బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అమ్మమ్మలు,నాన్నమ్మలు-2

   ప్రతిఫలాపేక్ష ఏదీ లేకుండా, పసిపాపలకి సేవ చేసేది ఈ అమ్మమ్మలూ,నాన్నమ్మలే అని నా అభిప్రాయం! ఆఖరికి తల్లితండ్రులు కూడా ఆ కోవలోకి చేరరేమో, ఎందుకంటే, అందరూ కాకపోయినా కొంతమంది తల్లితండ్రులైనా, ఈ పిల్లో పిల్లాడో పెద్ద అయినతరువాత తమకి ఆసరాగా ఉంటాడని ఆశించేవారే!కొంతమందికి నా అభిప్రాయం కోపం తెప్పించొచ్చుననుకోండి, కానీ ఫాక్ట్ ఈజ్ ఎ ఫాక్ట్ ! అందుకేనేమో చాలామందినుండి వింటూంటాము, ‘వాణ్ణి ఎంతో కష్టపడిపెంచామూ, చూశారా ఆ మాత్రం కృతజ్ఞతైనా లేకుండా, పెళ్ళాం మాటల్లో పడి, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- అమ్మమ్మలూ నాన్నమ్మలూ

   గత వారం రోజులనుండీ, నేనూ, మా ఇంటావిడా బిజీ అయిపోయాము. నేనైతే, కొంతలోకొంత, ఒకటో రెండో టపాలు పోస్ట్ చేసికోకలిగాను. మా ఇంటావిడకి ఆ ఛాన్సుకూడా రాలేదు, ఆవిడకి మా మనవడు అగస్థ్యతోనే సరిపోతుంది. వాడేమో, ఈవిడని చూడ్డం తరవాయి, మీదకెక్కేస్తాడు. ఉండడం అంటే, ఇంకో ఫ్లాట్ లో ఉంటున్నాము కానీ, ఈవిడకెప్పుడూ వాడి ధ్యాసే! ఏదో ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి సరిపోయింది కానీ, అదే ఏ రాజమండ్రీలోనో ఉండి ఉన్నట్లైతే, నా ప్రాణం మీదకొచ్చేది, నా [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

    చిన్నప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే, ఎంతో ఉత్సాహంగా ఉండేది. ముందురోజు, రేడియో లో దేశాద్యక్షుడి ప్రసంగం, ఆ తరువాత జాతీయ గీతాలాపనా, అబ్బో ఆనాటి మన దేశాద్యక్షులు, ఎవరికి వారే చాలా గొప్పవారు. మర్నాడు అంటే జనవరి 26 న, జాతీయ బహుమతులు భారత రత్న, పద్మ విభూషణ్, భూషణ్, శ్రీ వచ్చిన వారి పేర్లు తెలిసికోడానికి, ఎంతో ఆత్రంగా, ప్రొద్దుటే ఏడు గంటలకి, రేడియో లో వచ్చే తెలుగు వార్తలూ, వాటిని చదివే శ్రీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   చిన్నప్పుడు, చంటి పిల్లల్ని జోకొట్టాలంటే, ‘చందమామ రావే జాబిల్లి రావే’ లాటివీ, ఆ తరువాత్తర్వాత ‘జో అచ్చుతానంద జోజో ముకుందా‘, ఆ తరువాత స్వాతిముత్యం లో సుశీలమ్మ పాడిన’ వటపత్ర శాయీ…’ లాటి అద్భుతమైన పాటలు పాడేవారు అమ్మలైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా. దోమల మందులకి దోమలు ఇమ్యూన్ అయిపోయినట్లు, చంటి పిల్లలు కూడా, ఆ పాత పాటలకి నిద్రపోవడం మానేశారు. మరి ఇప్పుడేం కావాలిట? దబంగ్ లోని ‘మున్నీ బద్నాం హుయీ.., లేక తీస్ మార్ ఖాన్ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పిల్లలు, ఎడాలు

   ఇదివరకటి రోజుల్లో అంటే, మా ముందు తరం వారి రోజులన్నమాట, ఇంటికి ఎంతమంది పిల్లా పాపా, పాడీ ఉంటే అంత సుభిక్షమనే సదుద్దేశ్యంతో ఉండేవారు.అందుకనే ఏ ఇంట్లో చూసినా కనీసం, నలుగురైదుగురు పిల్లలుండేవారు. ఆనాటి పరిస్థితుల ధర్మమా అని, తిండికీ, బట్టకీ కూడా లోటుండేది కాదు. ఎవరి ఓపికనిబట్టి వారు చదువులూ, పెళ్ళిళ్ళూ కానిచ్చేవారు. క్రమక్రమంగా, న్యూక్లియర్ ఫామిలీలు వచ్చేశాయి, మహ అయితే ఇద్దరు పిల్లలతో సరిపెట్టేసికుంటున్నారు. అంతకంటె ఎక్కువయితే పోషించే ఓపికెక్కడిదీ? అప్పుడప్పుడు టి.వీల్లో మా [...]

బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు-Melville D’mellow

Melville D’mellow ఈవేళ సాక్షి పేపరు చదువుతూంటే నాకు అత్యంత ఇష్టమైన ఒక మహా వ్యక్తి గురించిన ఒక వ్యాసం కనిపించింది. నేను చేసికున్న అదృష్టమేమంటే, ఆయన దగ్గరనుండి నాకు రెండు ఉత్తరాలు వచ్చాయి. వాటిని,ఇదివరకు నా టపా లో ప్రస్తావించాను. మళ్ళీ ఇంకొకసారి ఆయన, శ్రీ Melville D’mellow ని గుర్తుచేసికోవడం చాలా బాగుంది. పైన ఇచ్చిన వ్యాసం సరీగ్గా కనిపించకపోతే ఇక్కడ నొక్కండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- చిరుగు కూడా మంచిదేట !!

   ఇదివరకటి రోజుల్లో, వేసికున్న చొక్కాకి,కట్టుకున్న చీరకీ, పంచకీ చిరుగు కనిపిస్తే, ‘ఉత్తరేణి కుట్టు’ అని వేసికుని మళ్ళీ కట్టుకునేవారు. వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి ఉండేవి, వారు కట్టే బట్టలు. పాత సినిమాల్లో చూసేవారం-బాగా బీద గా ఉండే, బడిపంతులు గారో, లేకపోతే ఏ ఇంట్లోనో వంటలు చేసే ఆవిడనో చూపించవలసివస్తే, తప్పని సరిగా ఎక్కడో అక్కడ ఓ చిరుగు చూపించేవారు.అది ఆ సినిమా దర్శకుడి,ప్రావీణ్యం చూపించినట్లన్నమాట.It was symbolic of the poverty, that [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   చూస్తూ ఉంటాము, కొంతమందికి ఓ అలవాటుంటుంది.కనిపించినదల్లా కొనేయడం. అది అవసరమా కాదా అన్నది చూసుకోరు. ఇంటినిండా పేర్చేసికోవడమే! ఏమిటీ అని అడిగితే అదో సరదా అంటారు. ఒక్కళ్ళూ ఉన్నంత కాలం అయితే ఫరవాలేదు. కానీ, ఏ అత్తారింటికో వెళ్ళినప్పుడు, అక్కడ కూడా ఇదే అలవాటు కంటిన్యూ అవుతూంటుంది. అందుకనే, వాళ్ళుండే ఫ్లాట్లు ఒక్కొక్కప్పుడు సరిపోని పరిస్థితి ఏర్పడుతూంటుంది! ఇదివరకటి రోజుల్లో అయితే, అంత availability ఉండేది కాదు కాబట్టి, పెద్ద సమస్య అయేది కాదు. అవసరమున్నదేదో కొనుక్కోవడం, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-తెలిసింది ఇతరులతో పంచుకోడం

   రాజమండ్రీ లో ‘భక్తి’ టి.వి. చానెల్ కి అలవాటు పడిపోయి, పూణె తిరిగి రాగానే,Airtel వాడిస్తున్నాడు కదా అని, ఏడాది subscription కట్టేసి తీసికున్నాను. ఏం పోయేకాలం వచ్చిందో, ఆ చానెల్ కాస్తా తీసేసి, ABN ఇచ్చాడు.ఉన్న న్యూసు చానెళ్ళు చాలకనా, ఇంకో న్యూసూ అనుకున్నాను కానీ, ఏడాదికీ కట్టేయడం వలన, చచ్చినట్లు అట్టేపెట్టుకున్నాను, ఏం చేస్తాను? డిశంబరు 1 న ఆ పుణ్యకాలం కాస్తా పూర్తవడం తో, Reliance Big TV లోకి మారిపోయాను. దీంట్లో [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం

   ఈవేళ మా మనవడు చి.ఆదిత్య స్కూల్లో grandparents’ day ఉందంటే, నేనూ, మా ఇంటావిడా వెళ్ళాము.ప్రొద్దుటే, మా అమ్మాయి తను కారులో తీసికెళ్తానని చెప్పింది కానీ, మళ్ళీ తను ఇంతదూరం రావడం ఎందుకని మేమే ఆటో లో వెళ్తామన్నాను. బయటకి వచ్చి ఓ ఆటో వాడిని ఫలానా చోటుకి వస్తావా అని అడగ్గానే, కొద్దిగా ఆలోచించి 70 రూపాయలవుతుందీ అన్నాడు. నేను వెంటనే సరే అన్నాను. అలా తను అడగ్గానే ఒప్పుకునేసరికి, ఏమైనా తక్కువ చెప్పేనా అని [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers