బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

epaper-sakshi-com (13)epaper-sakshi-com (14)    శ్రీ ముళ్ళపూడి వారు అస్తమించిన వార్త విన్న తరువాత,అసలు కంప్యూటరు ముందు కూర్చుని వ్రాయాలనే అనిపించడం లేదు. కానీ ఎన్నాళ్ళు? Life must go on… ఈ నాలుగైదు రోజులూ, మా దగ్గర ఉన్న ‘రచన’ పాత సంచికలన్నీ తీసి, అప్పుడెప్పుడో బాపు-రమణ ల గురించి వేసిన ప్రత్యేక సంచికతో సహా అన్నీ చదివాము. అలాగే ఆయన వ్రాసిన రచనలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేసి, ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటున్నాము. బాపూ గారికి గానీ, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-భగవంతుడు ఆడే ఆటలు…

   ఈవేళ ప్రొద్దుట హారం లో నవతరంగం లో ‘బాపు ఇక వంటరి వారు…’ అనే శీర్షిక చూసి, ఏమిటీ బాపూ రమణల జంట విడిపోయి, వారు తీసే కొత్త సినిమాకి రచయితని మార్చారా ఏమిటీ అనే అనుకున్నాము కానీ, తెలుగువారి అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వారు ఇకలేరని, అసలు తల్చుకోడానికే అవలేదు.అప్పటికే, శ్రీ ఎం.వి.అప్పారావుగారి దగ్గరనుండి నా సెల్లులో ఓ మిస్స్డ్ కాల్ ఉంది. ఆయనకు తిరిగి ఫోను చేసి మాట్లాడదామంటే అసలు మాటలే రాలేదు.గొంతుక [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఈ మధ్యన నా టపాలలో వ్యాఖ్యలు పెట్టడం మానేశారు! అలాగని చూడ్డం మానేశారా అంటే అదీ లేదూ. రోజుకి కనీసం ఓ నూట యాభై దాకా సందర్శకులైతే వస్తూనే ఉన్నారు. బహుశా నేను వ్రాసేవాటితో మరీ మొహం మొత్తేసుంటుంది. నేనేం చేయనూ, నాకు తెలిసినదేదో వ్రాస్తూన్నాను.ఒక్కోసారి ఏమీ లేకపోతే నేను చదివినదాని గురించి మీ అందరితొనూ పంచుకోవడం.అలాగని మరీ posting for posting sake అనుకోకండి.    మొన్నెప్పుడో పుణె లోని ఆంధ్రసంఘానికి వెళ్ళాను. నేను దానిలో [...]

బాతాఖాని-లక్ష్మిఫని కబుర్లు-అక్కడికి మనవాళ్ళు తక్కువైనట్లు-2

   ఆమధ్యన ఈ టపా మొదటి భాగం వ్రాశాను. మనవాళ్ళు ఎక్కడికైనా మార్కెట్ కి వెళ్తే కొనేవి handbags. ఏమిటేమిటో మోడెల్స్ కొంటారు. ఆఫీసుకెళ్ళేటప్పుడు వేసికోడానికి వీలుగా ఉంటుందనొకటి, ఏ పార్టీకైనా వెళ్ళేటప్పుడు వేసికోనాటికోటీ, సరదాగా సాయంత్రం బయటకెళ్ళడానికోటీ, అడక్కండి. కొన్న మొదట్లో బాగానే ఉంటుంది.వాడగా వాడగా దాంట్లో లోపాలొక్కక్కటీ బయట పడతాయి. మరీ చిన్నగా ఉంటే సెల్లూ, కళ్ళజోడూ పట్టవు.పోనీ అవన్నీ పట్టేటట్లుగా కొనుక్కుంటే మరీ handbag లా కాక, చేతిసంచీ లా ఉంటుందంటారు. రెండూ ఒకటే [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

epaper-sakshi-com (12) మనం ఎంతో అభిమానించే ఎ.ఆర్.రెహ్మాన్ ని మొదట పరిచయం చేసిన శ్రీ చంద్రశేఖర్ గారి గురించి ‘సాక్షి’ విశాఖపట్టణం ఎడిషన్ లో చదివినది, పైన ఇచ్చిన వ్యాసం.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నిన్న మా అబ్బాయి ఫోను చేసి చెప్పాడు, నా బ్లాగులు చదివిన తరువాత పూణె లో ఉంటున్న ఒకావిడ, తెలుగు పుస్తకాలకోసం రిజిస్టరు చేసికున్నారని. నాకైతే చాలా సంతోషం వేసింది.పరవాలేదూ,నేను వ్రాసే బాతాఖాని కబుర్లు, పూణె లోని వారూ చదువుతున్నారని తెలిసి బోల్డంత హాశ్ఛర్యపడిపోయాను!    ఇక్కడ గత సుమారు యాభైఏళ్ళనుండి ఉంటున్న కారణంగా,భాషాభిమానులు పడుతున్న తిప్పలేవో తెలిసే, మా అబ్బాయి ప్రారంభించిన గ్రంధాలయం లో తెలుగు పుస్తకాలు పెట్టించింది.ఆ పుస్తకాలు సుమారు 400 పైచిలికు, చదివి, వాటిగురించి [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఈమధ్యన నాకేమీ బాగుండడం లేదు!మా అబ్బాయీ వాళ్ళూ ఉండేచోట ఓ వంటమనిషి చేత వంట చేయిస్తారు. ఆవిడకొచ్చిన పధ్ధతిలో చేస్తూంటారు. నాకేమో, మా ఇంటావిడ గత 39 ఏళ్ళనుండీ, తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో పాపం నాకు నచ్చే పధ్ధతిలోనే చేస్తోంది. అందుకనే ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళవలసివచ్చినా, ఏదో మా మనవడూ, మనవరాలితో ఉండొచ్చనికానీ, తిండి విషయం లో మాత్రం, అంత చెప్పుకోడానికి ఏమీ లేదు. ఓ ఉప్పు సరీగ్గా ఉండదు, కారం విషయంలో నాకేమీ కంప్లైంటు [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఎరక్కపోయీ వచ్చానూ ఇరుక్కుపొయా….

   మొన్నెప్పుడో నా మిస్టరీ షాపింగుకోసం ఒక మెయిల్ వస్తే, ఏమీ ఆలోచించకుండా, ఈవేళ ( Feb 14th.) చేస్తానన్నాను. చేయడంకూడా ఎక్కడా-Mocha Restaurant ! అసలు దాన్ని మోకా అనాలో మోచా అనాలో కూడా తెలియదు!! దాన్ని మోకా అంటారుట, మా అబ్బాయి చెప్పాడు!ఏదో ఒకటీ, పేరులో ఏముందిలెండి? ఓ 550/- రూపాయల తిండి తిని, దానిగురించి evaluate చేయమన్నారు. ఒక్కడినీ అంత తిండెక్కడ తినగలనండి బాబూ, పోన్లే చూద్దాం అని వెళ్ళాను సాయంత్రం నాలుగింటికి.    గేటులోనే, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఆడుతు పాడుతు పనిచేస్తోంటే…

   ఇదేదో తోడికోడళ్ళు సినిమాలో పాటగురించి వ్యాఖ్యానం అనుకోకండేం. ఈ పాట పాడుకోవడం కోసం, సావిత్రి,నాగేశ్వర్రావు లాగ పొలాల్లోనే పనిచేయఖ్ఖర్లేదు. మామూలుగా ఇంట్లో కూడా పనిచేస్తూ పాడుకోవచ్చు.మనసుండాలంతే. ఇంట్లో ప్రతీ పనీ పెళ్ళామే చెయ్యాలంటే కుదరదుగా మరి.ఈ మధ్య ఓ నాలుగురోజులు, మా ఇంట్లోనే ఉండవలసొచ్చిందని వ్రాశానుగా, ఆ సందర్భంలో ప్రతీ రోజూ మా నవ్య స్కూలు బస్సెక్కేటప్పుడు, నేను కూడా వెళ్ళేవాడిని. తనకి బై చెప్పినట్లుంటుందీ, అదే బస్సులో వచ్చే మా తాన్యా, ఆదిత్య లను చూసినట్లుంటుందీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ప్రాణానికి ఎంత హాయిగా ఉందో…

   గత నాలుగు రోజులుగా, మా కోడలు చెన్నై వెళ్ళడంతో మేము మా అగస్థ్య,నవ్యలతో గడపడానికి, మా ఇంటికి వెళ్ళాము. నవ్య స్కూలుకీ, అగస్థ్య క్రెచ్ కీ వెళ్ళడంతో, పగలంతా ఖాళీయే. సరే అని నెను మాత్రం, మేముండే ఫ్లాట్ కి వచ్చి, కంప్యూటరు కెలుకుతూ, ఏదో భోజనం టైముకి ఇల్లు చేరుతూ, కాలక్షేపం చేస్తున్నాను. అబ్బాయేమో, తన లైబ్రరీ హడావిడిలో ఉన్నాడు. ఇంగ్లీషు పుస్తకాలకోసం చాలా మంది సభ్యులయ్యారు కానీ, తెలుగు పుస్తకాలకోసం అంత ఉత్సాహం చూపడంలేదు. [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers