బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సెంటిమెంటల్ బక్రాలు…..

   మిగిలిన వారి గురించి అంత తెలియదు కానీ, ప్రపంచంలో మనంత సెంటిమెంటల్ బక్రాలు ఇంకెక్కడా ఉండరేమో అనిపిస్తూంటుంది. మనం పెరిగిన వాతావరణమంటారా, మనకి చిన్నప్పటినుండీ మన తల్లితండ్రులు చేసిన బ్రెయిన్ వాష్ అంటారా? నేనేమీ నాస్థికుడను కాను.దేముడంటే భయం భక్తీ కావలిసినంత ఉన్నాయి.వీలున్నప్పుడల్లా గుళ్ళకీ,గోపురాలకీ వెళ్తూంటాను. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది – దేముడి పేర మనల్ని ఎంతమంది,exploit చేసేస్తున్నారో, అన్నీ తెలిసికూడా మనం succumb అయిపోతున్నామో అని.    దేశంలో ప్రముఖ దేవాలయాల్లో చాలా చోట్ల (ఎక్కడో ఒక్కటీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-One must come out of shell…

   గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నంతకాలం, మాకు ఆరోజుల్లో వచ్చే జీతాలతో, ఏదో అత్యావశ్యకమైన వస్తువులు తప్పించి, మరీ లగ్జరీ వస్తువులవైపు దృష్టి మళ్ళేది కాదు. అవే లగ్జరీ వస్తువులు ఈ రోజుల్లో నెసెసిటీస్ అయిపోయాయి, అది వేరే సంగతి.ఆరోజుల్లో, ఓ ఫ్రిజ్ కొనాలంటే, ఏ ఆల్వినో, గాద్రెజో,కెల్వినేటరో. అదికూడా 165 లీటర్లు. ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందీ అంటే, వాళ్లు ఓ క్లాసు పైన ఉండేవారు. ఫ్రిజ్ కొన్నారు కదా అని, దాన్నిండా ఏవేవో పెట్టేశారనుకోకండి, మా బాస్ ఒకాయనుండేవాడు, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అసలు ఆయన్ని ఎందుకు కలుసుకోవాలీ…

   అసలు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారిని “హాస్య రచయిత” అని ఎవరనమన్నారు? అప్పుడేమో కోతికొమ్మచ్చి వ్రాసి ఏడిపించారు, ఇప్పుడేమో, పేద్ద పనున్నట్లు వెళ్ళిపోయి ఏడిపిస్తున్నారు.. పాఠకుల పట్ల ఆ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలాగండి బాబూ? హన్నా! ఆయన వ్రాసినప్పుడు, వాటిని చదివి ,నవ్వి నవ్వి కడుపునొప్పులు తెచ్చుకుని ఏడ్చాం. పోనీ ఏదో సినిమాలు తీసికుంటున్నారుకదా అనుకుంటే, ఓ “కోతికొమ్మచ్చి” వ్రాసి, వాటిల్లోని కొన్నిటిని చదివి,ఎమోషనల్ అయిపోయి, గొంతుకలో ముద్ద దిగక,ఎవరితోనైనా పంచుకుందామనుకుంటే, ‘ఏదో’ గొంతుక్కి [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఉద్యోగం లో ఉండేటప్పుడే బావుండేదనిపిస్తూంటుంది. ఏదో వేళకి నిద్రలేవడం,ప్రొద్దుటే డ్యూటీ కి వెళ్ళి,అక్కడే భోజనం గట్రా ( మా ఇంటావిడిచ్చిందే !) పూర్తిచేయడం, సాయంత్రం ఏ ఏడింటికో కొంప చేరడం.ఓ రెగ్యులారిటీ ఉండేది. రిటైరయిన తరువాత, చెప్పేనుగా ప్రతీవారూ అనుకుంటారూ, వీళ్ళకేమీ పనీ పాటా లేదు. అయినా ఎప్పుడు పలకరించినా, ఏదో దేశాన్ని ఉధ్ధరించినట్లుగా, మాట్లాడతారూ, ” లేదండీ, ఇవేళ అసలు టైము లేదూ, మా అగస్థ్యకి క్రెచ్ శలవూ,కోడలొక్కర్తే ఉంటుందీ” అనో, ” మా అల్లుడు [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డేట్ ఆఫ్ బర్తులూ కన్యూజన్లూ….

    ఈ మధ్యన మన ఆర్మీ ఛీఫ్ జనరల్ సింగ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక దుమారం లేచింది. వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఆయన మొదట్లో 1950 లో పుట్టానని, చెప్పారుట, సర్వీసు రికార్డుల్లో 1951 అన్నారుట. ఎవడో పనీ పాటు లేనివాడు ఈ గొడవంతా బయటపెట్టాడు. మొదట ఇచ్చిన తేదీ ప్రకారం ఆయన క్రిందటేడాదే రిటైరవాలనీ, అన్యాయంగా ఇంకో డేట్ ఇచ్చి, ఇంకో సంవత్సరం ఎక్కువ సర్వీసు చేస్తున్నారనిన్నూ ప్రస్తుత సమస్య. [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

<a    టి.వి. లో న్యూసు చూద్దామంటే, ఏం చూపిస్తారూ-హైదరాబాద్ లో ఓ హై ప్రొఫైల్ హత్య జరిగిందిట. అందులో విక్టిం ఓ కేంద్రమంత్రి మేనకోడలు, నిందితుడు ఓ రాష్ట్ర మంత్రి చుట్టం. పుట్టపర్తి లో సత్యసాయిబాబా జీవించి ఉన్నంత కాలం,అక్కడ జరిగేవి ఏవీ ఎవరికీ తెలిసేవి కావు. ఇప్పుడో, రోజుకో విషయం బయట పడుతోంది. నిజంగా ఈ వార్తలు చూస్తూంటే కడుపు నిండిపోతూంది ! కరుణానిధేమో, వీలైనప్పుడల్లా తీహార్ జైలుకి వెళ్తున్నాడు, కూతుర్ని కలవడానికి, అసలు తను [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అందుకే అంటారు..

   ఎప్పుడూ మనం ఒక రచయితని గురించి,ఆయన వ్రాసిన ఏదో ఒక పుస్తకాన్ని చదివేసో, వినో ఓ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు. నాకున్న దురలవాట్లలో అదీ ఒకటి లెండి. జీవితంలో ఎప్పుడూ అలాటి పని చేయకూడదనీ, ఓపికుంటే,చేతికొచ్చిన ప్రతీ పుస్తకమూ చదవాలని నిశ్చయించేసికున్నాను. అయినా మనకీ ఓ ఇష్టాఇష్టాలు కూడా ఉంటూంటాయి కదా.ఏదో ఓ genre మీద, చినప్పటినుండీ, ఒక ఇష్టం అనేది, ఏర్పరుచుకుని, అలాటివే చదువుతూంటాము. ఈ సందర్భం లో నాకు చాలా ఇష్టమైనవి, హాస్య/ తేలికపాటి (light) [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అబ్బ..ఇంకా టైముందికదా…

   ఇదివరకటి రోజుల్లో,ప్రతీ పనీ ఓ ప్లాన్ చేసికుని చేసేవారు, ఒక్క పిల్లల్ని పుట్టించడం తప్పించి ! దానికి ఓ ప్లానూ వ్యవహారం ఉండేవి కావు! ఇంట్లో ఎంతమందుంటే అంత ఆనందం, సంతోషమూనూ! అలాగని ఆ పిల్లలు ఏదో గాలివాటానికి పెరిగినవాళ్ళు కాదు.పిల్లలంటూ ఉండాలే కానీ, ఓసారి వచ్చిన తరువాత, ఓ పధ్ధతి లోనే పెరిగారు.ఈమాట మాత్రం ఎవరూ కాదనలేరనుకుంటాను.    ఇప్పుడు వ్రాసేది,ఈ రోజుల్లో చూస్తున్న last minute rush గురించి.ఎవరు చూసినా, పోనిస్తూ ఇంకా టైముందిగా అనేవాడే.ఉదాహరణకి, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం..

   మొన్ననో టపా వ్రాశాను, నాకు మిస్టరీ షాపింగ్ విషయంలో జరిగిన ఒక అనుభవం గురించీ.. ఆ వ్యవహారం ఓ కొత్త మళుపు తీసికుంది.చెప్పానుగా, SOTC వాళ్ళకి నన్ను ముందుగా 20,000 రూపాయలు ఎడ్వాన్సు గా కట్టమన్నట్లూ, ఆ తరువాత వాళ్ళు ఆ డబ్బుని రిఎంబర్స్ చేసేటట్లూ. నేనా ఒప్పుకునేది? అసలే కోనసీమ వాడిని,ఛట్ నేనేమీ ముందర డబ్బులు కట్టనూ పొమ్మన్నాను. ఆ ఏజన్సీ వాళ్ళకీ ఏవో డెడ్ లైన్లూ అవీ ఉంటాయి కదా, ఏదో మాట తేడా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఒక ఆసక్తికరమైన నివేదిక…

హెల్ప్ ఏజ్ ఇండియా వారు ఒక సర్వే నిర్వహించి, ఒక ఆసక్తికరమైన నివేదిక సమర్పించారు.. ఒకసారి ఓపిగ్గా చదివి ప్రతీవారూ ఆత్మశోధన చేసికోవలిసిన సమయం వచ్చిందని నా అభిప్రాయం. 147, 148 నెంబర్ల పేజీలు తప్పకుండా చదవండి.. ఏదో ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ ఏడాదికోసారి తల్లితండ్రులకి ఓ బొకే, ఓ గిఫ్టూ ఇచ్చేసో, ఓ టపా వ్రాసేసో, ఊరుకోవడం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో అస్సలు ఖర్చు లేని పని–ఒకసారి పలకరించడం !

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers