బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-క్యాలెండర్లూ, డెయిరీ ల గోల !

    ఈ వేళ్టి బ్లాగ్గుకి థీం నిజం చెప్పాలంటే మా ఇంటావిడ ఇచ్చింది. తనకి ప్రవచనాలూ అవీ వింటూంటే తీరిక లేకపోయేసరికి నేను ఆ థీం ని ‘హడప్’ చేసేశాను! చెప్పానుగా ఆడవారికి మంచి మంచి ఆలోచనలు వస్తూంటాయి. వాటిని టైము చూసి ‘కొట్టేయడమే’ మనం చేసే నిర్వాకం !!    ఈ న్యూ యియర్ వచ్చేటప్పడికి ఏడాదినుండీ మనకి పలకరించడానికి తీరికలేని వాళ్ళందరి ఫోన్ నెంబర్లూ ముందేసికొని ఇంక ఫోన్లు చేయడం మొదలెడతాము.ఏదో ‘విష్ యు ఏ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–HAPPY 2010

New Year శ్రీ దూర్వాసుల వారి ధర్మమా అని శుభ్రంగా అచ్చ తెలుగులో శుభాకాంక్షలు తెలుపుకోకలుగుతున్నాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-గోళ్ళు !

    నేను ప్రతీ శనివారం, లోకల్ లో పూణే స్టేషన్ కి వెళ్ళి, తెలుగు వార పత్రికలు స్వాతి, ఆంధ్రభూమి, నవ్య తెచ్చుకుంటూంటాను. అదే లోకల్ లో తిరిగి వచ్చేయడమే. క్రిందటి శనివారం వెళ్తూంటే, నా ఎదురుగా ఒక యువ జంట కూర్చొని ఉంది. నేను అతనినే అబ్జర్వ్ చేస్తూ కూర్చొన్నాను.ఆమె కిటికీ లోంచి చూస్తూ కూర్చొంది. ఈ అబ్బాయి కొంతసేపు కూర్చొని, ఒక చేత్తో గెడ్డం క్రింద ఉన్న ఓ పొక్కు ని ఊరికే కూర్చొని [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Online Bus Reservations

ఇన్నాళ్ళూ ఎయిర్, రైల్వే లకే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనుకునేవాడిని.ఇప్పుడు దేశం లో ఎక్కడికైనా బుక్ చేసికోవచ్చని తెలిసింది.ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే మంచిదే. ఊరికే కోప్పడకండి. ఈయనకేమీ పనిలేదూ,అస్తమానూ ఏదో లింకులు పోస్ట్ చేస్తూంటాడూ అని. అదో సరదా! నాకు తెలిసిన,నచ్చిన ఏవిషయమైనా ఇతరులతో పంచుకోవడం!All India Bus Services

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-ప్రవచనాలు

   ఈ వేళ సాయంత్రం మా ఇంటికి వెళ్ళినప్పుడు, మా మనవరాలు చి. నవ్య ఓ ఇంగ్లీషు పుస్తకం ఇచ్చి దానిలో ఉన్న కథ చదివి చెప్పమంది. మా చిన్నప్పుడు ఇలాటివి ఏమీ చదివిన జ్ఞాపకం లేదు.మా పిల్లలు ఎప్పుడూ నన్ను ఇలా అడగలేదు. చెప్పానుగా అన్ని విషయాలూ మా ఇంటావిడే చూసుకొనేది.పిల్లలు ఎలా చదువుతున్నారూ అని ఎప్పుడూ అడిగిన పాపానికి పొలేదు! ఏదో నేను ఎక్కడా వీధిన పడకుండా లాగించేశాను. ఇప్పుడు అలాగ కాదే. నాకు చెప్పడం [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Train Timings ఏదో వ్రాయాలని రాసేయడమే కానీ, ఈ పైన ఉన్నదాంట్లో తప్పేమిటో తెలియడం లేదు. పై బోర్డ్ లో రైళ్ళు రావలసిన టైము వ్రాశారు. క్రింద బోర్డ్ లో అవి యాక్చుఅల్ గా వచ్చే టైము వ్రాశారు.ఇది ఆ చదివిన ‘విలేఖరి’కి అర్ధం అవకపోతే రైల్వే వాళ్ళ తప్పు కాదుకదా !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-క్రొత్త పరిచయం

   ఈ వీకెండంతా మా అబ్బాయీ,కోడలూ, మనవరాలితో గడిపి ప్రొద్దుటే మా ‘గూటి’కి చేరాము. మధ్యాహ్నం ‘సుందరకాండ’ సినిమా వస్తూంటే చూస్తూ కూర్చొన్నాను.సాయంత్రం 5 దాకా దానితో కాలక్షేపం అయింది.సరే కంప్యూటర్ దగ్గరకు వద్దామనుకుంటే, అప్పటికే మా ఇంటావిడ అక్కడే సెటిల్ అయి కనిపించింది. ఇప్పుడే కూర్చొన్నాను,అప్పుడే తయారా అంది.ఇదికాదు పధ్ధతీ అని రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో ‘మీ ఫ్రెండెవరో ఆన్లైన్ లో హల్లో అంటున్నారూ, చూడండి’ అంది. దొరికిందే చాన్స్ అని వచ్చి చూస్తే ఇందుకూరి శ్రీనివాస [...]

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–వామ్మోయ్

Cost of Lower KG బ్రతికిపోయాను !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–’జైసే కో తైసా’

    కొంతమందికి నోట్లో ఏదో నములుతూ మాట్లాడడం అలవాటు. రికీ పాంటింగ్ ని చూడండి, ఫీల్డ్ లో ఉన్నంతసేపూ ఏదో (చూయింగ్ గం అనుకుందాము) నములుతూనే ఉంటాడు.అది తన అలవాటు కావొచ్చు లెక అవసరం అవొచ్చు. అది ఈ నవయుగంలో తప్పు కాకపోవచ్చు. కానీ మాకు చిన్నప్పుడు ఓ సంగతి చెప్పారు-ఎప్పుడూ నోట్లో ఏదో మేక లాగ నెమరేస్తూ మాట్లాడకు అని. ఈ విషయం పెద్దవారితో మాట్లాడేటప్పుడు తప్పకుండా పాటించమనేవారు.ఇప్పటి వారికి ఇది చాదస్థంగా అనిపించొచ్చు. కానీ [...]

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఇలాగ ఉండాలి

online పట్టువదలని ‘విక్రమార్కిణి’

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers