈవేళ మా “ఇన్వర్టర్ డ్యూటీ ” ( గుర్తుండే ఉంటుంది, కొడుకూ,కోడలూ బిజీగా ఉండడంతో, మనవడికీ, మనవరాలికీ తోడు అన్నమాట!). మరీ అలాటి మధుర క్షణాల్ని అలా పిలుస్తారేమిటీ అని కోప్పడకండి. ఎంత ఆనందం, మధురమైనా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   క్రిందటి వారంలో వ్రాసిన టపాలమీద, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలొచ్చాయి. వాటిమీద నా స్పందన వ్రాయడం ఆలశ్యం అయినందుకు కోప్పడకండి. పీత కష్టాలు పీతవీ ఏం చేస్తాం? మా అబ్బాయి ఇదివరకు ఏదో ఓ కంపెనీలో పనిచేయడం వలన, పూణె లో జరిగే క్విజ్జు పోటీల్లో, వాళ్ళ కంపెనీ తరఫున పాల్గొనేవాడు. Tata Crucible, Landmark, Brand Equity వగైరాల్లాటివి. ఇవేకాకుండా, పూణె లో ఎక్కడ క్విజ్జు జరిగినా మావాడు, దానిలో పాల్గొనాల్సిందే. చాలావాటిల్లో నెగ్గాడనుకోండి.Landmark క్విజ్జులో క్రిందటేడాది [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పేర్లతో పిలుచుకోడం….

   ఇదివరకటి రోజుల్లో ఏదో పెళ్ళిసంబరాల్లో భాగంగా, కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకులచేత, గడప దగ్గర ఒకళ్ళపేర్లొకళ్ళు చెప్పడం అదో ముచ్చట. అప్పుడు కూడా, పెళ్ళికూతురు మహ సిగ్గు పడిపోయి, చెప్పేది. ఒక్కొక్కప్పుడైతే, అతని పేరు అర్ధం వచ్చేటట్లుగా, సరదాగా ఓ పద్యమో, పొడుపుకథో చెప్పేది. అవన్నీ ఇప్పుడు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడో, అసలా ముచ్చట అవసరమే ఉన్నట్లు లేదు. అక్కడికేదో ఒకరి పేరొకరికి తెలియదని కాదూ, పెళ్ళిలో అదో తంతు. అయినా ఈ రోజుల్లో సుముహూర్తం, వధూవరుల మధ్యలో [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉన్నమాట చెప్పుకోకూడదుట….

   వామ్మోయ్ కడుపులో ఇంత దాచుకుందన్నమాట మా ఇంటావిడ ! ఏమిటో అమాయకురాలూ, చెప్పిందేదో చేసేయడం అనుకునేవాడిని. ఏదో బ్లాగులువ్రాయడం వచ్చేసింది కదా అని, అలా వ్రాసేయడమే? పెద్దా చిన్నా అంతరం ఉండొద్దూ? అసలు నా టపాలో , ఉన్నమాటేదో ఒప్పుకోవాలికదా అని “నా అస్థిత్వానికి మూల కారణం, మా ఇంటావిడే” అని వ్రాసుకున్నాను. నిజం చెప్పడం కూడా తప్పే అని, ఆవిడ వ్రాసిన టపా ధర్మమా అని తెలిసింది. ఔనులెండి, ఈ రోజుల్లో ఉన్నదున్నట్లు ఒప్పుకునేవాళ్ళే కనిపించడం [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–of all the things… డయపర్ల గురించి…

    మా చిన్నప్పుడు, చిన్నపిల్లల్ని కింద ఏమీ వేయకుండా ఉంచినా , పేద్దగా అనుకునేవారు కాదు. కానీ, ఇప్పుడో తల్లి ఒడిలో ఉన్నప్పుడు తప్పిస్తే, పాకడం మొదలెట్టేటప్పటికి, వంటి మీద గుడ్డలేకుండా వదలరు. పైగా ఆ కిందేసీ చెడ్డీ లోపల డయపర్లోటి! వాళ్ళు చెడ్డీ చాలాసార్లు తడిపితే, అస్తమానూ మార్చలేక, ఓ లోపల ఓ డయపరోటి వేసేసి ఉంచేస్తారు. చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రక్రియ పెద్దవారి convenience కోసం మాత్రమే. కానీ దీనివలన జరుగుతున్నదేమిటయ్యా అంటే, ఆ పిల్లో, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–moral support

    ఒక వయస్సు వచ్చిన తరువాత, ఇంకోళ్ళకి ఏదో moral support తప్ప ఇంకోటి ఇవ్వలేము. ఓపికుందా నాలుగు మంచి ముక్కలు చెప్పడం, ఇష్టం ఉందా వింటారు, లేదా తలూపేసి ఊరుకుంటారు. మరీ తన్ని తగలెయరులెండి. వయస్సులో ఉన్నప్పుడైతే, అవతలివాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, మన తాహతుని బట్టి, ఆర్ధిక సహాయం చేయగలమేమో. నాకు అలాటి అవకాశం ఎప్పుడూ రాలేదు భగవంతుడి దయ వలన. ఏమో, అలాటి అవసరం వస్తే, చేసుండేవాడినో లేదో, ఏదో చేసేద్దామని ఉన్నా, [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers