బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–feel good….

    ఈమధ్యన SBI కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, అదీ మా ఇంటావిడని తీసికునీ. ఏం లేదూ, ఎప్పుడో “స్వర్ణయుగం” రోజుల్లో, తనకీ, ఓ ఎకౌంటు తెరిచి, దాంట్లో డబ్బులేసేవాడిని లెండి. దాని ATM CARD నాదగ్గరే ఉండేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎప్పుడూ బ్యాంకులకీ వాటికీ వెళ్ళే సద్గుణాలు మా ఇంటావిడకి లేవు, పాపం వెర్రి ఇల్లాలు! అన్ని రోజులూ మనవే కావుగా, రోజూ ఆ టీవీ లో సీరియళ్ళూ అవీ చూస్తూంటుందిగా, ఎందుకైనా మంచిదీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమైపోయాననుకుంటున్నారా గత ఆరు రోజులనుంచీ? ఏమీ అవలేదు, నా కంప్యూటరు కి “జ్వరం” వచ్చేసింది. ఇదిగో ఈవేళే “డాక్టరు” వచ్చి ఓ డోస్ వేసి వెళ్ళాడూ, మళ్ళీ ప్రారంభం! మనలో మనమాట, మీ అందరూ అనుకునుంటారు కదూ ” అమ్మయ్యా, ఈయన గొడవోటి వదిలిందీ.అబ్బ ఎంత refreshing గా ఉందో ఈ ఆర్రోజులూ” అని! అమ్మ! అంత సుళువుగా వదులుతానా నా బంధువుల్నీ?    చెప్పాలంటే, నా కంప్యూటరుకి ఏమీ పేద్ద రోగం రాలేదు. ఓ దుర్ముహూర్తాన్నా, డెస్క్ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..

    ఏమిటీ ఈవేళ ఏదైనా స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోని “most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..” గురించేమైనా పాఠాలు చెప్తాడా ఈయనా అని ఊరికే ఖంగారు పడకండి! నాకు అలాటి జ్ఞానబోధలు చేసే అలవాటూ లేదూ, అంత జ్ఞానమూ లేదూ, ఓపికా లేదు. నేను చెప్పేది, సాదా సీదా ఓ ఆడపిల్ల మామూలు NTP conditions అంటే, పాతికేళ్ళో, మహా అయితే ఇంకో రెండేళ్ళకో, పెళ్ళి చేసికుని, 30 ఏళ్ళకి ఒకరో ఇద్దరో పిల్లల్ని కని, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అమ్మయ్య, ఓ గొడవొదిలింది….

    మనవాళ్ళు, ఇంగ్లాండులో మొత్తం నాలుగు టెస్టులూ శుభ్రంగా ,మళ్ళీ ఏ తేడా పాడా లేకుండా, హాయిగా ఓడిపోయి, ఓ ఉపకారం చేశారు! ఏదో 2-1,అయితే, మనమే మొదటి స్థానంలో ఉండేవారమట! పోన్లెండి అటువంటి ఇరకాటంలో పెట్టకుండా 4-0 తో ఓడిపోయి, మూడో స్థానానికి వచ్చేశారుట. ఉత్తినే మొదటి స్థానంలో ఉండుంటే దాన్ని కాపాడుకోడం మాటలా ఏమిటీ? మూడో స్థానమైతే కొంత టైమేనా ఉంటుంది, ఈ లోపులో జింబాబ్వేనో, బంగ్లాదేశ్ తోనో ఆడి ఓ నలుగైదు పాయింట్లు [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పోస్టు మార్టాలూ ప్రీమార్టాలూ….

    పోస్టుమార్టాలని విన్నాము కానీ, ఆ రెండోది అదే ప్రీ మార్టం అనేది ఉపయోగిస్తారో లేదో తెలియదు. పోన్లెండి ఏదో ఒకటీ, ప్రీ అంటే ముందరా, పోస్ట్ అంటే తర్వాతా అని తెలుసునుగా, అది చాలు ! ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా ఓ యాక్సిడెంటులాటిది జరిగిందనుకోండి, ప్రతీవాడూ చెప్పేవాడే- అలా చేయకుండా ఉండవలసిందండీ, కొద్దిగా జాగ్రత్త తీసికుంటే బావుండేదిగా, ఏమిటో ఈ రోజుల్లో ఇంకోళ్ళ మాటవినే శ్రధ్ధా, ఓపికా ఎవరికుంటుందీ, ఎవరికి వాళ్ళు వాళ్ళంత తెలివైనవాళ్ళు ప్రపంచంలో [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

   ప్రొద్దుటినుండీ ఇంట్లోనే ఉండిపోయాము.టి.వీ. చూద్దామా అంటే ఒకటే విషయంగా, దానిమీద అంత పెద్ద ఆసక్తేమీ లేదు. పోనీ సరదాగా క్రికెట్ టెస్ట్ చూద్దామా అంటే, దాంట్లోనూ మనవాళ్ళేమీ పొడిచేయలేదు. మొత్తానికి 300 దాకా చేరారు. ఎక్కడక్కడే సంతోష పడాలి లెండి.     ఇంకేం చేద్దామా అనుకున్నంతలో, మా ఇంటావిడ, రిమోట్ తో అన్ని చానెళ్ళూ వెదుకుతూ నన్నూ పిలిచింది. కారణం మరేమీ లేదు- భేజా ఫ్రై లో నటించిన వినయ్ పాథక్ నటించిన సినిమా ఒకటొస్తోంది. సినిమా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–We eat లంచం,We breathe లంచం,We live లంచం….

    పుట్టినప్పటినుంచీ ఏదో ఒక లంచానికి అలవాటుపడ్డవాడే ప్రతీ వాడూనూ. మళ్ళీ ,ఏదో కొత్తగా కనిపెట్టినట్లు ఈ గొడవేమిటీ అసలు? ఆ ఆదం ఆపిల్ పండు లంచం ఇవ్వడంతో ప్రారంభమయింది ఈ సృష్టి. జీవితాంతం ఆ లంచంతోనే బ్రతకాలి. ఎక్కడ లేదూ లంచం? పెళ్ళానికి లంచం ఇవ్వకపోతే, అసలు దగ్గరకేరానీయదు,ఇంక సృష్టెక్కడ?ఓసారి కోప్పడి చూడండి, ఏదో కారణం చెప్పి, ఈవేళ ఏమిటో మూడ్ బాలేదండీ, అంటుంది. ఆ మూడ్ బాగుచేయడానికి ప్రతీ భర్తా ఏదో ఒక టైపు [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చాలామందికి నచ్చకపోవచ్చు…

   నిన్న సాయంత్రం మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాము.అవి ఇవీ కబుర్లు మొదలెట్టగానే ఆయన అడిగారూ- అన్నా హజారే దీక్ష మీద మీ అభిప్రాయం ఏమిటీ అని.నాకేమీ అంత ఆసక్తి లేదండీ అనగానే ఆయన కొద్దిగా ఆశ్ఛర్యపోయి, అదేమిటండీ, దేశమంతా అలా అట్టుడికిపోతూంటే, మీరలాగ అంటారేమిటీ,అన్నారు.నాకు ఆ విషయం మీద ఏదైనా ఆసక్తి ఉన్నా లేకపోయినా ,జరిగేది జరక్క మానదు కదా.అయినా ఎవరి అభిప్రాయాలు వారివీ, హాయిగా ఏవో కబుర్లు చెప్పుకోకుండా, ఈ గొడవంతా ఎందుకూ అన్నాను.ఆయన కొద్దిగా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఎందుకొచ్చిన గొడవలండి బాబూ…

.     కొడుకో. కూతురో కొత్తగా కారు కొన్నారనుకోండి, అమ్మా నాన్నల్ని లాంగ్ డ్రైవ్ పేరుతో, బయటకు తీసుకుపోతారు. కొత్తకారులో పెళ్ళాన్ని ముందర కూర్చోపెట్టుకోవాలిగా,జీవితాంతం ఉండేది ఆ పిల్లే, పైగా ఈ.ఎం.ఐ లు ఆ పిల్ల జీతంలోంచి కడుతున్నాడాయే, దానితో అమ్మా నాన్నా బ్యాక్ సీటు! అప్పుడు మొదలౌతుంది, తాపత్రయాల ఫినామినన్.కొడుకు ఇగ్నిషన్ తిప్పి కారు స్టార్ట్ చేయడం మొదలు, ప్రతీ టర్నింగులోనూ, ప్రతీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరా, ఊరికే నస పెట్టేస్తాడీయన. అంత స్పీడొద్దూ, మెల్లిగా.. [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మా కోడలు చి.శిరీష, ఎక్కడికైనా ప్రోగ్రాం వేసిందంటే చాలు, రెండు రోజులు ముందునుండీ, ప్రిపరేషన్లు ప్రారంభిస్తుంది. ప్రతీ చిన్న విషయం మర్చిపోకుండా, ఎవరెవరికి ఏమేం కావాల్సొస్తుందో, అన్నిటినీ రెడీ చేయడం. ఓ చెక్ లిస్ట్ తయారుచేసికుని, అన్నీ మెథాడికల్ గా చేయడం. అలా రెండు రోజులు ముందుగానే అన్నీ రెడీ చేసేసికుని, శనివారం ప్రొద్దుటే ఏడున్నరకల్లా అందరినీ కారులో కూర్చోపెట్టేసింది. ఛైల్డ్ సీట్ తీసేయడంతో, మాఇద్దరికీ సౌకర్యంగానే ఉంది. పిల్లలిద్దరూ మాతోనూ, వాళ్ళిద్దరూ ముందరా కూర్చుని, అనుకున్న [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers