బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–http://tenderleaves.com/

పూణె లోని తెలుగువారందరూ,ఏ గ్రంధాలయానికీ వెళ్ళఖ్ఖర్లేకుండా, హాయిగా మీ వద్దకే వచ్చే ఓ సదవకాశం.ఒక్కసారి అందులోని పుస్తకాల జాబితా చూశాక మమ్మల్ని సంప్రదించండి. Online Library

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పూణె లో తెలుగువారికి సదవకాశం.

    నేను పూణె లో గత 47 సంవత్సరాలనుండీ ఉంటున్నాను.నాకు తెలుగు అంటె విపరీతమైన అభిమానం. వచ్చిన కొత్తలో అంటే 1963 లో అప్పుడప్పుడు తెలుగు వార, మాస పత్రికలొచ్చేవి.కొంతకాలం తరువాత, తెలుగు దిన పత్రికలు రెండో రోజుకి వచ్చేవి.రైల్వే స్టేషనులో ఒక్కొక్కప్పుడు, డిటెక్టివ్ నవలలు దొరికేవి.ఎప్పుడైనా మనప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రమే, తెలుగు పుస్తకాలు( నవలలలాంటివి) కొనుక్కుని, వాటినే మళ్ళీమళ్ళీ చదుకోవలసివచ్చేది.ఆంధ్రా అసోసిఏషన్ కి వెళ్దామంటే, బాగా దూరం. అయినా అక్కడ తెలుగు గ్రంధాలయం ఉందో లేదో [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలుభాషా దినోత్సవం

    ఆ మధ్యనెప్పుడో ఓ టపా వచ్చింది.ఈ నెల 29 న మాతృభాషోత్సవం సందర్భంగా, తెలుగుబాట కార్యక్రమం జరుపుతున్నారని.ఏదో మన భాషమీదుండే అభిమానం కొద్దీ, తెలుగుబాట కార్యక్రమంలో, నేనూ పాలుపంచుకుందామనే సదుద్దేశ్యంతో, భాగ్యనగరానికి వెళ్ళాను.వారిచ్చిన లింకులో నా పేరు నమోదుకూడా చేశాను.అందులో,వారు చెప్పిన ప్రకారం, కార్యక్రమంలో మార్పులూ, చేర్పులూ ఉంటే తెలియచేస్తామన్నారు. నా ఐ.డి.,సెల్ నెంబరూ ఇచ్చాను.     శుక్రవారం 27 కే చేరుకుని, రామూ తో మూడుగంటలు గడిపాను( ఆ విషయాలన్నీ ఇంకో టపాలో)వాళ్ళ కార్యాలయంలో.శనివారం [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- భాషకొచ్చిన తిప్పలు !!

    నేను ఈ మధ్య చెన్నై ట్రైనులో వెళ్ళానుగా, అప్పుడు పగటి ప్రయాణం అంతా ఆంధ్రదేశం చూస్తూ గడపగలిగాను.నాతో ప్రయాణం చేస్తున్న ఓ తమిళమాయన, ప్రతీ పెద్ద స్టేషనూ దేనికి ప్రసిధ్ధో చెప్తూ వచ్చారు( తినే వస్తువులు!). గుంతకల్లు లో ఉప్మా చాలా బాగుంటుందన్నారని, ప్లాట్ ఫారం మీదకొచ్చాను. దగ్గరలో విజయా డైరీ వారి కౌంటరు కనిపిస్తే, అక్కడికి వెళ్ళాను.చూస్తే ఏముందీ? పైన చూపించినది కనిపించింది!ముందుగా అనుకున్నాను- అహో మన తెలుగువారు ఎంత ధార్మికులో పేడ ని [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”ఇంకోతికొమ్మచ్చి”

    శ్రీ వెంకటరమణగారితో, మూడు గంటలు గడిపి, వారిరువిరి ఆశీర్వచనాలూ తీసికొని, క్రిందకు వచ్చాము. రమణగారు చెప్పిన ప్రకారం, రెండో రోజు వచ్చి శ్రీ బాపూ గారిని కలవ్వొచ్చూ అని.ఒకవైపున చాలా నిరుత్సాహం చెందాము-అయ్యో బాపు గారిని చూడలేకపోతున్నామే అని.తిరుమల దాకా వెళ్ళి ఆ శ్రీవెంకటేశ్వరుని దర్శనం అవకపోతే మరెలాగుంటుందండీ? శ్రీ రమణగారి ని చూడకలిగాము, అయినా అదో feeling of emptiness , ఇద్దరినీ ఒకేరోజున కలిస్తే ఉండే సంతోషం, ఆనందం వేరు.     క్రిందకొచ్చేసరికి, [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–”Paid News”-PCI Report

www.outlookindia అందరికీ తెలుసు, మన మీడియా ఎన్నెన్ని ‘నిజాల్ని’ చెప్తుందో !!దానిమీద Outlook పత్రిక లో వచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి అందరూ చదివితే బాగుంటుంది. అందులో చివరన ఇచ్చిన PCI report ఇక్కడ చదవండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

   నిన్నటినుండి చానెల్స్ లో మొదలెట్టారు- వాడెవడి దగ్గరో డ్రగ్స్ పట్టుకున్నామనిన్నూ,తెలుగు హీరో తమ్ముళ్ళట, వాళ్ళని పట్టుకున్నామనిన్నూ. ఈ వేళైతే కొన్ని చానెల్స్ కొంతమంది రాజకీయనాయకుల వారసులూ, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటులూ,వాళ్ళ పేర్లు ప్రొద్దుటినుంచీ చూపిస్తున్నారు. మధ్యాన్నం, ఆ హీరోలు లైవ్ లో వచ్చి, మాకేం తెలియదు మొర్రో అంటున్నారు. ఎం.పీ. అయితే అసలు మాకొడుక్కి డ్రగ్ అంటేనే తెలియదు పొమ్మన్నాడు.    ఒకవైపున ప్రభుత్వం ఆంధ్రదేశం లో రేషను షాపుల్లా,left ,right and centre మద్యం షాపులు [...]

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ‘కోతికొమ్మచ్చి’-Live

    చెన్నై వెళ్ళడానికి ముందురోజు నుండీ, పూణె నుంచే బాపూ గారి ఇంటి నెంబరు ప్రయత్నించగా, మొత్తానికి వారి అబ్బాయి దొరికారు. శ్రీ బాపూ రమణగార్లు హైదరాబాదు వెళ్ళారనిన్నూ, శుక్రవారానికి చెన్నై తిరిగి రావొచ్చనీ చెప్పారు. శుక్రవారం నాడు ప్రయత్నిస్తే, ఇంట్లో లేరనీ, మత్నాడు (శనివారం) ప్రొద్దుటే ప్రయత్నించమనీ చెప్పారు. మరీ ప్రొద్దుటే ఎందుకులే అనుకుని, 9.00 గంటలు దాటిన తరువాత శ్రీ రమణ గారికి ఫోను చేసి, ‘గురువుగారూ, నేను ఫలానా, నాకు జీవితంలో ఉన్న [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Landmark Quiz National Finals

    మా అబ్బాయి హరీష్, తన ఇద్దరు partners తో ఫైనల్స్ కి క్వాలిఫై అయినప్పుడే నిశ్చయించుకున్నాను, నేను కూడా తనతో చెన్నై వెళ్దామని, ఎంతైనా పుత్రోత్సాహం కదా!కార్యక్రమంలో కొద్దిగా మార్పేమిటంటే, మా కోడలూ,ఇంటావిడా,మనవరాలు, మనవడూ కూడా వచ్చారు! వాళ్ళు flight లో వెళ్తూ నన్నుకూడా రమ్మన్నారు. తెలుసుగా, నాకు గాలిలో ఎగరడం కంటె, భూమిమీదే రెండు కాళ్ళూ ఉంచుకోడం ఎక్కువ ఇష్టం.అంతేకాదు,నాకు ఎత్తులంటే భయం మూలంగా, నామానాన్న నన్ను train లో రమ్మని, వాళ్ళు ముందర [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Swine Flu, etc..etc..

    మెము రాజమండ్రి లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ, ఆంధ్రదేశానికి సంబంధించి మూడు ముఖ్యమైన సంఘటనలు- ఎలక్షన్లూ,వై.ఎస్ గారి మరణం, రామలింగరాజు అందరి నెత్తిమీదా శఠగోపం పెట్టడం- వీటికంటే, మాకు సంబంధించినంతవరకూ జరిగినదేమిటంటే Swine flu epidemic in Pune. మీరు రాజమండ్రీ లో ఉన్నారుకదా, పూణే లో Swine flu వస్తే మీకేమయిందీ అంటారు. అక్కడే వచ్చింది గొడవంతా.     మేము వెళ్ళిన మొదట్లో అడిగినవాడికీ, అడగనివాడికీ, కనిపించి పరిచయం అయిన ప్రతీవాడికీ,చెప్పడం- నేను రిటైరు [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers